పుట:సత్ప్రవర్తనము.pdf/13

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

సత్ప్రవార్తనము


సుండెను, దానిపేరు కనక పల్లియని, తొలుత నది పల్లీయే. కొని క్రమక్రమమున నది గ్రామమయ్యెను. ఐదువందలగృహములు గల గ్రామ మనఁబడుననియు, వేయి గేహములుగలది మహా గామ మనబడుననియుఁ బెద్దల యభిప్రాయను. గోదావరికి దక్కినపుదెస నాకనకవల్లి యుండును, పానోదక మా గోదావరీ నుండియే వారికి లభించును. గ్రామమున నూతులు కలవు. కాని యవి క్షారోదక సంభృతములు, స్నానమున కుపయోగించును, "వేసవి కాలమున నవి యించుక 'బాగుండును. వంటకుఁ కూడ నపుడవ్వాని సందలి యాడువారు యోగింతురు. కానీ తెల్లని బియ్యము పండిన పిదకు నన్న మెఱగనుండును. క్రొత్తరంగు తెచ్చి పెట్టు సానుమర్థ్య మాజలమునకుఁ గలుగుటయే యొక గొప్పయని గొందఱు వినుతింతురు. అకాలమునందును ద్రాగవలెనన్న వారు శక్కరఁ జేర్చే త్రాగుదురు. జలగుణ మప్పుడుకూడ నించుక గానఁబడును.

కనకవల్లియందు నాలుగు జూతులవారు నివసింతురు, ఒక్కొక్క భాగమున నొక్కొక్కబోతివారిండ్లు కట్టుకొనిరి. అందు దక్షిణ భాగమున క్షత్రియులు, నుత్తరభాగమున వైశ్యులు నుండిరి. క్షత్రియులు దారస్వభావులు, వారికి ధనము కంటే మర్యాదయే యమూల్యధనము, మరియాద కించుక యపాయము గల్గినఁ బ్రాణములం దాల్పఁజాలనంత పట్టుదల వారలకుఁ గలదు. అది మొండి పట్టుదలచుని కొందరందురు. జూతి ప్రతిష్ఠ, యమూల్యము. దానం గాపొడుకొనిన సర్వము మేలగు, అది పోయిన సర్వ శ్రేయస్సులు పోపును. మర్యాదయే భూషణము. అది ముత్తమ పురుషార్థము నొసంగఁజాలును. తక్కిన పురుషార్థముల నిచ్చునని వేఱుగాఁ జెప్పషలయునా ?