పుట:సకలనీతికథానిధానము.pdf/61

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

55


ఆ.

వచ్చి యుష్ణమూర్తి నచ్చట సేవించి
పోవునపుడు మంత్రిపుత్రు జూచి
మమ్మ గూడిరమ్ము మాపురి కనపోయి
చిత్త మద్భుతంబు జెంది మగుడి.

320


వ.

వచ్చి యవ్వార్త వినిపించిన నతని దోకొని విక్రమార్కుం డచ్చటి కరిగి.

321


ఉ.

ఆవసుధాధినాథుఁడు ప్రియంబున ముందటిభూమి గాంచె గో
దావరివారిమగ్నజనతాఘనకల్మషతాపవిస్ఫుర
ద్దావశృశానుతీవ్రపరిదాహశిఖాగణదహ్యమానకా
ప్లావనవృష్టిమేఘుటలస్ఫుటభాద్రపదాదిశధ్వరిన్.

322


వ.

తొల్లి యచ్చట శేషుండు యజ్ఞంబు సేయుచుండ అగ్నిహోత్రంబు మీఁద ప్రవహించుటం జేసి యది యుష్ణతీర్థంబునం బరగె.

323


తే.

ఉష్ణలింగంబు భజియించె నుర్విభర్త
యచట నారాత్రి వసియింప నర్ధరాత్రి
యప్సరస్త్రీలు వచ్చి యయ్యభవు గొలిచి
సాహసాంకుని దోకొని చనిరి దివికి.

324


వ.

అ ట్లరిగి తమ్ము వరించి తమలోకం బేలుచుండు మనిన నొల్ల మదీయమంత్రిపుత్రుని వరియించి తన్మనోరధంబు సల్పు డనిన నట్ల కాకయని యప్పటిచోటనే డించి యరిగిన.

325


క.

పురి కేతెంచెను విక్రమ
ధరణీపతి యప్సరసలు తన్మంత్రిసుతున్
వరియించి కొలుచుచుండిరి
విరోచనసుత నింక నొకటి వినుమని పలికెన్.[1]

326
  1. విరోచనకుమార యొకటి వినుమని పలికెన్.