పుట:సకలనీతికథానిధానము.pdf/56

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

సకలనీతికథానిధానము


సీ.

చాంద్రగుప్తక్షితీశ్వరుఁడు దేశాంతర
        మరుగుచో తుహినభూభరముపొంత
ఘనుఁడు త్రికాలజ్ఞుఁడను సిద్ధు బొడగని
        మ్రొక్కిన నాసిద్ధముఖ్యుఁ డనియె
నెవ్వరి కిచటకిని నేతేరరాదు నీ
        వెట్లు వచ్చితివి నీ కిత్తు నెద్ది
యని గంతయును దండమును గరణియుగూడ
        నిచ్చి తన్మహిమల నెఱుఁగజెప్ప


తే.

అందికొని వచ్చు తెరువున నధిపుఁ డొకఁడు
రాజ్యహీనత్వ మొంది యరణ్యవీథి
దీనదశ చెంది తన్ను నర్థించుటయును
సిద్ధుఁ డిచ్చిన యవి యిచ్చి క్షితివరుండు.

295


వ.

వానిమహిమ దెల్పువాఁడై యిట్లనియె.

296


తే.

గంత ధరియింప మేదినీకాంతుఁ డగును
కరణి మోపిన ప్రాణసంగతులు గలుఁగు
దండధరుఁడైన రిపులదోర్దర్ప మణంచు
ననుచు నుపదేశ మిచ్చి దా నరిగె బురికి.

297


వ.

మఱియొకవిశేషంబు వినుమని యిట్లనియె.

298


క.

సోదరులు పాళ్ళుకొరకై
వా దడిచిన పిన్న పెద్ద వరుసానుగతిన్[1]
వా దడఁచి పంచిపెట్టిన
భూదేవుల వేల్పు లనుచు బొగడుదు రార్యుల్.

299


వ.

అది యెట్లనిన.

300
  1. పిన్న పెద్ద వరుస ననుగతిన్