పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/70

ఈ పుట ఆమోదించబడ్డది

45



నిమ్మపళ్ళు వడికట్టి తిరిగి రమ్మనుము
చిన్ననాటివి రెండు చీటి అంగీలు
జీడిపళ్ళు వడికట్టి తిరిగి రమ్మనుము
చిలుకల్లు తిన్నాయె జీడిపళ్ళు
హంస ల్లుతిన్నా యె అంజూరపళ్ళు
హంసతిన్న పండు హండాలుకట్టి
చిలుకతిన్నపండు చిక్కాన పెట్టు.

లఘుటీక

మొదటిఖండం

2. వింజరపురేవు = కాకినాడ సమీపంలోఉంది. వాడ = ఓడ. 3. మాడ = వరహాలోసగం లేక రెండురూపాయిల విలువ బంగారు నాణెం. ఇప్పుడు వాడుకలోలేదు. 4. సూటిగుర్రాలు = సమానమైన గుర్రాలు (సూడు = వైరం, పగ). లక్కపావా = లక్క_పూతగల పాంకోడు. 9. ఏకదివాణం = ఒక్కదివాణం. 13. విడిమట్టు(వ్యు, విడిది+పట్టు) = విడిది ఇల్లు. 16. గూడొగ్గుట = పిట్టలనుపట్టు పంజరం వేయుట. 18. పణతి = స్త్రీ. 24. బోరుతలుపు = పెద్దరెక్క తలుపు. 26. రేక = గీత. 27. వాడ = వీధి. 28. రెండు, నాలుగు, ఆరుచరణాలలో క్రియ స్థానంచూడండి. 29. బలగం = బంధువర్గం. ధరణిచేరు, భూమి చేరు = ఇవి ఉయ్యాలచేరుల పేర్ల యుండవచ్చు. 32 మావి = మా యొక్క. 36. వద్ది (వద్దిక?) = భయభక్తులు కలిగి యుండుట. 41. ఉప్పాక = ఒకగ్రామనామం. 42. పార్వా = పావురం. 48. వల్లభుడు = ఒకని నామం, సమర్త కట్నం = రజస్వలయిన కన్యకు పెళ్ళికొడుకువారు తెచ్చేకట్నం. 50. అణుప్పసుపు = ఒకరకంపసుపు. గోవపూవు = గోగుపువ్వు ? కొట్టుపసుపు = ఉడికించిన పసుపుకొమ్ములు రోటిలోదంచినగుండ. 51. ఈ 'సిరిపురం' విశాఖపట్నం జిల్లాలోది. చదరాలు = చదురాలు; సమర్థురాలు. శాంత = ఒకమనిషి పేరు. 63. రక్షపతి = రక్షణము చేయురాజు. 65. ప్రాణాచారం = సాష్టాంగం; చండు బెల్లం = (వ్యు, చుండు + బెల్లం) ఒకరకం బెల్లం.