పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/69

ఈ పుట ఆమోదించబడ్డది

44



23
ముద్దుమొగమున ముచ్చటలు ఆడె
ము(మ?)వ్వంపు దేవుడవు నీవు నా బాల
తాతముత్తవ్వలబోలు తలిదండ్రులబోలు
అయ్యముత్తవ్వలబోలు అయ్యల్ల బోలు
బాలయ్య ముద్దులు మద్దికాయల్లు
మద్దికాయలు ముద్దు మాటల్లు ముద్దు
మామల్ల చంకను బాలయ్య ముద్దు,

24
నాచిన్న బాలయ్య నీ చిన్ని మొగము
నీచిన్ని మొగమందు నిమ్మపండందు.

25
వెన్నకు యేడ్చేవు యెత్తేవు గిన్నె
వెల్లావు పంపుదురు మీఅమ్మ తాత
పాలకు యేడ్చేవు పట్టేవు గిన్నె
పాడి బర్రెలపంపు మీఅమ్మ తాత.

26
గౌనువెనక మోత యెవరిది మోత
చిన్ని నాబాలయ్యది గజ్జెల్లమోత
ఊరువెనక మోత యెవరిది మోత
చిన్ని నా బాలయ్యది వుంగ్రాలమోత.

27
పాలియ్యవుకదాయె పండబెట్టవు కదాయె
ఉగ్గుపొయ్యవు కదాయె వూపవు కదాయె
నీ ళ్ళు చాలపోసి నీలంగి తొడిగి