పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/38

ఈ పుట ఆమోదించబడ్డది

13



47.
చిలకల్లు చిలకల్లు అందురేకాని
చిలకలకు రూపేమి పలుకులేకాని
హంసల్లు హంసల్లు అందురేకాని
హంసలకు రూపేమి ఆటలేకాని
పార్వాలు పార్వాలు అందురేకాని
పార్వాలకు రూపేమి పాటలేకాని
కోయిల్లు కోయిల్లు అందురేకాని
కోయిల్లకు రూపేమి ఘోషలేకాని
చిలకల్లు మాయింటి చిన్న కోడల్లు
హంసల్లు మాయింటి ఆడపడుచుల్లు
పార్వాలు మాయింటి బాలపాపల్లు
కోయిల్లు మాయింటి కొత్తకోడల్లు.

48
వండారారమ్మ వడకవంటల్లు
వల్లభుడు అబ్బాయికి వడుగు మాయింట
కట్టా రారమ్మ కలవతోరణాలు
కాముడి అబ్బాయి కల్యాణమన్ని
పెట్టా రారమ్మ పెళ్ళిముగ్గుల్లు
పెంపుడు అబ్బాయికి పెళ్ళిమాయింట
చదవ రారమ్మ సమర్త కట్నాలు
చదరాలు అమ్మాయి సమర్త మాయింట
తియ్యా రారమ్మ చిప్పగంధాలు
సింహాలక్ష్మి అమ్మాయికి సీమంతమనిరి
పుయ్యా రారమ్మ పురిటిగోడల్లు
పుణ్యశాలి సీతమ్మకు పురుడుమాయింట.