పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/29

ఈ పుట ఆమోదించబడ్డది



     ఏటిక్కీ కాలువ యెంతదూరము
     ఎత్తి పెంచినతల్లి కేంత మోహము
     కాలువ నీళ్లన్ని కడుసముద్ర మాయె.
     కడలేనిమోహమే కన్నతల్లిక్కి.

13. ఊరిక్కి ఉద్యోగ రాజు వచ్చేడు
     విడిమట్టు చూపండి విందు నాయిల్లు
     ఊరిక్కి ఉద్యోగరాజు అబ్బాయి .
     విడిమట్టు నీయిల్లు విందు నాయిల్లు.

14. ఆటల్లు పాటల్లు అత్తవారింట
     అతిరాచ చిటిపనులు అమ్మగారింట.

15. తోటకూరా చెట్టెయ్యవలెను
     దొగ్గలి పెరిగింది దొడ్డిముందార
     రాచాయింటా కన్నెయ్య వలెను
     అబ్బాయి యింటికే వచ్చింది కన్నె.

16. చిక్కుడాకు. విూద చిలక వాలింది
     చిల కెక్కి ఓరాజు చిక్కి వున్నాడు.
     అరిటాకు మీద హంస వాలింది
     హంసెక్కి ఓరాజు అమిరివున్నాడు.
     కొబ్బరాకు మీద గోర వాలింది
     గోరెక్కి ఓరాజు కోరివున్నాడు.
     మామిడాకు విూద మంచు వాలింది.
     మంచెక్కి ఓరాజు పొంచివున్నాడు.