పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/26

ఈ పుట ఆమోదించబడ్డది

1. జోలపాటలు



1. ఊ చక్క వూగ దే వుయ్యాల చేరు
పా డక్క నిద్రపోడు పట్టి అబ్బాయి.

2. విశాఖపట్నాన విసిరిందిగాలి
వింజరపు రేవున్న తేలింది వాడ
వర్తకుడి పేరేమి వాడ వేరేమి
వాడలో పోసిన్న దినుసు పేరేమి
వర్తకుడు అబ్బాయి వాడ నా వాడ
వాడలో పోసిన్న దినుసు ముత్యాలు.

3. ఇంతంత దీపమ్ము ఇల్లల్ల వెలుగు
ఈశ్వరుడి చందమామ జగతెల్లవెలుగు
గోరంత దీపమ్ము కొండల్ల వెలుగు
గోపాలకృష్ణమ్మ మందల్ల వెలుగు
మాడంత దీపమ్ము మేడలకు వెలుగు
మారాజు అబ్బాయి మాకళ్ళ వెలుగు.

4. సూర్యుడు చంద్రుడు అన్నదమ్ముల్లు
సూటిగుర్రా లెక్కి జూదమా డేరు
అబ్బాయి తమ్ముడు అన్నదమ్ముల్లు
లక్కపావా లెక్కి లెక్క రాసేరు.

5. ఏటిగట్టుమీద సంధ్యలు వార్చు
ఎర్రన్ని చినవాడు ఎవరి అబ్బాయి.