పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/11

ఈ పుటను అచ్చుదిద్దలేదు

౧. నమ్మకాలు, ఆచారాలలో ఈ కింది శాఖలు ఉన్నాయి: (ఆ) మూఢవిశ్వాసాలు, అజ్ఞానపు టలవాట్లు, ఈశాఖలో తిరిగి ఉపశాఖ లున్నాయి. అవేవంటే

౧. జడప్రకృతికి సంబంధించినది.

ఉదా:--—హంపీలో ఒక బండరాతిమీద సీతా అమ్మవారు తన చీర ఆర వేసుకుంటే ఆమచ్చ ఆబండమీద ఉంది. సప్తసాగరయాత్రలు చేస్తే స్త్రీలు గర్భిణు లవుతారు. తోక చుక్క వస్తే ఎవడో వొక గొప్పవాడు మరణిస్తాడు. సూర్యగ్రహణం వెళ్లాక వారంరోజులవరకూ ఏ కార్యం చెయ్య. (కత్నశాస్త్రంలో రత్నాలకు సంబంధించిన మూఢవిశ్వాసాలు. దొరుకుతాయి.) అమాహళ్యనాడు బచ్చలికూర కొయ్యకూడదు. అమావాశ్యనాడు పుడితే దొంగ అవుతాడు. మూలానకు,త్రాన్ని జన్మించకూడదు. ద్వాదశీ దగ్ధయోగం. స్వాతివానకు ముత్యాలు తయారవుతాయి. అర్జునుడి పది పేర్లూ వర్ణి స్తే పిడుగు పడదు. మేఘగర్జనం ఇంద్రుడి రథధ్వని. 31 పై నమ్మకాలలో కొన్నిటికి జ్యోతిశ్శాస్త్రం కారణం. అ. చెట్లు, మొక్కలకి సంబంధించినది.

ఉదా:—రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే స్త్రీలు గర్భిణు అవుతారు. చింత చెట్టుమీద దయ్యాలుంటాయి. తులసి చెట్టుకు పూజచే స్తే కోరికలు సిద్ధిస్తాయి. (ఉత్త కొబ్బరికాయకి దెయ్యం తిన్న కాయని పేరు,)