పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/851

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆర్థిక వ్యవసాయ ప్రణాళిక (ఇండియా)

ముఖ్య ఆహారమనియు, సహకారి (subsidiary) ఆహారమనియు ఆహారము రెండువిధములు, గోధుమ, వరి, జొన్నలు, సజ్జలు, రాగులు మున్నగు ధాన్యముల ఉత్పత్తి, వాటి ఖర్చు మున్నగు విషయములు ముఖ్యాహారమునకు చెందినవి. పప్పుదినుసులు, చక్కెర, ఫలములు, కూరగాయలు మున్నగునవి సహకారి ఆహారమునకు చెందినవి. పై రెండు కాక మూడవ విభాగము క్రింద వచ్చునవి. తేనీరు, కాఫీ, కోకో, ఓవలటీను మున్నగు పానీయములు.

ప్రత్తి, జనుము, నార. పొగాకు, రబ్బరు, అవిసేనార మున్నగునవి ముఖ్యమైన ముడిపదార్ధములు. ఈ పంటలు పండుటకు అనువగు పరిస్థితులను గూర్చి విమర్శించుట కూడ ముఖ్యమైన విషయము.

ఖనిజపదార్ధములును మూడు రకములు - (1) ఇనుముతో సంబంధము గల లోహములు. ఉదా :- ఇనుము, మాంగనము, (2) ఇనుముతో సంబంధము లేని లోహములు, ఉదా :- సీసము, యశదము, రాగి, అల్యూమినియము.. తగరము, (3) మిక్కిలి విలువగల లోహము లగు బంగారము, వెండి, ప్లాటినము. ఇవిగాక పెట్రోలు, బొగ్గు మున్నగు పారిశ్రామిక ఇంధనములు, రాతి ఉప్పు, కాల్షియగంధకితము, రాతినార, అభ్రకము మున్నగు అనేక లోహేతర ఖనిజములు కూడ ఖనిజసంబత్తియందలి అంతర్విభాగములే. స్థూలదృష్టిచే పరిశ్రమలు కుటీరపరిశ్రమ లనియు కర్మాగారపరిశ్రమ అనియు, యంత్ర పరిశ్రమ లనియు మూడు తెరగులు, యంత్రములను నడుపుటకు వలసిన శక్త్యుత్పత్త్యాధారముల సాధనములను గూర్చిన పరిశీలనముకూడ ఆర్థిక భూగోళశాస్త్రము యొక్క ముఖ్య విషయములలో నొకటి. * అట్టి ఆధారములలో మానవ కృషి, జంతు సాహాయ్యము, బొగ్గు, పెట్రోలు, విద్యుత్తు, సూర్యశ క్తి, అణుశక్తి మున్నగునవి లెక్కింపదగినవి. రవాణా సౌకర్యములలో రహదారులు, రైలుమార్గములు, జల వాయుమార్గములును చేరును. ఆర్థిక భూగోళశాస్త్రములో, వాణిజ్య మొక ప్రధానాంశమై యున్నది. వివిధప్రాంతముల మధ్య జరుగు ఎగుమతి దిగుమతి వస్తువులనుగూర్చి తెల్పు విషయమే వాణిజ్యము.


వివిధ దేశములమధ్య జరుగు ఎగుమతులనుగూర్చి ఇందు చర్చింపబడును. వ్యాపారము కొంత విలువగలదైనను ఆర్థిక భూగోళశాస్త్రమున దానికి ప్రాముఖ్యము లేదు.

ఆధునిక ఆర్థిక శాస్త్రపఠనములో మానవుని వృత్తులు ఆధారముగా కనుపడినవి. ఆ వృత్తులు పురాతన వృత్తు లనియు, ప్రథాన వృత్తులనియు, సహకారి వృత్తులనియు మూడు తెరగులు.

కాయలు, దుంపలు ఏరుట, చేపలు పట్టుట, వేటాడుట ఇవి పురాతన వృత్తులు. వీటిని ఆధారముగా గొనియే పురాతన కాలములో మానవుడు జీవిత సమరమును సాగించుచుండెను.

మానవుడు తన పరిసరములకు అలవాటుపడిన కొలది. ప్రకృతి కనుగుణముగా ప్రవర్తింపనేర్చిన కొలదియు, ప్రధానవృత్తులను స్వీకరించెను. పశువులను పెంచుట, కాలక్రమమున గనులు త్రవ్వుట మున్నగునవి ప్రధాన వృత్తుల కుదాహరణము,

ప్రధానవృత్తు లాధారముగా ఏర్పడి పారిశ్రామిక విప్లవానంతరము అభివృద్ధిలోనికి వచ్చిన వృత్తులు సహకారివృత్తు లనబడును. ఉదా : రవాణాలు, వాణిజ్యము మున్నగునవి.

ప్రతిప్రాంతమునందును ఈ వృత్తులలోగల వైవిధ్యమును, మనుష్యుడు చేయు కృషికి ప్రకృతినుండి కలుగు ఫలితములును పరిశీలింపబడి, మానవుని పరిసరములకును, ఆతడవలంబించు వృత్తికిని సమన్వయము కల్పింపబడు చున్నది.

వివిధ భౌగోళిక ప్రాంతములలో మానవులెట్లు జీవించుచున్నారో, ఎట్లు సంచరించుచున్నారో, ఎట్లు తమ క్షేమమును సాధించుకొనుచున్నారో వివరించు భూగోళశాస్త్ర భాగమును ఆర్థిక భూగోళము అందురు. ఇది ఆర్థికావసరములమీదను, వాటిని సాధించు పద్ధతుల మీదను ప్రాధాన్యమును ప్రసరింప చేయును.

బి. యన్. చ

ఆర్థిక వ్యవసాయ ప్రణాళిక (ఇండియా):- భారతదేశపు ప్రణాళికా విధానము ప్రజాస్వామ్య దృక్పథము కలిగియుండవలె ననువిషయము ఎల్లరిచే ఆమోదింపబడినది. ప్రజల యొక్క ఆర్థిక వసతులను