పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/837

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆయుర్వేద ధర్మములు


(16) “నాభక్తా శిష్టా శుచి శుధిత పరిచరః" అయిష్టులు, అయోగ్యులు, శుచిత్వము లేనివారు, ఆకలిగొన్న వారు ఎదుట నున్నపుడును
(17) “నాపాత్రే ష్వమేధ్యాసు” అపరిశుభ్రము లైన పాత్రలయందును
(18) “‘నా కాలే.” సమయము కాని సమయమందును
(19) “నా దేశే.” ఉచితముగాని స్థలమునందును
(20) "నాకీణ్ణి” పదుగురున్న చోట
(21) “నాదత్వాగ్ర మగ్నయే. వైశ్య దేవాదికము లాచరించకయు
(22) "నాప్రోక్షితం ప్రోక్షణోదకై !.” మంత్రోదకముచే పవిత్రము చేయకయు
(23) “మం త్రైరనభిమంత్రితం.” ఆపోశనము చేయకయు
(24) “నకుత్సయన్.” కోపముతోను (తిరస్కరింపకయు)
(25) "నకుత్సితం.” చెడిపోయినట్టియు (నింద్యమై నట్టియు)
(26) “నప్రతికూలో పహిత మన్న మాదరీత" అనుకూలముగ లేని వారివలన అమర్చబడి నట్టియు, అన్నమును భుజింపరాదు.

113. "నపర్యుషిత మన్యత్ర మాంసహరిత శుష్క శాకఫల భక్షేభ్యః" మాంసము, పచ్చికూరలు (అల్లము, నిమ్మకాయ, కంద, ముల్లంగి మొదలగునవి హరితశాకములని వాడబడును.) వరుగుచేయబడిన కూరలు, పండ్లు, అతిరసాలు మున్నగు మృతతైల పక్వములగు భత్యములు తప్ప నిలవయున్న పదార్థములను తినరాదు.

114. “నా శేషభుక్స్యా దన్యత్ర దధి మధు లవణ సక్తు సలిల సర్పిభ్యః" భుజించునపుడు పెరుగు, తేనె, ఉప్పు, సత్తుపిండి, నీళ్ళు, నెయ్యి- అను వీటిని మిగుల్చ రాదు.

115. “న నక్తం దధి భుంజీత." రాత్రియందు పెరుగు తినరాదు.

116. (1) "న సక్తూ నేకా నశ్నీయాత్.” ఒక సత్తు పిండిని మాత్రమే కడుపునిండ భుజింపరాదు.

(2) "న నిశి" రాత్రియందుగాని, .
(3) “న భుక్త్వా" భుజించిన పిమ్మట గాని,
(4) “న బహూర్." అనేకసార్లధికముగా గానీ,
(5) “నద్విర్నోద కాన్తరితాన్." భోజన కాలములందు

గాని మధ్యమధ్య నీళ్లు త్రాగుచుగాని, సత్తుపిండిని తినరాదు.

117. “నచ్ఛిత్త్వాద్విజై ర్భషయేత్.” సరిగా పండ్లతో నమలకయే భక్షింపరాదు.

118. (1) “ నానృజుః క్షుయాత్.” తుమ్మునపుడు

(2) “నాధ్యాత్" భుజించునపుడు,
(3) " నాకయీత.” పడుకొనిన యప్పుడు శరీరమును వంక రటింకరగా మెలికలు తిప్పియుంచక నిటారుగా నుండవలయును.

19. “న వేగితోన్య కార్యస్స్యాత్." మలమూత్రములను బిగపట్టుకొని యితర పనులు చేయరాదు. (ఇచట వేగములు 13 కలవు; అవి యివి :

(1) అపాన వాతము (2) మలము (3) మూత్రము (4) తుమ్ము (5) ఆకలి (6) దప్పి (7) నిద్ర (8) దగ్గు (9) బడలిక వలన కలిగిన ఆయాసము (10) ఆవలింత (11) కన్నీరు (12) వమనము (13) శుక్రము ఇవి ఎవ్వియు నిరోధింపరాదు అని ఆయు ర్వేదము.

120. 'నవాయ్వగ్ని సలిల సోమార్క ద్విజగురు ప్రతిముఖం నిష్ఠీవికావాతవర్చో మూశ్రణ్యుత్సృజేత్ ” ఎదురుగాలిలో, అగ్ని సమీపమున, ఉదక సమీపమున, సూర్యచంద్రుల యొక్కయు, బ్రాహ్మణులు, గురువులు మొదలగు పెద్దల యొక్కయు ఎదుటను ఉమియుట, అపాన వాయువు విడచుట, మలమూత్రములను చేయుట తగదు.

121. “న పస్థాన మనమూ త్రయేత్" పలువురు నడచు త్రోవయందు మూత్రము చేయరాదు.

122. (1) " నజనవతి " (2) " నాన్న కాలే ” (3) "న జపహోమాధ్యయన బలి మంగల క్రియాను శ్లేష్మ సింఘాణకం ముంచేత్." పదు గురుగల చోటను, భోజనముచేయు సమయము నందును, జపము హోమము అధ్యయనము చేయు సమయములందును, స్థలములందును