పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/835

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆయుర్వేద ధర్మములు


67, “నజానుసమం కఠిన మాసన మధ్యాపీత." మోకాటియెత్తు కలిగి కఠినముగా నున్నట్టి ఆసనములపై కూర్చుండరాదు.

68. “నా నాస్తీర్ణ మనుపహిత మవిశాల మనమం వా శయనం సంపద్యేత." పరిశుభ్రమైన బట్టలు పరువక, దిండ్లు పెట్టక, వెడలుపులేక, మెత్తదనము లేక యున్నట్టి మంచముపై పడుకొనరాదు.

69. "న గిరి విషమ మస్తకే ష్వను చరేత్." పర్వత శిఖరములందును, ఎగుడుదిగుడులుగా నుండు గట్లు మొదలగు చోట్ల సంచరిం పరాదు.

70. “న ద్రుమ మారో హేత్," చెట్లపై నెక్కరాదు.

71. “న జలోగ్రవేగ మవగా హేత్." ఎక్కువ వేగముగా ప్రవహించు జలములయందు స్నానము చేయరాదు.

72. “న కులచ్ఛాయా ముపాసీత.” ఇతరుల మైనీడలో నిలువరాదు.

73. "నాగ్న్యుత్పాత మఖితళ్చరేత్." చెలరేగి మండుచున్న అగ్నికి దగ్గరగా పోరాదు.

74. “నోచ్చైర్హ సేత్.” అట్టహాసము (బిగ్గర) గా నవ్వరాదు.

75. "నశబ్దవంతం మారుతం ముంచేత్. "చప్పుడగునట్లు (అపాన) వాయువును విడువరాదు.

76. "నానావృతముఖో జృమ్యాం క్షవధుం హాస్యం వా ప్రవర్తయేత్." నోరు తెరచుకొని ఆవులించుట, తుమ్ముట నవ్వుట పనికిరాదు.

77. "ననాసికాం కుష్ణీయాత్. " శబ్దమగునట్లు ముక్కు నెగ పీల్చరాదు.

78. "న దంతాన్ విఘట్టయేత్.” పండ్లు కొరక రాదు.

79. *న నఖాన్ వాదయేత్." గోళ్ళతో గోళ్ళను వాయించరాదు. . 80. "నాప్ధీ న్యభిహవ్యాత్." ఎముకలతో ఎముకలను కొట్టరాదు.

81. "న భూమిం విలిఖేత్." చేతులతో భూమిని రాయ రాదు.

82. “న ఛింద్యా త్తృణం.” గోళ్ళతో గడ్డిని త్రుంప రాదు.

83. "నలోష్టం మృద్నీయాత్." చేతులతో మన్ను నలుపరాదు.

84. “న విగుణ మదై శ్చేషేత.” కాళ్ళు చేతులు నడుము మున్నగు అవయవములతో వికృత చేష్టలు చేయరాదు.

85. "జ్యోతీం ష్యనిష్ట మమేధ్య మశస్తంచ నాకే వీక్షేత." వెలుగుగల వస్తువులను, ఇష్టములేని వానిని అసహ్యములు పనికిరానివి యగు ద్రవ్యములను చూడ రాదు. (మలమూత్రములను, శవమును చూడరాదని భావము.)

86. “న హుంకుర్యా చ్ఛవం. శవమును జూచి హుంకరింపరాదు.

87. "నచైత్య ధ్వజ గురు పూజ్యా శస్త ఛాయ మాక్ర మేత్." దేవాలయము, ధ్వజ స్తంభము, గురువులు పూజ్యులు మున్నగువారి నీడలయందును, కుష్ఠాది దీర్ఘ రోగుల నీడలయందును నిలువరాదు.

88. “న క్షపాను అమరసదన చైత్య చత్వర ఛతుప థోపవన శ్మశా నాఘాత నా న్యాసేవేత.”దేవాలయముల యజ్ఞశాలలు, ముంగిళ్ళు, నాలుగు త్రోవలు కలిసి చోటులు, నగరబాహ్యోద్యానములు, శ్మశానముల వధ్యస్థానములు మొదలగు చోటులందు రాత్రులు వసించరాదు.

89. "నైక శూన్యగృహం న చాటవీ మను ప్రవిశేత్ పాడుపడిన యిండ్లయందును, అడవియందును ఒంటరి ప్రవేశింపరాదు.

90. "న పాపవృత్తాన్ స్త్రీ మిత్ర భృత్యాన్ భజేత చెడు నడవడికగల స్త్రీలను, మిత్రులను, భృత్యుల ఆదరింపరాదు.

91. “నోత్తమై ర్విరుధ్యేత." యోగ్యులగు వారి విరోధము పెట్టుకొనరాదు.

92. “నావరా నుపొసీత.” హీనులగువారి స్నేహము చేయరాదు.

93. “న జిహ్మం రోచయేత్ .”క పట వ ర్త ను ల సహింపరాదు.

94. నావార్య మాశ్రయేత్." దుష్టుల నాశ్రయింప రాదు.