పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/80

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంతర్గుహాకములు

టేపువలెనుండు జీవులు. శరీరము ప్రకాశవంతమగు వర్ణములతో పారదర్శక ముగా నుండును.

ఆహారము :- జెల్లి చేపలును, సముద్రపు 'అనిమోన్సు'అనబడు గాలిపువ్వులవంటి పెద్ద జీవులును పెద్ద పరిమాణము గల ఎరను మ్రింగి వేయగల శక్తిని కలిగియున్నవి. చురుకుగా నుండు టెనిఫోరాలు ఒకదానితో మరియొకటిగాని, చిన్న జంతువులకు గాని కణ సహాయముచే అతుకుకొనియుండి మాంసాహారులుగా నుండును. అంతర్గుహాక ములలో ఎక్కువ రకములు అతి సూక్ష్మజీవులను ఆహారముగా చేసికొనును. అవి వాని ఎరను పట్టుకొనుటకును, చంపుటకును 'దంళఘటములు'(Cnidobcosts) అను (కుట్టుటచే నొప్పి కలుగ జేయు) కణములను, మీసములను ఉపయోగించు కొనును. సూచ్యంగములు (Endoblasts) అనబడు గ్రుచ్చుకొను కణములను కలిగియుండుట అంతర్గుహాక జాతి యొక్క సహజ లక్షణము. కంకతినముల (టినోఫోరా) తరగతియందు తప్ప మిగిలిన అన్ని జాతులకును సూచ్యంగములు కలవు. ప్రతి దంశ ఘటమునకును సూచ్యంగము అనబడు నొక గుల్ల యుండును. గుల్లలో విషసంబంధమగు జిగురు పదార్థముండును. పదార్థమున సున్నితమై బోలుగా నుండు సూత్రమొక్కటి చుట్టలుగా నుండును సూచ్యంగము కణము నందలి ఎక్కువభాగమును ఆక్రమించును. ఈ కణము యొక్క చివర (Cnidocil) అను మీటగాని, ముతకగానుండు వెండ్రుకల కుచ్చుగాని యుండును. దంశఘటము ముడుచుకొనుట వలన కలిగిన ఒత్తిడిచే సూచ్యంగము బ్రద్దలగును. దారము రాసాయనికముగను, యంత్రమువలెను పనిచేయును. ఈ కటారులు ఆహార కీటకము యొక్క శరీరమునందు నాటబడి, అప్పుడు వెడలు స్రావము గాయమును విషపూరితముగా చేయును. ఈ విధముగా చిన్నచిన్న జంతువులు కదలకుండ చేయబడి చంపబడును. అప్పుడప్పుడు ఆ స్రావము కరిగించు ద్రావకము (Solvent) గా కూడా పనిచేయును. ఏది ఎట్లున్నను, 'సూచ్యంగములను' (నిమాటోసిస్టు Nematocysts) ఆయుధములనుటకన్న పట్టుకొనుటకు తగిన పాఠములు వల వలె వ్యాపించి యుండు నాడీ మండలము శరీరమం దంతటను సరిసమానముగా వ్యాపించి యుండును అనుట ఎక్కువ తగియుండును.

నాడీమండలము :- అంతర్గుహాకముల నాడీమండలము అతిప్రాచీన దశకు చెందినది. కేంద్ర నాడీమండలము వానికి లేదు. మేధస్సుకూడా లేదు. ఎత్తైనను త్వరీతముగ ప్రేరణములను నిర్ణీతమైన దిక్కునకు తీసికొనిపోవు నాడ మార్గము వీనిలో కలదు. అది ఉన్నత జీవులందు స్థానికము గాను, స్థిరముగను ఉండు నాడీ పద్ధతిని సూచించును.

పారస్ధిక విషయములు:- ఇంచుమించు అంతర్గుహాకము లన్నియు సముద్రజీవులు. సామాన్యము జరియకము (హైడ్రా) మీసములేని సూక్ష్మాతిసూక్ష్మమైన జకీయకము (మైక్రోహైడ్రా) ప్రారంభదశయందు మత్స్య అందములపై పరాన్న భుక్కుగా నుండిన 'పాలిపోడియం',(Poly Podium) సంయోగ జీవులుగా నుండు 'కార్డిలోఫోరా' (Cardylophora) మంచి నీటి యందుండు ఛత్రికలు మొదలగునవి, మంచినీటి అంతర్గుహాక ములకు ఉదాహరణములు. వీటిలో మిక్కిలి చురుకుగా ఈదు పెక్కుజీవులు లోతులేని నీటిలో నుండును. కొన్ని లోతైన నీటిలో కూడ కనబడును. చాలరకముల పుర్వగకములు ఇతరజంతువుల శరీరపుచిప్పలను ఆధారము చేసి కొని పెరుగుచుండును. అప్పుడప్పుడు అవి ఆ చిప్పలనుపూర్తిగా కప్పి వేయుచుండును. 'మునీశ్వరపీత'కును, సముద్ర 'కుసుమాభముల'కును ఎడ తెగని భాగస్వామ్యము అంతర్గుహాకములయందు విచిత్రమైనదృశ్యము. మునీశ్వరపీతసముద్ర కుసుమాభముచే కప్పబడి, దాని గ్రుచ్చుశక్తి చే రక్షింపబడు చుండును. సముద్ర కుసుమాభమును మునీశ్వరహీత మోసికొని తిరుగుచుండును. ఇట్టి పరస్పర లాభకరమగు బాహ్య భాగస్వామ్యమునే 'సహభోజనము' (Commensalism)అందురు. 'సహజీవనము' (Synbiosis) అను శారీరక భాగస్వామ్యము చాలరకములగు 'కుసుమారము'ల యందును, 'ఆల్సి యొ నేగియన్సు' (Alcyonarians)యందును కలదు. అతిసూక్ష్మమైన ఏకకణ శైవలములు ఈ జంతువుల యొక్క శరీరకణములలో నివసించును.అంతర్గువోకముల ప్రసృష్టిలో దాదాపు 9,000 జాతులు గలవు. వాటిని మూడు తరగతులుగా విభజించిరి.

1. జలీయకవర్గము ( హైడ్రోజోవా Hydrozoa):-మంచినీటియందుండు పుర్వగకములు చాలా చిన్నవిగా