ఆధునిక సంగీతము
మునకు తెలుగు సినిమాలలో తావు లేదనియే చెప్పవచ్చును. "త్యాగయ్య,” “పోతన" ఇత్యాది ఫిల్ములలో తప్ప శేషించిన తెలుగు సినీమాలలో గానము చాలా భాగము హిందుస్థానీ పద్ధతుల ననుసరించినదై యున్నది. సినీమా ప్రదర్శకులు, నిర్మాతలు, ఇచ్చగించినచో తెలుగు సినీమాలలో శాస్త్రీయగానము విస్తారము ప్రవేశ పెట్టుటకు అవకాశము కలదనియు, అందుచేత సినిమాలోని విలువ (Entertainment Value) తగ్గదనియు చెప్పవచ్చును. తమిళటాకీలలో శాస్త్రీయగానమునకు చాల ప్రాధాన్యము గలదు. అయినప్పటికిని తమిళ సినీమాల వినోదపువిలువ తగ్గదు. సినిమా పాటలలోని సంగీతభాగము మిక్కిలి క్లుప్తమై దేశీయగానము ప్రధాన మగుచున్నది. ఇట్టిపాటలు ప్రేక్షకులు తరచుగా వినుటచే శాస్త్రీయ సంగీతమునందు ప్రజలకు అభిలాష తగ్గిపోవుచున్నది. ఈ కారణముచేత సినీమాగానము ఆదర్శమగుచున్నదనుటకు (Ideal Music) అవకాశము కలదు.
నాటక రంగమందు శాస్త్రీయసంగీతమునకు పూర్వము ఎక్కువ ప్రాధాన్య ముండెడిది. కొన్ని నాటక సమాజములకు సంగీత విద్యాగురువు లుండెడివారు. ఈనాడు అట్టి పద్ధతులు లోపించుటచేత నాటకములు శాస్త్రీయ సంగీతాభివృద్ధికి తోడ్పడజాలకున్నవి. మరియు నటకుడు హెచ్చయిన శ్రుతిమీద అందరును వినులాగున గొప్ప కంఠముతో పాడవలసి యున్నది. నటకుని గానమునకు విశ్రాంతి యెక్కువ గనుక ప్రసిద్ధమైనట్టిదియు, నిర్దుష్ట మయినట్టిదియు నైన శాస్త్రీయ సంగీతము నాటక రంగమందు ఉపయోగించుటకు మిక్కిలి అవకాశము గలదు.
హరికథా కాలక్షేపములలోని సంగీతము శాస్త్రీయ సంగీతశాఖలోనికే వచ్చుచున్నది. ప్రస్తుత కాలపు కథకులు పెక్కండ్రు సంగీతమందు సుశిక్షితులు గాకున్నను, స్వరజ్ఞానము కలిగినవారు కాకున్నను, వారు పాడెడు కీర్తనలు, దరువులు మున్నగునవి సుప్రసిద్ధ సంగీత పండితులదే రచింపబడినవగుట చేతను, తొలుదొల్త ఆదిభట్ల నారాయణదాసుగారు, కుంభకోణము పంచాంగ కేశి శాస్త్రియార్, మైనంపాటి నరసింగరావుగారు, రామాయణం సీతాపతిగారు మున్నగు ప్రముఖ సంగీత విద్వాంసులు ననుకరించుటచేత నేమి, వారియొద్ద కొంత గ్రహించుటచేత నేమి, శాస్త్రీయ సంగీతస్వరూపము కొందరి చేతులలో విశేషముగా మారుట లేదు. కాని రెండవతరగతి కథకులు కొందరు స్వకీయ రచనలతో సభలు నిర్వ హించుటలో, సంగీతములో తమకుగల అల్పజ్ఞానమును వెల్లడించుచున్నారు. ఇది శోచనీయము. వీరలు సంగీత కృషి చేసి స్వరజ్ఞాన మార్జించి లక్షణయుక్తమైన సంగీతముతో హరికథా కాలక్షేపములు చేయుట అవసరము.
ఉత్సవములు, ఊ రేగింపులు, వివాహాది కార్యములు-ఇత్యాది సమయములలో వాద్యగాండ్రొనర్చు సంగీతము శాస్త్రీయ సంగీతమే. కాని, ద్రవిడ దేశమందు నాగస్వర వాద్య (కాహళ వాద్య) విద్వాంసులు బహుసం ఖ్యాకు లగుటచేత అచ్చట శాస్త్రీయసంగీతము మహోన్నత దశలో నున్నది. మన యాంధ్రదేశములో సహితమిప్పుడు సుప్రసిద్ధ నాగస్వర వాద్య విద్వాంసుల సంఖ్య హెచ్చు చున్నందులకు మనము సంతసింపవలెను.
భజనలు, సప్తాహములు ఇత్యాది సమయములలో శాస్త్రీయ సంగీతమునకు తావుండజాలదు. ఒక వేళ యున్నను ప్రేక్షకులు భ క్తిపరులై నిమగ్నతతో ప్రవర్తించుట ఆశయమగుటచేతను, దీర్ఘ కాలముగా నిట్టి తరుణములలో సంగీత విద్వాంసులు పాల్గొనకుండుట చేతను, శాస్త్రీయ సంగీతమానందిం చెడు అవకాశము భజనలో లేకున్నది. మరియు "హరేరామ హరేకృష్ణ" ఇత్యాది నామములు అనేక వందల పర్యాయములు తాళములతో ఉచ్చరించుటయు, తరంగములు మున్నగునవి విశేషముగా పాడుటయు, ఈ శాఖలో నేర్పరులయిన వారే భజనలలో మిక్కుటముగా పాల్గొనుటయు, ఇందులకు మరికొన్ని కారణములు. కాని ఇట్టి సమయములలో శాస్త్రీయ సంగీతము ప్రదర్శించుట శెట్టి యభ్యంతరము ఉండజాలదు.
భరతనాట్య ప్రదర్శనములలో ఈనాడు తగినంతగా శాస్త్రీయ సంగీతమునకు స్థానము లేకున్నది. ఇంతేగాక నేడు నాట్యసమయమున నటకుడే గానము చేయుట శాస్త్రీయపద్ధతి. పూర్వము ఇట్లే జరుగుచుండెడిది. ఇక బుఱ్ఱకథలు, వీధిభాగవతములు, జానపద గేయములు మున్నగునవి దేశీయగానమున వినియోగమగుచున్నవి.
ప్రభుపరిపాలన మంతరించి ప్రజాపాలనము సుస్థిరమైన నవీనయుగమందు ప్రజలే సర్వవిధముల సంగీత