పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/76

ఈ పుటను అచ్చుదిద్దలేదు

'గ్లోబ్సు' అను జీవులు మృదువులును, చిత్రవర్ణములు కలవియు అయి, మిక్కిలి చురుకుగా ఉండును. అంతర్గుహాకములలో హైడ్రావంటి మూడు నాలుగు రకములే మంచినీటిలో నుండునవి; మిగిలినవన్నియు సముద్రవాసులు. లోతులేని వెచ్చని సముద్రములలో అంతర్గుహాకములు అన్ని విధములయిన సుందరాకారము లను సాధారణముగా ప్రదర్శించవు. ఎత్తుగా పెరిగిన పుర్వగక ముల ('పాలివ్సు, Polypes) గుంపులు, గట్లవలే దట్టముగా పెరిగిన పగడపు గుట్టలు సముద్రపు టడుగు భాగమున నుండును. వీటి ప్రభావము వెన్నెముక లేని ఇతర జంతువుల పైనను, చేపలపైనను కూడ ఉండును. సామాన్య లక్షణములు:- చాలవరకు అంతర్గుహాక ములు ఎల్లప్పుడును, అంగవర్తులవు సౌష్ఠవముగల జంతువులు. జీర్ణకోశ కుహరము, దాని శాఖలు తప్ప వేరొక శరీర కుహరము వాటికి లేదు. సామాన్యమైన రూపములలో ఈ కుహరము యొక్క ప్రధానద్వారము ఎదిగిన జీవు లలో నోరుగామారును. కొన్ని ప్రత్యేక రూపములలో శరీరపు పై భాగమునకు చెందినదియో లేక ముఖసంబంధ మయినదియో అగు కోశము ఉండును. ఇదియే గొంతు గొట్టముగా ఏర్పడును. శరీర కుడ్యపు అంతశ్చర్మమునకును బహిశ్చర్మమునకు నడుమ వాటిని బలపరచుచు, తేగుడువంటి పొర యొకటి ఉండును. 'టినోఫోరా' జాతిలో జీవి పెరుగుదల యొక్క ప్రాథమిక దశయందే స్పష్టమగు మధ్యచర్మ మేర్ప డును. ఈ జీవులలో అధిక భాగమునందు గుచ్చుకొనునట్టి కణము లున్నను, టినోఫోరాలో వాటి స్థానమున అతుకుకొనునట్టి కణము లుండును. అంతర్గుహాక ములలో 'పుర్వగక,' 'ఛత్రిక' అను నిర్మాణాత్మక ములగు రెండు వర్గములు కలవు. ఒకే ప్రాణియొక్క జీవ చరిత్రయం దీ రెండు వర్గ లక్షణములును ఒక్కొక్కప్పుడు కన్పిం చును. ప్రాణులలో ఒక తరము విడిచి, మరొక తరము నందు కొన్ని లక్షణములు కన్పటు దృశ్యమున కిది నిదర్శ నము. ఒక్కొక్క తరమునందు లింగ సహితోత్పత్తి, మరొక తరమున లింగరహితోత్పత్తి కలుగు దృశ్యము నకు కూడ ఇది నిదర్శనము. పుర్వగకములచే ఏర్పడు ఖటిక పంజరము పగడముల ఉత్పత్తికి దారి తీయును. 37 అంత ర్గుహాకములు 'మొగ్గల' మూలమున సంఖ్యాభివృద్ధి సామాన్యముగా అవి గుంపులుగా ఏర్పడి, వాటియందు శ్రమ విభాగము చేసికొనుట చూపట్టు చుండును. జీవిత చరిత్ర :- అంతర్గుహాకములలో వ్యతిరేకము లైన రెండు జీవితవిధానము లుండుటచే అవి దృష్టి నాకర్షించునవి. పుర్వగకము, ఛత్రిక అనునవి ఆ రెండు విధములకు సంబంధించినవి. పుర్వగకము కదలక స్థిర ముగా నుండును. ఛత్రిక శారీరకమగు పెరుగుదలను విస్తారమగు కార్యక్రమమును, నిర్మాణమును, గనబర చుచు ఒక ప్రదేశమునుండి వేరొక ప్రదేశమునకు పోవుట యందు మిక్కిలి చురుకుగా నుండును. పెక్కు అంతర్గుహా కములలో 'పుర్వగక జాతి' మాత్రమే కనిపించును. తక్కిన వాటిలో రెండు రకములు ఒకే జీవియందు గాని, ఆ జీవులతో నేర్పడిన సమూహమునందుగాని కనబడును. ఛత్రిక స్వేచ్ఛగా జీవించుచు, వెడల్పు గల శరీర మును కలిగియుండును. ప్రధానమగు జఠర కుహరము ఏర్పడి, ఆ జఠర కుహరమునుండి వ్యాపించు నాళికా మండలము దగ్గర అంతశ్చర్మ వలయము ఏర్పడును. పుర్వగకము యొక్క ఆదిమమైన మీసములను వహించు ఈ అంచు నోటినుండి వేరుచేయబడి మంటా కారముగా క్రిందివైపునకు వంగియుండును. తరచుగా మూతిపై మీనముల యొక్క రెండవజత (Manubrium) అథోభాగము పై పెరుగును. పుర్వగకమునందున్న అంగ వర్తుల సౌష్ఠవము ఛత్రికలో వ్యాసార్ధగామిగా అభివృద్ధి చెందిన నాళి కామండలముద్వారా మరింత అధికముగా స్ఫుటము చేయబడుచున్నది. అంతర్గుహాకములలో కనుపించు ఉత్పాదక జీవ కణ ములు జంతుకోటియందు అంతటను సామాన్యముగా అగపడును. అండములు, శుక్రాణువులు వేరు వేరు జీవు లచేగాని లేక సమూహములచేగాని వహింపబడును. ఫలదీ కరణము నొందిన అండము సమానముగా విభజనము నొంది మొదటి పొర అయిన బహిశ్చర్మము ఒక ఏక బత్తిక (Blastulla) అను ఒక మధ్య కుహరమును చుట్టు కొని ఉండును. ఈ కుహరము . అంతశ్చర్మకణసంహతిచే నిండియుండును. బహిశ్చర్మమునకు నూగు ఏర్పడును. ఇట్టి ఉంభమును "చికిటక ము” (Planula) అందురు. అది