ఆగమశాస్త్రములు
సమాన ప్రతిపత్తితో నలరారుచున్నవి. శ్రీ వైష్ణవాచార్యులు ఈ రెండింటికిని సమాన గౌరవము నిచ్చు చున్నారు. శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రములలో, కొందరు వైఖానసాగమములను, మరికొందరు పాంచరాత్రాగమములను అనుసరించుచున్నారు.
వైఖానస గృహ్య సూత్రాద్యనుసారముగ చత్వారింశత్ సంస్కారములను పొందినవారే వైఖానసు లగుదురుగాన, వైఖానసత్వము వంశపరంపరగా రావలసి యున్నది ; ఏ సూత్రానుసారులై నను పాంచరాత్రదీక్షను స్వీకరించిన పాంచరాత్రులగుటకు నవకాశమున్నది. మంత్రతంత్రాదులయందు కొంత భేదమున్నను, భగవదా రాధ నౌపయికములై రెండును ఉపాధేయములై యున్నవి. పాంచరాత్ర సంహితలలోనే వైఖానససంహిత యొకటి గలదు.
వైఖానసాగమములు : పరమాత్ముని మానసపుత్రుడు విఖనసమహర్షి. గూఢార్థముల ప్రకాశింప జేయుటచే, “విశేషేణ ఖననాత్ విఖనాః" అను వ్యుత్పత్తివలన "విఖనసు" లను పేరు వచ్చినటుల వ్యాసమహర్షి నిర్వచించి యున్నాడు. వేదములను ప్రవర్తింప జేయుటకై చతుర్ము ఖ బ్రహ్మను సృష్టించినటుల, ఆరాధన ప్రక్రియలను బోధించు నాగమ శాస్త్రముల ప్రవర్తింప జేయుటకై విఖనస మహర్షిని పరమాత్ముడు తన సంకల్పముచే సృష్టించెనని చెప్పబడి యున్నది. ఆవిఖనస మహర్షి భగవంతునిచే నుపదిష్టములగు భగవదారాధన క్రమముల నెల్ల తన శిష్యులగు (1) కశ్యప (2) అత్రి (3) మరీచి (4) భృగు (5) వసిష్ఠ (6) అంగిరస (7) పులస్త్య (8) పులహ (9) క్రతువు - అను తొమ్మిది మందికి నుపదేశించి, వారి ద్వారమున సంహితలను ప్రవర్తింప జేసెనని సనాతనులు చెప్పుచున్నారు.
ప్రస్తుతము అత్రి, మరీచి, భృగు, కశ్యపుల సంహితలు మాత్రము ప్రసిద్ధిలో నున్నవి.
సమూర్తార్చనాధికరణము అను సంహితయందు భగవంతుని సమూర్తార్చనము సాంగోపాంగముగ నిరూపింపబడియున్నది, అర్చనము సమూర్తము, అమూర్తము అని రెండువిధముల నున్నది. అమూర్తార్చన మనగా -జవహనీయ- అన్యాహార్య గార్హపత్య,ఆ వసథ్య -సభ్యములను పంచాగ్నులయందు ఆగమోక్త విధానము ననుసరించి హోమాదుల ననుష్ఠించుట; ఇక సమూర్తార్చన మనగా - ఆలయములయందు ప్రతిష్ఠింపబడిన పంచ బేరములగు భగవంతుని బింబములను (విగ్రహాదులను) ఆగమోక్త విధానముగ నర్చించుట కర్షణాది ప్రతిష్టాంత కర్మలు, ఆరాధన - ఉత్సవ క్రమములు, విగ్రహ, గోపుర,ప్రాకారాది నిర్మాణవిధులు విశదముగ నిరూపింపబడి యున్నవి. కాశ్యప మరీచి సంహితలు గద్యాత్మ కములు కాగా, అత్రిభృగు సంహితలు శ్లోకరూపములుగ నున్నవి. ఈ సంహితల కన్నిటికిని పరస్పర సంవాద మున్నది.
పాంచరాత్రాగమములు : పాంచరాత్రాగమములు అసంఖ్యాకములుగ నున్నవి. అందు 108 సంహితలు ప్రధానములైనవి. ఇప్పటివరకును జరిగిన పరిశోధనల వలన 250 సంహితలవరకు బయటపడియున్నవి. పౌష్కర సంహితయందు 62 వేల శ్లోకపరిమితములయిన పాంచరాత్రసంహిత లున్నవనియు శ్రీ ప్రశ్న, విష్ణు తిలకములయందు అర్దకోటి శ్లోక పరిమితములైన సంహితము లున్నవనియు చెప్పబడి యున్నవి. - పాంచరాత్రాగమ నామధేయములు, వాని వ్యుత్పత్తి :-(1) ఏకాయనశాఖ, (2) మహోపనిషత్తు, (3) పా త్త్వత శాస్త్రము, (4) భగవచ్ఛాస్త్రము, (5) భాగవతా గమము, (6) పాంచరాత్రము అని వివిధ నామములతో నీ యాగమములు కీర్తింపబడుచున్నవి.
“ఏక ఏవ (శ్రీమన్నారాయణః) అయన (ఆరాధ్యః) ఇతి శ్రుతిః ఏకాయన శ్రుతిః" అను వ్యుత్పత్తిచే “శ్రీమన్నారాయణు డొక్కడే ఆరాధ్యుడు, ప్రాప్యుడు, ప్రావకుడును" అని యువదేశించు వేద భాగమునకు ఏకాయనశ్రుతి యని పేరు. పరమరహస్యములగు. భగవత్తత్త్వములను, ఆత్మల తత్త్వ = హిత - పురుషార్థములను విశిష్టక్రమమున నిరూపించు చుండుట చేతను, నాలుగువేదములు సాంఖ్యయోగములు అన్నియు చేరి ఈ పాంచరాత్ర సంహితయగుటచే మహోపనిషత్తను నామము అన్వర్థ మగుచున్నది. సచ్ఛబ్దవాచ్యుడగు భగవంతుని యొక్కయు సాత్త్వతులగు భాగవతుల యొక్కయు వైభవానుష్ఠానాదుల బోధించు చుండుటచే సాత్త్వత శాస్త్రమను నామ ధేయము యుక్తమగుచున్నది. అందుచేతనే భగవ