ఆంధ్ర సినిమా పరిశ్రమ
యీ సంవత్సరమే ఏర్పడినది. ప్రభుత్వము మంచి చిత్రములకు బహుమతు లివ్వసాగినది. ప్రభుత్వము వారి
యాజ్ఞ ప్రకారము విద్యాబోధన చిత్రాలను విద్యాలయములలో చూపుటకు అనుమతి పత్రములను (లైసెన్సు) పొంది కొందరు వ్యాపారము చేయసాగిరి.
1950 లో జానపద చిత్రము లనిన ముఖము మొత్తినది. ఇంతలో "సంసారం" అను చిత్రము వెలువడినది. దాని మూలమున చేకూరిన లాభమునుబట్టి ఆ చిత్రములో పనిచేసిన వారందరి సంసారములును బాగుపడెను. దానితో నిర్మాతలకు "సాంఘిక చిత్రములు" లాభదాయకము లనెడు భావ మేర్పడినది, తెలుగు సంస్థయయిన శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీవారి “నవజీవన" అను తమిళ చిత్రమును ప్రభుత్వమువారు ఉత్తమ చిత్రముగా పరిగణించి దానికి ట్రోఫీని ప్రసాదించిరి. తెలుగులో మొదటి డబ్బింగుచిత్రము "ఆహుతి".
1951-1956: 1951 లో ముడిఫిలము ధారాళముగా దొరకసాగినది. ఎక్కువమంది చిత్రనిర్మాణ రంగములోనికి దూకినారు. జానపద చిత్రములు దెబ్బతిన్నవి. ప్రొజెక్టర్లను ప్రతి పాఠశాల కొనవలయునని ప్రభుత్వము వారు ఆదేశించినను, కొన్ని పాఠశాలలు మాత్రమే కొనుట చేత ఒక లక్షరూపాయలవరకు ప్రదర్శకులకు నష్టము వచ్చినది.
1952 సినిమా పరిశ్రమకు మంచి ఉచ్చదళ. 1951 లో తీసిన చిత్రాలవలన నిర్మాతలకు కనకవర్షము కురిసినది.ఆ డబ్బు చూడగానే ఏమి చేయవలయువా అన్న స్థితికి వారు వచ్చినారు. క్రొత్త నిర్మాతలు ఎందరో రంగములోనికి దిగినారు, మొయిలుచూచి చెరువుకట్ట తెగగొట్టు కొన్నట్లు పాతనిర్మాతలు విశేష ద్రవ్యమును వ్యయించి చిత్రనిర్మాణశాలలు కట్ట సాగించినారు. అట్లు వచ్చిన తెలుగు చిత్ర నిర్మాణశాలలు 1. భరణి. 2. నరుసు, 3. ప్రకాశ్, 4. రోహిణీ లు. అంతవరకు సహాయకులుగా నున్న వారికి ఉన్నతిని కల్పించి క్రొత్త నిర్మాణశాలలలో "వారిని నిపుణులనుగా చేసి కొన్నారు. ఎన్నో చిత్ర నిర్మాణములు బయలు దేరుటతో క్రొత్త రచయితలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు రంగములోనికి ప్రవేశించినారు.' పంపక దారులు పరిశ్రమలో పాదుకొన్న వారికే డబ్బు పెట్టుచుండిరి. అందువలన, తక్కువ ధనముతో చిత్ర నిర్మాణరంగములోనికి దిగిననిర్మాతలకు ధనలోపము చేత చిత్ర నిర్మాణశాలలలో పని లేకపోయినది. పనివాండ్రకు జీతాలు ప్రయాసమీద చిత్రనిర్మాణశాలాధిపతులు ఇయ్యవలసి వచ్చినది. పెరుగుట విరుగుట కొరకే అన్న సిద్ధాంతము నిజమయినది. సాంఘికములకే కొంత ధన లాభము ఏర్పడినది. కాని మొత్తముమీద ఈ సంవత్సరము చిత్రములు అంత విజయవంతములు కాలేదు.
స్త్రీ దర్శకత్వములో దక్షిణ హిందూస్థానము నందు బయలుపడ్డ చిత్రము “చండీరాణి". దానికి దర్శకత్వము వహించినది శ్రీమతి పి. భానుమతి. అందులోను ఒకేసారి మూడు భాషలలో నిర్మాణము సాగించినది. ఎక్కువగా డబ్బింగు చిత్రాలు బయటికి వచ్చినవి. తెలుగువారు చాల మంది సాంకేతిక నిపుణులుగా తయారయినారు.
ఉపసంహారము : మొత్తముమీద సగటున సంవత్సరమునకు 35 చిత్రములు వచ్చినవి. 27-3-1955 నాటికి "ఆంధ్రా సినిమా రెగ్యులేటింగు యాక్టు' ప్రచురించినారు. 1956 నాటికి తెలుగువారికి మద్రాసులో ఆరు స్టూడియో లున్నవి. భరణి, రోహిణి నరుసు, ప్రకాశ్, వీనస్, వాహిని అనునవి వాని పేర్లు వాహినీలో మాత్రమే లేబరేటరీ ప్రోసెసింగులు ఉన్నవి జయా లేబరేటరీ అనునదొకటి కలదు. ఆంధ్రులకు పంపకపు సంస్థలు 57 వరకు ఉన్నవి. అందులో రెండు మూడు సంస్థలు పాశ్చాత్య చిత్రముల పంపకముకూడ చేయుచున్నవి. ఒకటి 16 M. M. చిత్రములు పంపకము చేయుచున్నది. విజయవాడ, గుంతకల్లు పంపకపు కేంద్రాలుగా నున్నవి.
ఆంధ్రులకు (1) ఆంధ్రసినీ ఎంప్లాయిసు అసోసి యేషను, (2) ఆంధ్రా ఫిలిం ఛాంబరు ఆఫ్ కామర్సు (3) పిల్లల చిత్రాలదర్శిని అనుసంస్థలు ఉన్నవి.
తెలుగులో పాతికపయిగా పత్రికలు సినిమా విషయములకు ప్రాముఖ్యము నిచ్చుచున్నవి. 1955 నుండి చిత్రపరిశ్రమకు మంచియోగము పట్టినట్టున్నది.
ఇప్పుడాంధ్రప్రదేశములో మూడువందల యిరువదికి పైగా ప్రదర్శనశాలలున్నవి. నూరు వరకు సంచరించే చిత్రప్రదర్శన శాలలు ఉన్నవి. 1918 కి పూర్వము జొ