ఆంధ్రలిపి పరిణామము
ధ్వని పరముగనే యుప యుక్తమగుచున్నది. దీనినిబట్టి వర్ణాక్షర శబ్దములు ఏనాడు భాషలోనికి వచ్చినవో ఆ నాటికి కొంతకాలమునకు పూర్వముననే ఆ భాష గలదేశమునందు లిపి యుండియుండు ననుట స్పష్టము.
లిపి చరిత్రనుబట్టి చూడగా మనదేశములో స్థూలముగా రెండువిధములగు లిపులు వెలసినవని చెప్పవచ్చును. ఒకటి- ఖరోష్టి లిపి. ఇది కుడివైపునుండి యెడమవైపునకు వ్రాయబడును. రెండవది. బ్రాహ్మీ లిపి. ఇది యెడమ వైపునుండి కుడివైపునకు వ్రాయబడును. ఈ రెండింటిలో బ్రాహ్మీలిపియే మనదేశమున బాగుగా వ్యాపించి ప్రచారములోనికి వచ్చినది. మన దేశమున ప్రప్రథమమున లభ్యమయిన శిలాశాసనములు అశోకుని కాలమునాటివి. అంతకుపూర్వమే బ్రాహ్మీ లిపియందు కొన్ని పరిణామ దశలు సంభవించియుండును. వాటి చరిత్ర పూర్తిగా తెలిసికొనుటకు సాధన సామగ్రి లభింపలేదు. నే డతి ప్రాచీనములగు మొహంజెదారో, హరప్పా మొదలగు స్థలములలో దొరకిన శిలాఫలకములందలి లిపి బ్రాహ్మీలిపి యొక్క పూర్వస్వరూపమును కొంతవరకు తెలియజేయుచున్న దని యూహించుట కవకాశ మున్నది. అయితే, ఇది ఔత్తరాహిక భాషలకు సంబంధించినది.
మన తెలుగుభాష దాక్షిణాత్య భాషావర్గమునకు సంబంధించినది. కాని ఈ భాగమును కూడ తొట్టతొలుతగా లిపి బద్ధము చేయబడిన శాసనములలో అశోకుని శాసనములే ప్రాచీనతమములు. తర్వాత వెలసిన భిన్నభిన్న ప్రాంతములలోని శాసనములందలి లిపిని పరిశీలించిచూడగా, దాక్షిణాత్యలిపులకు కూడ మాతృక అశోకుని శాసన లిపియే యని వ్యక్తమగును. దీనినే మౌర్యలిపి అనికూడ నందురు. ఈ లిపుల పరిణామము ఈ క్రింద చూపబడినది :
దాక్షిణాత్యలిపులకు అశోకలిపియే మూలాధార మనియు నిది బ్రాహ్మీలిపినుండి పుట్టినదనియు ముందు చెప్పియుంటిని. ప్రాచీన శాస్త్రములలోని కొన్ని పదములనుబట్టి తెలుగుభాషలో క్రీ.శ. 350 నాటికి లిపి యేర్పడినదని చెప్పవచ్చును. దీనిని వేంగీలిపి అని అందురు. ఆ లిపి క్రీ. శ. 900 నాటికి పూర్వ చాళుక్యలిపిగా పరిణ మించినది. క్రీ. శ. 1000 ప్రాంతమున గల లిపిని సంధి కాలపు లిపి అని యనవచ్చును. ఆ వెనుక క్రీ. శ. 1300 ప్రాంతమునాటికి ప్రాత తెలుగులిపి యేర్పడినది. అప్పటి నుండి నేటివరకు తెలుగులిపిలో మార్పు కలుగలేదు.
మన వాఙ్మయచరిత్రనుబట్టి చూచినచో రేనాటి చోళుల శాసనములు వేంగి లిపిలోను, అద్దంకి, ధర్మవరము శాసనములు పూర్వ చాళుక్యలిపిలోను, నన్నయ కాలపు శాసనములు సంధి లిపిలోను కానవచ్చుచున్నవి. తిక్కన కాలమునాడు పూర్ణపరిణతినందిన తెలుగులిపి కానవచ్చు చున్నది. తిక్కన కాలము మహాభారత రచనచే వాఙ్మయ