పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/587

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రదేశపు ఖనిజసంపద - II


గంధకము (Sulphur) : తాండూరు, కొత్తగూడెం, బొగ్గుగనులనుండి ఉత్పత్తియగు బొగ్గులో పొరలమధ్యన అక్కడక్కడ నుండు ఇనుపగంధకిదమును (pyrite) ఏరి తీయుదురు. తాండూరు గనులవద్ద ఈ రీతిని ఒక్క బొగ్గు పొర (seam) నుండియే ప్రతినెలా 40 టన్నుల గంధకిదము దొరుకుచున్నది.

అభ్రకము (Mica) : కెంపు వన్నెగల మస్కోవైట్ అభ్రకము ఖమ్మముమెట్టుజిల్లా పాలవంచ తాలూకాలో పూజారి మొక్కొడివద్ద, మధిర తాలూకాలో కల్లూరు సమీపమునను, హాన్ బ్లైండ్ అభ్రక నైసులను చొచ్చిన పెగ్మటైట్లలో లభ్యమగును.

పలక (Slate): ఇల్లిందల తాలూకాలో తుమ్మల చిలకవద్దను, నల్లగొండజిల్లా మిరియాలగూడ తాలూకాలో వజీరాబాదువద్దను పలకలు కోయుటకు వీలయిన గట్టి సుద్దరాళ్ళు గలవు.

మెరుగుడు (Abrasives) ఖనిజములు :- ఆభరణముల కుపయోగించు పారదర్శకమగు ఎరుపు గార్నెట్, కయ నైట్ పాలవంచతాలూకాలో గరిక వేట, కాకెర్ల ప్రాంతముల లభించును.

పాలవంచ తాలూకాలో రంగాపూరువద్ద 2500 టన్నుల కురువిందము సయనైట్లలో గలదు. ఇది మిరియాలగూడ తాలూకాలో పెద్దగూడెము ప్రాంతమున, ఖమ్మము మెట్టు తాలూకాలో గుబ్బగుర్తివద్దను, పాలవంచ తాలూకాలో కన్నెగిరి కొండలయందునుకూడ నున్నది.

వజ్రములు (Diamonds): ఆంధ్రదేశములో కొంతభాగ మొకప్పుడు, గోల్కొండ రాజ్యములో చేరి యుండెను. ఇక్కడి వజ్రములు గోల్కొండ మార్కెటు నుండి ప్రపంచమంతయు వ్యాపించుటచే, వీటికి గోల్కొండ వజ్రములని పేరువచ్చెను. పాతవజ్రపుగనులు కృష్ణ కుత్తరపు టొడ్డునను, మహబూబునగరుజిల్లాలోను చాలచోట్ల నున్నవి.

సీసము (Lead) : గెలీనా నల్లగొండజిల్లా దేవరకొండ తాలూకాలో పెద్ద అర్సిల్ల పల్లి, చిన్న అర్సిల్ల పల్లి చింతకుంట, మల్లెపల్లి, కొన్నెరిగూడెం, మిరియాలగూడ తాలూకాలో నందికొండవద్ద కాల్సైట్, పలుగురాతి నాళములలో కొద్దిగగలదు.

రాగి (Copper): పాలవంచ తాలూకాలో యాలం బయలువద్ద, నల్ల గొండజిల్లా హుజూర్ నగరు తాలూకాలో చింత్రియాలవద్ద, మహబూబ్ నగరుజిల్లాలోని గద్వాల, మక్తల్, అచ్చం పేట తాలూకాలలో కొన్ని చోట్ల పాత రాగి గనులున్నవి.

1954 లో తెలంగాణా ఖనిజోత్పత్తి ఉత్పత్తి (ట) విలువ (రు,) ఖనిజము జిల్లా. తాలూ వారి మొత్తము తాలూకావారి మొత్తము ఇనుము : కరీంనగరు.జి. హుజూరాబాద్-తా. 800 8,000 ఖమ్మముమెట్టు.జి. ఇల్లిందల 2,810 28,100 ' ఖమ్మము మెట్టు-తా. 86,099 39,709 8,60,990 8,97,090 క్రోమైట్ ఖమ్మము మెట్టు-జి. మధిర తా. 88 69 2,760 2.760 ఖనిజరంగులు: మెదకు-జి. జహీరాబాద్-తా. 85 1,700 హైద్రాబాదు-జి. వికారాబాదు-కా 100 185 2,000 8,700 516