పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/57

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంటువ్యాధులు-ఎల్లోపాతి

లందును, వరాహ సంహిత, మానసోల్లాసము, అభిలషి తార్థ చింతామణి, కౌటిల్య అర్థశాస్త్రములందును చూడవలయును.

కాలధర్మము ననుసరించి షడ్రుతువు లందును భిన్న భిన్నములగు ఆయా వ్యాధులు కలుగుచున్నను, విశేష ముగ విసర్గ ఆదాన కాలములయందు మధ్య ఋతువు లగు శరస్వసంతములు మీ గు ల భయంకరములగు వ్యాధుల కునికిపట్టు లని వర్ణింపబడినవి. విసర్గకాలము వర్షా శర ద్ధేమంత ఋతువు లు. ఈ ఋతువులందు సూర్యుడు తన కిరణ ప్రసారమున భూమికిని, అందలి పదార్థములకును బలమొసంగును. ఆదానకాలము శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులు. ఈ ఋతువులందు సూర్యుడు తీవ్రమగు తన కిరణ ప్రసారముచే భూమి నుండియు, అందలి పదార్థములనుండియు సారవంతమగు బలమును లాగుకొనును. ఇది ఆయుర్వేద సిద్ధాంత పరిచయము.

దీని నిట్లుంచి విజ్ఞాన విషయ విశేషాత్మకములగు పురాణేతిహాసములయందు సహితము ఆయా ధర్మము లుపదేశించు సందర్భములలో శరద్వసంతములు వ్యాధు లకు ఆకరము అని చెప్పబడినది. కొమ్మనామాత్య పుత్రు డగు సోమయాజి తిక్కనామాత్యుడు తన ఆంధ్రీకృత మహాభారతమునం దిట్లు వర్ణించెను:-

అరయన్ సర్వజ నౌఘ నాశనములై యత్యంత ఘోరమ్ములై పరమవ్యాధి కరమ్ములయ్యు గడు తో థా స్ఫూర్తి నొప్పారి శాం కరికిం బ్రీతి కరమ్ములై మిగుల వే డ్కల్ జేయు లోకాళి కీ శరథారంభ వసంతముల్ శమనదం ష్ట్రా ప్రాయముల్ భూవరా!

ఇందు శరద్వసంతములు యముని కోరలవలె మహా అపాయకరము లని బోధింపబడినది. శరద్ధేమంతఋతువు అందలి కార్తీక మార్గశీర్ష కృష్ణ శుక్ల పక్షములు యమ దంష్ట్రలుగా వర్ణించి "స్వల్ప భుక్తోహి జీవతి" కొద్దిగా ఆహారము చేయువాడే సుఖముగ జీవించునని ఆయుర్వే దమున చెప్పబడెను. అందుకనియే ఏ ఋతువులం దైన సరే ఏ రోగములచేతను చిక్కకుండునట్లు మంచి నడవడి' కలిగియుండ వలయునని ఆయుర్వేద మాదేశించినది.

నరో హితాహార విహార సేవీ సమీక్ష్య కారీ విషయే ష్వసక్తః దాతా సమః సత్యపరః ఠమావాన్ ఆప్తోపసేవీ చ భవ త్యరోగః చ. శా. 2-46

దేశ కాలములకును, శరీరమునకును హితములగ ఆహారవిహారముల నుపయోగించుటయు, మంచి చెడు: నాలోచించి పనుల జేయుటయు, ఇంద్రియ నిగ్రహము త్యాగ శీలతయు, సమత్వబుద్ధి, సత్యనిష్ఠ, ఓరుపు కలిగి జ్ఞానానుభవములు గల వారిని సేవించు నాతడు రోగ ముల పాల్పడక సుఖముగా నుండును.

మతి ర్వచః కర్మసుభానుబంధం సత్వం విధేయం విశదా చ బుద్ధిః జ్ఞానం తపః తత్పరతాచ యోగే యన్యా స్ర్తీ తం నానుతపన్తి రోగాః చ. శా. 2-47

భవిష్యద్భాగ్యోదయమును గోరు మనోవాక్కర్మ ములు కలిగి సాత్వికత, వినయము, వినిర్మల బుద్ధి, ఆత్మ వివేకము, తపోభిరతి, యోగతత్పరత ఎవరికి కలిగి యుండునో అట్టివారిని క్రూరములగు రోగములు వేధింప జాలవు.

మానవ ధర్మతత్వ బోధన మగు ఈ ఆయు ర్వేచ సిద్ధాంతాదేశమును అనుసరించి నడచినచో భయంక రము లగు అంటు రోగముల పాల్పడక వంశవర్ధనులై, శతాయుష్మంతులై, వీర్యవంతము, మేధాయుష్మంతము నగు సత్సంతాన సౌభాగ్య సంపదలు కలిగి, మనుజులు మనుజులుగా మనుష్యానంకము సంపూర్ణముగా ననుభ వించి దేవతాత్ము లగుదురు.

వే. తి. వెం. రా. స్వా.


అంటువ్యాధులు-ఎల్లోపాతి

ఘటసర్పి (డిఫ్తా రియా) :- ఇది ఘటనర్పి సూక్ష్మ క్రిములవలన సంభవించును. ఇది తుంపరల వలన కలిగిన సంపర్క దోషమువలనను, రోగి ఉపయోగించిన గ్లాసులు,