పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/547

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశ చరిత్రము – III


అనితల్లి (1416-1450) : కాటయ వేముని కూతురు, ఈమె పక్షమున మామగారు అల్లాడ రెడ్డి (1416-25) రాజ్యమును రక్షించుచుండెను. తరువాత రాణితో నామె భర్త వీరభద్రా రెడ్డి (1425-50) రాజ్యము చేసెను. అల్లాడ రెడ్డి భార్య అన వేమా రెడ్డి దౌహిత్రి. అల్లాడ రెడ్డి రెండవపుత్రుడు వీరభద్రా రెడ్డి అనితల్లిని వివాహమాడెను. బహమనీ సుల్తానును, చోడులను వెలమలను ఓడించెను. 1417 నాటికి అన్న దేవుని, అతని కుమారుడు వీరభద్రుని హతమార్చెను. కళింగముపై దండెత్తి ఝాడె సప్తమాడెములు, బారుహ, దొంతి, జంతుర్నాడు, ఒడ్డాది, రంభ అనువాటిని గెల్చి 'గజపతిదళ విభాళ ' అను బిరుదును గాంచెను. 1420 లో బహమనీసుల్తాను- ఫిరోజిషాను ఓడించెను. మాల్వాసుల్తాను ఆల్పఖాన్ లేక హోషాంగ్ కళింగ దండయాత్రనుండి మరలివెళ్ళునపుడు అల్లాడరెడ్డిచే ఓడిన వాడయ్యెను. అల్లాడ రెడ్డికి దేవరాయలు మిత్రుడు. అల్లాడ రెడ్డి `పెదకోమటి వేముని యుద్ధములో నోడించెను.

అనితల్లి, వీరభద్రా రెడ్ల పాలనలో వీరభద్రుని అన్నగారు వేమా రెడ్డి రాజ్యము నడిపించుచుండెను. వేమారెడ్డి విజయములు గమనింపదగినవి. రెడ్డి సైన్యములు బంగాళములో పండువా వరకు వెళ్ళెను. రెడ్డి రాజ్యము ఈ కాలమున ఉచ్ఛదశయం దుండెను. ప్రజల సౌఖ్యసంపదలను శ్రీనాథుడు తన కావ్య రాజములలో వర్ణించియున్నాడు.

1426 ప్రాంతమున వేమ వీరభద్రా రెడ్లు కళింగ జైత్రయాత్రకై వెడలి జీడికోట, మాకవరము, సప్తమాడెములు, ఝాడె, కలువపల్లి, ఒడ్డాది, కటకము గెలిచిరి .వీరు శృంగవరపుకోట, తోతుగడ్డ జయించి సముద్రతీరమున జయస్తంభములను నిల్పిరి. చీకటికోట గెలిచి చిల్క సముద్రమును దాటి, కసింకోట, కప్పకొండ గెలిచిరి. భాను దేవుడు IV రెడ్లతో సంధిచేసికొని కప్పము కట్టుచుండెను. కపిలేశ్వర గజపతి 1437-44 ప్రాంతమున రెడ్లపై దండెత్తి ఓడింపబడెను. యుద్ధములో రెడ్లకు దేవరాయల సైన్యములు తొడ్పడెను. 1426-27 లో రెడ్లు వెలమ దండయాత్రను తిరుగ గొట్టిరి. రెడ్లు బహమనీ అహమదుషా (1422 - 35) మిత్రులు. వీరభద్రా రెడ్డి పండువా సుల్తాను స్నేహితులు. దేవరాయలు II, మల్లి కార్జున రాయలు (1444 - 47) గజపతుల నడ్డుటకు రెడ్లకు సాయపడుచుండిరి.

1450 లో కపిలేశ్వర గజపతి రెడ్డి రాజ్యమును గెలిచి, 1455 లో కొండవీటిని గెలిచి, 1465 నాటికి తూర్పు తీరము నంతటిని తన పాలనము క్రిందికి తెచ్చెను. రాజ ప్రతినిధులను నిల్పెను. ఇటుల ఆంధ్ర దేశమున రెడ్ల పాలన మంతరించెను.

డా. వి. య.