ఆంధ్రదేశ చరిత్రము. II
వెళ్లెను. 1018 లో రాజేంద్రచోళుని కొడుకు రాజాధిరాజుకూడ తండ్రితోపాటు సింహాసన మెక్కగా అది చూచుటకు తిరిగి విమలాదిత్యుడు తంజావూరు వెళ్ళి 1022 లో అక్కడనే మరణించెను. కనుక 1022 శ్రావణ మాసములో అతని పెద్ద కొడుకు రాజరాజు,రాజమహేంద్రవర సింహాసనమెక్కెను. కాని 1019 లోనే రాజ్యమునకు వచ్చెను. ఈతని భార్య అమ్మంగదేవి, ఈతని మేనమామయగు రాజేంద్రచోళుని కూతురు. ఇట్లే వీరి కొడుకు రాజేంద్రచోళుడు (ఉభయ కులోత్తుంగ చోళదేవుడు) తన మేనమామయగు రాజేంద్రదేవుని కూతురగు మధురాంతకిని వివాహమాడెను. ఈ మేనరికపు
వివాహమువల్ల చోళ చాళుక్య సంబంధములు మరింత గట్టిపడెను. ప్రాయశః విమలాదిత్యుని రెండవ కుమారుడు
సప్తమ విజయాదిత్యుడు పశ్చిమ చాళుక్య చక్రవర్తి రెండవ జయసింహుని సహాయమున రాజమహేంద్రవర సింహాసనమును పట్టుకొనుటచేత (తన తండ్రి విమలాదిత్యుడు 1018 లో తంజావూరు వెళ్ళినపుడు) చోళ రాజేంద్రుడు అతనిని, అతనికి సహాయమొనర్చిన జయసింహుని, కళింగ రాజులను ఓడించి, 1022 సం. ఆగస్టు 16 న రాజరాజ నరేంద్రునికి పట్టాభిషేక మొనర్చెను. కాని తిరిగి 8 సంవత్సరములకు విజయాదిత్యుడు తన అన్నను పదభ్రష్టుని గావించెను. తాను 1031 జూనులో పట్టాభిషిక్తుడా యెను. అతనికి తిరిగి జయసింహుడు సహాయ మొనర్చెను. కనుక చోళరాజు రాజేంద్రుడు రాజరాజుకు సహాయమొనర్చెను. 1032 లో కలిదిండి వద్ద గొప్ప యుద్ధము జరిగెను. తుదకు చోళులు గెలిచిరి. రాజరాజ నరేంద్రునికి తుదకు 1035 లో సింహాసన మిప్పించిరి. ఇతడు పదిసంవత్సరములు శాంతియుతముగా పాలించెను. కాని 1044 లో రాజేంద్రచోళుని మరణానంతరము తిరిగి పశ్చిమ చాళుక్య చక్రవర్తి మొదటి సోమేశ్వరుడు వేంగీ రాజ్యమును, కళింగమును జయించెను. కాని చోళ రాజాధిరాజు ధరణికోట కొల్లిపాక యుద్ధములలో
పశ్చిమ చాళుక్యులను ఓడించెను. కాని వేంగి రాజ్యమును వారి హ స్తములనుండి తీసికొనలేకపోయెను. అయినప్పటికీ
రాజరాజ నరేంద్రుడు సోమేశ్వరునితో సంధిచేసికొని 'పరిపాలింపగలిగెను. సోమేశ్వరుని ప్రధానియగు నారాయణభట్టుకు నందంపూడి గ్రామమొసంగెను. ఈతడే నన్నయకు ఆంధ్రభారత రచనయందు సహాయమొనర్చిన వాడు (1051 – 1052). రాజరాజు శివపూజా ధురంధరుడు. వైదిక మతాభిమాని. వర్ణాశ్రమ ధర్మములను నిలిపెను.వేదశాస్త్రములను పోషించెను. యజ్ఞయాగాది కర్మలకు భూములను, ధనమును ఇచ్చెను. పురాణ, ఆగమ, వేదాంత శాస్త్రములు నేర్చినవాడు. అనేక దేవాలయములు, అగ్రహారములు, సత్రములు కట్టించెను.
క్రీ. శ. 1081 లో తన పరోక్షమున తిరిగి తన సవతి తమ్ముడు విజయాదిత్యుడు రాజ్యమును గ్రహించెను. ఇతడు తన కొడుకు శక్తివర్మకు రాజ్యమిచ్చెను (1061). కాని అతడొక సంవత్సరము రాజ్యపాలన జరిపి యుద్ధమునందు చనిపోయెను. కనుక ప్రజల కోరికపై తాను రాజ్యమును స్వీకరింపవలసివచ్చెనని విజయాదిత్యుడు వేంగిని పరిపాలించెను. ఈతడు ఇంతకుముందు పశ్చిమ చాళుక్య చక్రవర్తులకు సామంతుడుగానుండి నోలంబ వాడి, కోలారు దేశములలో వారి మాండలికుడుగను, సేనాధిపతిగాను ఉండి తుదకు వేంగిరాజ్యమును పట్టుకొనెను. అయినను చోళ చక్రవర్తి వీర రాజేంద్రుడు వేంగిపై దండెత్తి విజయాదిత్యుని పారద్రోలి క్రీ. శ. 1068 లో వేంగి రాజ్యమును రాజేంద్ర చోళునికే పట్టము కట్టెను. విజయాదిత్యుడు కళింగగాంగ రాజరాజు వద్ద (1069-70) శరణు జొచ్చెను. 1070 లో చోళరాజగు అధి రాజేంద్రుడు చనిపోయెను. కనుక చాళుక్య రాజరాజ నరేంద్రుని కొడుకు రాజేంద్రచోళుడు రాజధానిని స్వాధీన పరచుకొని సింహాసన మెక్కెను. ఈ సమయమున కళింగ గాంగ రాజరాజు తన సేనాపతియగు బణపతిని వేంగివై దండెత్త పంపెను. అతడు చోళుల సైన్యమును ఓడించగా వారు గాంగ రాజరాజుతో సంధి చేసికొనిరి (1072). తన జీవిత కాలము వేంగిని విజయాదిత్యుడు పాలించుటకును, కళింగ రాజరాజునకు రాజేంద్రుని మరదలు రాజసుందరి నిచ్చి వివాహము చేయుటకును అంగీకరింపబడెను. వీని ఫలితముగా 1076 వరకు విజయాదిత్యుడు వేంగి రాజుగా పరిపాలించి ఆ సంవత్సరమున చనిపోయేచు. అపుడు రాజేంద్రచోళ లేక కులోత్తుంగచోళ తెలుగు లేక వేంగి దేశమును,