బట్టియు, పులుమావి ఆంధ్రదేశము నంతయు పాలించినట్లు తెలియుచున్నది.
తరువాత రాజులలో ముఖ్యుడు యజ్ఞశ్రీ యను నతడు. ఈతని నాణెములు గుజరాతు, కథియవాడు, బరోడా, మాల్వా, అపరాంత, మహారాష్ట్ర ఆంధ్రదేశములలోను, మధ్య రాష్ట్రములోను దొరకినవి. వీటినిబట్టి ఈతని రాజ్యవిస్తృతిని ఊహింపదగును. కొన్ని నాణెములపై ఓడ యొక్క చిత్రముండుటచే శాతవాహన యుగమున సముద్రయానము విస్తారముగా సాగెడిదని ఊహింపనగుచున్నది. తరువాతి రాజులు అంత పేరుగన్న వారు కారు. యజ్ఞ శ్రీ అనంతరము విజయశ్రీ, చంద్రశ్రీ. పులోమావి యనువారు శాతవాహన రాజ్యాధికారమును పూనిరి. వీరు పరాక్రమవంతులైన పరిపాలకులు కాక పోవుటచే సామ్రాజ్యభాగములు వీరి హస్తములనుండి జారిపోయి తుదకు శాతవాహన సామ్రాజ్యమే క్రీ. శ. 220 ప్రాంతమున అస్తమించెను. ఆంధ్ర రాజ్యములోని సామంతులు స్వతంత్రు లయిరి. పశ్చిమమున ఆభీరులు, నైఋతిని చూటువంశమువారు, తూర్పు ప్రాంతమున ఇక్ష్వాకులు, దక్షిణమున పల్లవులు స్వతంత్ర రాజ్యములను స్థాపించుకొనిరి.
శాతవాహనుల కాలమున ఆంధ్రదేశ పరిస్థితులు : పరిపాలన కొరకు సామ్రాజ్యము హారములులేక అహారములు (భాగములు)గా విభజింపబడెను. అహారములను అమాత్యులు పాలించిరి. అహారములు గ్రామములుగా విభజింప బడెడివి. గ్రామములు గ్రామికుల పాలనలో నుండెడివి. నగరపాలన నాగరకుల క్రింద నుండెడిది. కొన్ని మండల ములు సామంతుల అధీనములో నుండెడివి. వీరు మహారథులు, మహాభోజులు అని పిలువబడుచుండిరి. మహా సేనాపతి యనునతడు సైన్యవ్యవహారములేగాక రాజకీయ వ్యవహారములు కూడ చక్కబెట్టుట కలదు. ఇతర ఉద్యోగస్థులలో మహాతారక, భాండాగారిక, మహామాత్ర, నిబంధ కార, అనబడువారుకూడ కలరు. రాజులు ధర్మ మార్గమున పరిపాలన చేసెడివారు.
సంఘజీవనములో చాతుర్వర్ణ్య వ్యవస్థ యుండెడిది. యవనులు, శకులు, వహ్లవులు మొదలైన విదేశీయులు సంఘములో కలిసిపోయి ఏదో యొక కులమువారమని చెప్పుకొనెడివారు. స్త్రీలకు సంఘములో ప్రముఖస్థాన ముండెను. స్త్రీలు తమ భర్తల బిరుదములను కూడ తమ పేళ్ళతో చేర్చుకొనెడివారు.
విదేశ వ్యాపారము, వర్తకము విరివిగా జరిగెడివి. తూర్పు తీరమున కంటకొస్సల, కొడ్డూర, అల్లోనైనె అనునవి ముఖ్యమైన రేవు పట్టణములు, పశ్చిమప్రాంతమున భరుకచ్ఛము, సొపారా, కల్యాణ అను రేవులు పేరుపొందినవి. పైఠను, తగర, ధాన్యకటకము వ్యాపార కేంద్రములుగా ప్రసిద్ధి కెక్కినవి. దేశ మధ్యమునుండి వ్యాపించుచు మహారాజ పథములు అను పెద్దబాటలు ఉండెడివి. వర్తకులు శ్రేణులుగా నేర్పడెడివారు. శ్రేణికి అధ్యక్షుడు శ్రేష్ఠి. చేనేత, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, తెలిక. మొదలయిన వివిధ వృత్తులవారు కూడ నుండెడి వారు. వివిధ వృత్తులవారికి వేర్వేరు శ్రేణు లుండెడివి. రాజులును, ధనవంతులును ఈ శ్రేణులకు తక్కువ వడ్డీతో ధనము నిలువచేయుటకు ఇచ్చుచుండిరి. ఈ ద్రవ్యము మీద వచ్చు వడ్డీతో దానధర్మములకు నిబంధనము చేయుటయు కలదు. ఇది ఈనాటి సహకార పద్దతిని ఒక విధముగా పోలియున్నది. నహపణుని అల్లుడును, ధర్మచింతన కలవాడును అగు ఋషభదత్తుని శాసనమువలన ఈ యంశములు తెలియవచ్చుచున్నవి. వ్యవసాయము ముఖ్యమైనవృత్తి. మతసంస్థలకు భూములను దానమిచ్చు నాచారము కలదు. భూములనుండి పన్నులు వసూ లగుచుండెను. ఉప్పును తయారుచేసి అమ్ముట ప్రభుత్వము వారి ప్రత్యేకమైన హక్కు.
రాజులు హిందూమతావలంబకులుగా నుండిరి. వారు యజ్ఞయాగాదులను చేసెడివారు. శాతవాహనులలో మూడవ రాజగు మొదటి శాతకర్ణి తన కుమారునికి 'వేదసిరి' అను పేరు పెట్టుకొనెను. జనులు శివునికూడ కొలిచెడివారు. సప్తశతిలో పశుపతిని, గౌరిని స్తుతించిన భాగములున్నవి. 172 వ గాథలో గౌరీ దేవాలయములు పేర్కొనబడినవి. గణేశుని గణాధిపతి యనిరి. రాజులు వైదిక మతాభిమానులైనను బౌద్ధమతవ్యాప్తి ఆకాలములో జరిగినది. భట్టిప్రోలు, అమరావతి, ఘంటసాల, గుమ్మడిదులు, గుడివాడ, గోలి మొదలగు ప్రదేశములలోని బౌద్ధస్తూపములు ఆనాటివే. బౌద్ధులు నాగరాజును