పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/51

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంటువ్యాధులు (ఆయుర్వేదము)


యందు చేర్చిన మొత్తము అంటువ్యాధులు రెండువందల యిరువది రెండుగా లెక్కకు తేలును. ఈ వ్యాధుల యొక్కయు కారణముల యొక్కయు వివరము లిట్లు తెలియనగును:

మొద లీ యంటు వ్యాధులు కలుగుటకు చెప్పబడిన కారణములు తొమ్మిదియు, పదునెనిమిది భాగములుగా విభజింపబడును. ఆ వివర మివిధముగ తెలియగలదు:

(1) ప్రసఙ్గము: విశేషముగ కలిసియుండుట. ఈకలిసి యుండుట యనునది మూడువిధములు.

1. కౌగిలించుకొనుట.
2. మిథునధర్మమున రమించుట.
3. క్రీడించుట. (వనవిహారము, ఆటలాడుట,జలక్రీడ. ) (ప్రెసఙ్గమాలింగన రతిజలక్రీడాదీని.) స్మరదీపనము, ప్ర-3-సు 12.

(2) 'గాత్రసంస్పర్శనము: పదేపదే శరీరమును తాకు చుండుట. ఇది మూడు విధములు.

1. ముద్దులాడుట.
2. ఒకరినొకరు కలిసికొని తిరుగులాడుట.
3. మాటిమాటికి రహస్యావయవములను ముట్టు కొనుచుండుట. దీనివలన రక్తమునందు ఉష్ణతయు, శుక్రశోణితముల :యందు తేజనతయు, అవయవములయందు ఉద్రేకతయుకలుగును.

(3) నిశ్వాసము : రోగినోటితో విడుచుగాలిని పీల్చుట.(నిశ్వాసమనగా పనివలన శ్రమచెందిగాని, లేక వ్యాధివలన అలసట చెందిగానీ నోటి వెంట విడుచు శ్వాసమునకు పేరు.)

(4) సహభోజనము : కలిసి భుజించుట, ఇది నాలుగు విధములు.

1. రోగితో కలిసి ఒకేపాత్రయందు భుజించుట.
2. రోగి తిని విడిచిన ఆహారమును భుజియించుట.
3. రోగి చే పెట్టబడిన ఆహారమును భుజియించుట.
4. రోగితో సరసన పంక్తియందు భుజించుట.

(5) 'సహశయ్యా : ఒకేపడక నుపయోగించుట. ఇది రెండు విధములు.

1. రోగి పండుకొనుచున్న పక్క యందు పండు కొనుట.
2. రోగితో కలిసి పండుకొనుట

(6) 'సహాసనమూ : ఒకే వేదిక నుపయోగించుట. రెండువిధములు.

1. రోగి కూర్చుండుట కుపయోగింపబడుచు పీట, చాప, అరుగు వీటిపై కూర్చుండుట
2. రోగితో కలిసి ఒకేయాసనమున కూర్చుండు

(7) 'వస్త్రమూ : రోగి ఉపయోగించిన బట్టలను ఉపయోగించుట. (8) 'మాల్యమూ : రోగి ధరించిన పూవులను, మాలలను ధరియించుట.

(9) అనులేపనము : రోగి ఉపయోగింపగా మిగిలిన గంధము, సున్నిపిండి మొదలగు మైపూతలను వాడుక చేయుట.

ఈ పదు నెనిమిది కారణములను ఆధారముగా చేసికొని శరీరమున గల వాతపిత్తకఫము లనబడు త్రిదోషము ఎగుడు దిగుడులై పెడత్రోవలను బట్టి, అనులోమ విలోమగతులచే (అనులోమగతి-వాతాదిదోషము లొక దానియ దొకటి కలిసి లీనమై పుష్టినొందించుకొనుచు తిరుగు విలో మగతి—ఒక దానినొకటి రెచ్చగొట్టి ఉన్మార్గగాము సంబంధములేక చరించుట. దోషములకు అనులోమ, యనునది ఆరోగ్యమునకు కారణము, విలోమ గతి య నది అనారోగ్యమునకు కారణము.) త్వగ్రక్తమా మేదోస్థిమజ్జా శుక్రము లను సప్తధాతువులను చెడగొ రెండు వందల తొమ్మిది గతులు గలవిగా అంటురోగమ వ్యాప్తికి వాహకము లగును. వీటి విభజన మిట్లు గల 'దీనికి అంశాంశ కల్పన మని పేరు.

ధాతువికల్పము

1. కేవల వాతాంతర్జనిత ములు
2. కేవల పిత్తాంతర్జనితములు
3. కేవల కఫాంతర్జనితములు
4. సప్త ధాతుపరిణామాంతర్జనితములు
5. దేశ భేదాంతర్జనితములు

వ్యాధివికల్పము

1. కుష్ఠములు