పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/50

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంటువ్యాధులు (ఆయుర్వేదము)

ప్రదేశము, ఫాక్ లాండ్ దీవుల ప్రదేశము ఇందులోనున్న ముఖ్య భాగాలు.

డి. వి. కె.


అంటువ్యాధులు (ఆయుర్వేదము)—— ఒక రినొకరు కలిసికొని తిరుగుటచే ఒకరినుండి మరియొకరికి కలుగు వ్యాధులకు "అంటువ్యాధులు” అని లోకమున వ్యవహారము. వ్యాధికలవారితో కలిసిమెలిసి తిరుగుటచే మంచి వారి కా వ్యాధులు అంటుకొనును గనుక "అంటుడు వ్యాధులు" అని పిలువబడుచు ఆనాటనా నాట "డు" అను నక్షరము లోపించి "అంటుడు వ్యాధులు" అను పదము "అంటువ్యాధులు” గామాత్రమే వాడుకయందు నిలిచినది. ఈ అంటువ్యాధులకు సంస్కృతమున “సాంక్రామిక వ్యాధులు” అని వాడుక. ఇట్లు అంటు వ్యాధులుగా చెప్పబడినట్టియు, చెప్పత గినట్టి యు రోగములెట్టివి? అట్టివ్యాధు లంటుకొనుటకు గల కారణము లేమి? అనుటలో భారతీయ ఆరోగ్య తత్వ దర్శనమగు ఆయుర్వేదమున ప్రాధాన్యముగల శస్త్రచికిత్సా గ్రంథమందు రాజర్షియగు సుశ్రుకు డిట్లు వర్ణించెను :

ప్రసత్గా త్ర సంస్పర్శ
న్నిశ్వాసా తృహ భోజనాత్
సహ శయ్యాసనాచ్చా2. పి
వస్త్రమాల్యానులేపనాత్
కుష్ఠం జ్వర శ్చ శోష శ్చ
నేత్రాభిష్యంద ఏవ చ
ఔపసర్గికరోగా ళ్చ.
సంక్రామంతి నరా న్నరమ్.

మ. ని. అ 5 38

రోగ గ్రస్తులగువారితో అతిగా కలిసియుండుటచేతను, పదేపదే రోగుల శరీరమును ముట్టుకొనుచుండుట చేతను,రోగులతో కలిసి భుజియించుటచేతను, రోగులతో కూడి పండుకొనుట చేతను, రోగులకడ కూర్చుండుట చేతను, రోగులు కట్టుకొను బట్టలను, రోగులు ధరించిన పూవులను, రోగులు వాడి మిగిల్చిన చందనాది అనులేపనములను ఉపయోగించుటచేతను, వ్యాధిగ్రస్తులనుండి ఆరోగ్యవంతులగువారికి ఆవ్యాధులు సంభవించును. అట్లు కలుగునట్లుగా నిర్దేశింపబడిన వ్యాధు లివి :

1. కుష్ఠము, 2. జ్వరము, 8. క్షయ, 4. నేత్రరోగ స్త్రీ పురుషుల సంయోగమువలన కలుగు “బట్టంటు” “కొరుకు” మొదలగు జననేంద్రియ సంబంధము లైన రోగములు.

ఇది అంటువ్యాధులకును, అంటువ్యాధులు కలుగుటకును గల సామాన్య వివరణము. ఏ విషయము నైనను ఆయుర్వేద శాస్త్రమునందు మొదలు సంగ్రహముగా చెప్పి తిరిగి దానిని మిక్కిలి విపులముగను, తేలికగను, నిస్సంశయముగను, అర్థమగునట్లు చెప్పుట సంప్రదాయమై యున్నది. ఇందువలన రోగములను నిర్ణయించుట యందును, చికిత్స చేయుటయందును సులభత యేర్పడుట జరుగును.

ఇట్లొకరినుండి మరియొకరికి సంక్రమించునట్లు చెప్పబడిన యీ యైదు విధములగు వ్యాధులును, ఈ వ్యాధులు కలుగుటకు కారణములుగా చెప్పబడిన తొమ్మిది విధములగు మార్గములును, సవిమర్శనముగ, సూక్ష్మాతి సూక్ష్మములుగా విభజింపబడి రోగములును, కారణములును, వేరువేర రెండువందలతొమ్మిది మార్గములు కలవిగ పరికల్పన చేయబడినవి. ఈ పరికల్పనకంతకును వాత పిత్త కఫములను త్రిదోషములును, త్వగ్రక్తమాంసాదు లను, సప్తధాతువులును ఆధారముగ చేయబడును. సప్తధాతువులలో అంశాంశకల్పనయందు రసమును విడిచి చర్మమును గ్రహింపవలసి యుండుట శాస్త్ర నిర్దేశ్యము. ఇవిగాక యీ విభజనయందు చేర్పతగిన మరికొన్ని అంటు వ్యాధులు “జనపదోర్ధ్వంసక ములు” అను పేర నాలుగు తెగలుగను, పదుమూడు విభాగములుగను బ్రహ్మర్షి యగు చరకుని మతమును అనుసరించి ప్రత్యేక ముగు కలవు. (మనుష్యులు నివసించుపల్లెలు, పట్టణములు పాడగునట్లు చేయు రోగము లకు జనపదోద్ధ్వంసక ములని వాడుక.) చరకుని మతమున ప్రత్యేకింపబడిన నాలుగు విధములగు ఈ వ్యాధులు కలుగుటకును గలకారణము గాలియు, నీరును దూషితములగుట. సకల జీవ జీవం జీవనము లగు జలవాయువులు దూషితము లగుటకు ప్రజలయందు అధర్మవర్తనమును, ప్రభుత్వస్థాయియందుగల ప్రజారోగ్యశాఖాధికారుల అధి కార దుర్వినియోగవర్తనమును కారణములు. ఈ జన పదోర్ధ్వంసక ములగు పదుమూడురోగములను పైసంఖ్య