పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/461

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టోత్తర శతతాళములు

" విధమున చెప్పెను. ఈతడు చచ్చత్పుటాదులను ప్రథమ సప్తకములుగ జెప్పి యిరువదియేడు శుద్ధ తాళములను, 74 దేశీయ తాళములను పేర్కొనెను ఈతని ధ్రువలయ ధ్రువ, మఠ్య తాళములు నేటి ధ్రువతాళాదులకు కారణముగ గన్పట్టును. వివిధ కంకాళములు, మఠ్యలు చతురశ్ర, తిశ్ర, మిశ్ర, ఖండవర్ణ తాళములు ఈతడు పేర్కొనుటచే ఆ కాలమున ఆంధ్రదేశమున ఈ తాళములు వ్యాప్తియం దుండినట్లు తెలియుచున్నది. మరియు సోమనాథుడు రూపక తాళమును చెప్పుట చేతను, శార్ణ దేవుడు ఈ రూపక తాళమును పేర్కొనకపోవుటచేతను ఔత్తరీయ సంగీత విధానమున నీ తాళము లేకుండినట్లు ఎంచనగును. ఆంధ్రప్రాంతమునకు చేరువనున్న ఉత్కళ దేశము నందు జయదేవుడు రూపక తాళమును తెలిసి అష్టపదు లందు వాడినాడు.

జయదేవుడు ఇరువదినాలుగు అష్టపదులలోను, యతి తాళమును పదకొండు గేయములందును, ఏక తాళమును ఆరింటియందును, రూపక తాళమును ఐదింటియందును, అష్టతాళమును, నిస్సారుక తాళమును, ఒక్కొక్క గేయము నందును చేర్చినాడు, అష్టతాళమును అడ్డ తాళములుగ నెంచ నగును. ఈతని నిస్సారుక తాళము పది మాత్రలు కలదిగను, యతితాళము 1100 ఇట్లు 12 మాత్రలు కలదిగను ఎంచబడును. ఇటీవల కుంభరాణ అనునతడు కొన్ని గేయములందు ప్రతితాళమును చేర్చి అష్టపదులకు వ్యాఖ్యానము రచించెను. ప్రతితాళము శార్ణదేవుడు చెప్పినట్లు 1100 ఇట్టి అంగములతో నుంటచే నిది మన అటతాళమునకు తుల్యమగుచున్నది. ప్రతి అను తాళము ఆ కాలమున ప్రాధాన్యమును వహించినట్లు కుంభరాణ తెలిపినాడు.

కోహలుని తాళ లక్షణము, "తాళ ప్రకరణము” "తాళకళావిలాసము" "తాళదీపిక" మున్నగు గ్రంథము లందు చెప్పబడిన సమకంకాళ, విషమకంకాళ ఖండ కంకాళ, పరాక్రమ, చలమంఠిక, సగుణమంఠిక, వక్ర,గరుడ, కుంభ, భరణమంఠిక తాళములను శార్గదేవుడు చెప్పలేదు. వీటిని కొన్ని సోమనాథుడు చెప్పెను. వక్ర, గరుడ, కుంభ, ప్రభృతి తాళములు అంత వ్యా ప్తినొంది యుండలేదు.


రాగములవలె తాళము లన్నియు ఏకాలమం దయినను వ్యాప్తియం దున్నట్లు ఎంచవీలులేదు. కొన్ని కల్పితములుగ నుండి విజ్ఞానవంతులగు నేర్పరులకుమాత్రమే సువిదితము లగుచున్నవి. అందుచే అట్టి వాటిని అసాధ్యములుగను, అవేద్యములుగను చెప్పుటకు వీలు లేదు. అష్టోత్తర శతతాళము లిట్టివే. ఇవన్నియును ఏకాలమందయి,నను విశేష వ్యాప్తిగలవానిగ నెంచ నేరము. కొన్ని ఆది, మఠ్య, ఝంప, యతి, ఏక, ప్రతి, నిస్సారుక, రూపక, అడ్డాది తాళములు బహుళ వ్యాప్తినొందియున్నవి. ఇట్లే ఆధునిక సూళాదు లన్నియు బహుళ వ్యాప్తి నొందినవి కావు. ఆట, త్రిపుట మున్నగు తాళములు తెనుగు గేయములందు మిక్కిలి వాడుకలో నున్నవి. వీటిలో ఖండ, మిశ్ర, సంకీర్ణ జాతులతోగల తాళములు ప్రచారము అల్పముగ నున్నది.

క్రీ. శ. 15 వ శతాబ్దియందు కుంభరాణా అనునతడు (క్రీ. శ. 1433-1468) ఝంప, ఆది, ప్రతిమఠ్య, అడ్డ, చతుర్మాత్ర మఠ్య, పర్ణయతి, నవమాత్రమఠ్య, నిస్సారుక రూపక, ద్రుతమంఠిక, ప్రతి, ఏక, త్రిపుట, అను 13 తాళ ములను చెప్పెను. ఆ కాలమునాటి గోపీంద్రతిప్పభూపాలుడు రచించిన "తాళదీపిక" అను గ్రంథమందుకూడ ఈ విషయము కలదు. ఆ కాలమునుండి వెలువడిన గేయ వాఙ్మయ రీతులయందలి యక్షగానములు, కురవంజులు మున్నగుపాటలు ఆది, అడ్డ, తివడ, ఏక, మఠ్య, రూపక, ఝంప తాళములలో చెప్పబడినట్లు తెలియుచున్నది. క్రీ. శ. 16 వ శతాబ్దియందలి తాళ్లపాక వారి గేయము లందును రూపక, ఝంప, తివడ, పంచఘాత, మఠ్య, అట, ఏక, చావు, చేతాళము అనునవి గలవు. 17 వ శతాబ్దియందలి సుగ్రీవ విజయము మున్నగు యక్ష గానములందు అట, ఏక, రూపక, ఝంప, ఆది, తివడ తాళములు చెప్పబడినవి. కంకంటి పాపరాజుగారి యక్ష గానమున త్రిపుట తాళము ఎక్కువగా వాడబడెను. ఆది, ఝంప తాళములును కలవు. తంజావూరు రఘునాథరాయలు (క్రీ. శ. 1614 -1637) ఆది, ద్వితీయ,జయమంగళ, రంగ, శ్రీరంగ, రతి, హంసలీల, కంకాళ, ఖండ, కుడుక్క, టెంకిక, జయనందన, విజయము అను తాళములను పేర్కొనెను. ఇట్లు ముఖ్యములగు కొన్ని