పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/409

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అలంకారశాస్త్ర చరిత్ర మీమాంస (క్రీ. శ. 16 వ శతాబ్ది అంతము - 17 శ. ఆది); జగన్నాథుని రసగంగాధరము (క్రీ.శ. 1820 1680). అలంకార శాస్త్రమనగా కావ్యమును కావ్యాంగ ములను గూర్చి వివరించు శాస్త్రము. ఇండోయూరపి యను భాషలలో ఋగ్వేదము అత్యంత ప్రాచీన మైన ప్రథమ గ్రంథము. అది ప్రధానముగా దేవతలను గూర్చి చేయబడిన స్తోత్రాత్మక మైన మంత్రగ్రంథమైనప్పటికిని దానియంరు కాప్యలక్షణములు విశేషముగా కాన్పించు చున్నవి. అందు ఉషస్సును వర్ణించు ఋక్కులు సుందర కావ్యఖండములు - కొన్ని ఋక్కులలో ఉపమా-వ్యతిరేక అతిశయో క్తి - శ్లేష - ఉత్ప్రేక్షాద్యలంకారములు మిగులు మనోహరములుగా ప్రయోగింపబడినవి. తరువాతి లౌకిక కావ్యములలో వలెనే వేదవాఙ్మయములో కూడ ప్రకృతి మున్నగువాటి వర్ణనము మనోహరముగ చేయబడినది. నాటక బీజములు కూడ వై దిక సాహిత్యమునందు కన్పట్టు చున్నవి. నాటక నిర్మాణము కొరకు ఋగ్వేదమునుండి పాఠమును, సామ వేదమునుండి గీతములును, యజస్సులు నుండి అభినయమును, అథర్వవేదమునుండి రసములును గ్రహింపబడినవని భరతుడు నాట్యశాస్త్రములో చెప్పెను. వేద కాలము తరువాత క్రీస్తునకు అనేక శతాబ్దులకు పూర్వమే ఉత్కృష్టమైన కావ్యనిర్మాణము సంస్కృత వాఙ్మయములో చేయబడినది. రామాయణ మహాభారత ములలో అత్యున్నతమైన కావ్యరచన సాగెను. అలంకార శాస్త్రములో ఉద్గ్రంథములైన ధ్వన్యాలోక, కావ్య ప్రకాశములలో మహాభారతమునుండి గృధ్రగోమాయు సంవాదాదులైన అనేక విషయములు ఉదహరింపబడినవి, రామాయణమునుండికూడ కొన్ని శ్లోకములు ఈగ్రంథ ములలో తీసుకొనబడినవి.

అలంకార శాస్త్రారంభము క్రీ.శ. రెండవ శతాబ్ది నాటివియు, ఆ తరువాతివియు నగు శాసనములను బట్టి అంతకు పూర్వమే అలంకార శాస్త్రరచనము ఆరంభింప బడినట్లు తెలియుచున్నది. క్రీ.శ. 150వ సంవత్సరపు రుద్రదాముని జునాగఢ్ శాసనమునుబట్టి అప్పటికే కావ్యము గద్య పద్యాత్మకమయి యుండెననియు “స్ఫుట-మధుర - కాంత-ఉదార" అను కావ్యగుణ ములు తెలిసియుండె ననియు స్పష్టమగుచున్నది. ఈ యంశమునే అంతకు కొంచెము పూర్వపుదైన “సిరిపులుమాయి” నాసిక శాస నముకూడ “తెల్పుచున్నది. అది ప్రాకృతభాషలో నున్నది. ఈ రెండు శాసనములేగాక క్రీ. శ. మొదటి రెండుళ తాబ్దు లలోని సంస్కృత ప్రాకృత శాసనములు ఈ విషయమును ధ్రువపరుచుచున్నవి. ఇంతియేగాక ఈ శాసనములలో 'గంధర్వవేద-నట-గీత-వాదిత్ర- ఉత్సవసమాజ" ఇత్యాది శబ్దములు వాడబడినవి. వీటిలో శబ్దాలంకారములు, దీర్ఘ సమాసములు కలవు. పూర్వపు గద్యప్రబంధములు ఈ శైలిలోనే వ్రాయబడుచుండెడివి. వీటినిబట్టి చూచినచో ప్రాచీన కాలమునందే అలంకార శాస్త్రము ఎంతో అభివృద్ధి చెందినట్లు కనిపించుచున్నది. 348 వేద నిరుక్తమును వ్రాసిన యాస్కముని, ఋగ్వేదము లోని “ఇదమీన, ఇదంయథా, అగ్నిర్న, తద్వత్" మొదలయిన ఉపమాలంకారద్యోతకములగు పదములను ఉదాహరించెను. ఇవియేకాక అనేక ఉపమలు వాఙ్మయములో ఉన్నట్లు తెలుపు చు యాస్కముని ఉపమా భేద ములనుకూడ వివరించెను. పాణిని వ్యాకరణ సూత్రములకు పూర్వమే ఉపమాలంకారమునకు అంగము లైన ఉపమాన, ఉపమేయ, సామాన్యధర్మ, ఉపమా వాచకములు తెలిసియుండినట్లు "ఉపమితం వ్యాఘ్రాదిభిః సామాన్యా 2 ప్రయోగే; 'ఉపమానాని సామాన్య వచనైః' " ఇత్యాది సూత్రములవలన మనకు స్పష్టమగు చున్నది. వ్యాసుని బ్రహ్మ సూత్రములలో ఉపమా రూప కాలంకారములు పేర్కొనబడినవి. క్రీ. శ. ఒకటి రెండు శతాబ్దులలో రచింపబడిన అశ్వఘోషుని బుద్ధ చరితము, సౌందరనందము అను కావ్యముల వలన పూర్వమే కొన్ని అలంకారములు ప్రచారములో నుండినట్లు తేటబడు చున్నది. భరతుని నాట్యశాస్త్రములో రససిద్ధాంతము, నాటక లక్షణము, నాలుగు అలంకారములు, గుణములు వివరింపబడినవి. బాణుడు తనకాదంబరిలో అక్షరచ్యుతక, మాతాచ్యుతక, బిందుమతి మొదలగు ప్రహేళికలను, శ్లేష - ఉత్ప్రేక్ష - ఉపమ - దీపకము ఇత్యాద్యలం కార ములను గుర్తించెను. పైన పేర్కొనబడిన అంశములను బట్టి క్రీ.శ. 8వ శతాబ్దివరకే లౌకిక సంస్కృత వాఙ్మయ ములో అలంకారములు, కావ్యభేదములు ఏర్పడి ఉండి నట్లు మనకు తెలియుచున్నది.