పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/408

ఈ పుటను అచ్చుదిద్దలేదు

కలలో కారణములుండవు. అదిసుఖస్వప్నమైతే చాలును. కావుననే వక్రతుండము నోటినుండి తీగెలు బారినవి. మకరములు మకరతోరణాలైనవి. హంసలకు తోకలు పెరిగినవి. పొన్న వాహనము సున్నయైనది. హనుమంతు నికి పట్టెనానూలు, నగిషీగల బెట్టిలాగు, ఉంగరాలు, శంఖచక్రాది చిహ్నములు పెరిగినవి. ఇట్టి అలంక రణము శిల్పకారుని చిత్తము ననుసరించియే చేయబడును. రంగులు - ఛాయలు (Colours & Tones) అలంకరణములో భావ ప్రాధాన్యములేనపుడు రంగుల వాడుకను గురించి శాసనాలు చేయుటకు వీలు లేదు. వర్ణలేపనము చిత్ర కారుని స్వేచ్ఛపై నాధారపడి యుండును. భావమే ప్రధానమైనచో రంగులు దాని ననుసరించి వాడనగును. ఛాయ : ప్రతివర్ణము కనీసము మూడువిధములుగా నుండును. (1) గాఢచ్ఛాయ (నలుపు) (2) మధ్యచ్ఛాయ (8) మందచ్ఛాయ (శ్వేతమిశ్రణము). మనము ఒకే రంగుమీద ఆరంగునే వేరు వేరు చాయ లలో వేసినచో నది దృగ్గోచరమగును. మిశ్రవర్ణములు : ఒక వర్ణములో మరొక వర్ణము కలిసినచో మిశ్రమ వర్ణ మనబడును. మిశ్రవర్ణములు చూచుటకు ప్రాథమిక వర్ణముల (Primary colours) కంటే తక్కువ దీప్తికలిగి యుండును. కాని ఉ త్తమ కళాఖండములన్నియు ఇట్టి మిశ్రవర్ణ సమన్వితములే అనవచ్చును. అలంకరణ చిత్రమునందలి వస్తువులను సహజ వర్ణరూపయుతములుగా చిత్రింపవలయునన్న నియమము లేదు. 5o. 7. అలంకారశాస్త్ర చరిత్ర:- రాజ శేఖరుడు తన కావ్యమీమాంసలో అలంకార శాస్త్రమును తొలుత శివుడు బ్రహ్మ కొసగెననియు, బ్రహ్మనుండి అది ఇతరులకు లభించుచు వచ్చెననియు చెప్పెను. సంస్కృతాలంకార శాస్త్రమునకు భరతముని వ్రాసిన నాట్యశాస్త్రమే పురాతనమైన మూలగ్రంథమని భావింపబడుచున్నది. నాట్యశాస్త్రమునందలి మొదటి ఐదు అధ్యాయములు క్రీ. శ. 5వ శతాబ్దికి పూర్వము రచింపబడినట్లు తెలియు చున్నది. సంస్కృతమున అలంకార శాస్త్రమును గూర్చి 347 అలంకారశాస్త్ర చరిత్ర వ్రాసినపండిత ప్రకాండులు పెక్కురుకలరు. వ్రాయబడిన ఉద్గ్రంధములును పెక్కులు కలవు. అవి యెవ్వియన-భామ హుని కావ్యాలంకారము (క్రీ. శ. 6వ శతా వ తాబ్దికి పూర్వము) ; దండి కా వ్యాదర్శము (క్రీ. శ. 6వ శతాబ్ది) ; ఉద్భటుని అలంకార సారసంగ్రహము. (క్రీ. శ. 8 వ శతాబ్ది) : వామనుని కావ్యాలంకార సూత్రవృత్తి (క్రీ. శ. 8వ శతాబ్ది); రుద్రటుని కావ్యాలం కారము (క్రీ.శ.825-875); ఆనందవర్ధనుని ధ్వన్యాలోకము (క్రీ.శ.840.870); రాజశేఖరుని కావ్య మీమాంస (క్రీ. శ. 870-950); ముకులభట్టు అభిధావృత్తిమాతృక (క్రీ. శ. 9వ శతాబ్ది - అంత్యభాగము); భట్టతౌతుని కావ్య కౌతుకము (క్రీ. శ. 950-980); భట్టనాయకుని హృదయదర్పణము. (క్రీ. శ. 900-1000); కుంతకుని వక్రోక్తి జీవితము (క్రీ. శ. 925-1025); ధనంజయుని దశరూపకము, (క్రీ. శ. 10వ శతాబ్ది మధ్యభాగము) ; రాజానకమహిమ భట్టువ్యక్తి వివేకము. (క్రీ.శ. 1020- 1080); భోజుని సరస్వతీ కంఠాభరణము, శృంగార ప్రకాశము. (క్రీ. శ. 1080-1050); క్షేమేంద్రుని ఔచిత్య విచార చర్చ, కవికంఠాభరణము. (క్రీ.శ. 1000-1088); మమ్మటుని కావ్యప్రకాశము (క్రీ. శ. 1050-1150 శతాబ్ది ఉ.భా.); రుయ్యకుని అలంకార సర్వస్వము (క్రీ. శ. 1150 పెదవ); వాగ్భటుని వాగ్భటా లంకారము (క్రీ. శ. 1150 తరువాత); హేమ చంద్రుని కావ్యానుశాసనము. (క్రీ.శ. 1108-1150 కి తరువాత - 1172); జయదేవుని చంద్రాలోక ము (క్రీ. శ. 1200-1250); విద్యాధరుని ఏకావళి (క్రీ. శ. 1285-1826); విద్యానాథుని ప్రతాపరుద్ర యశో భూషణము (క్రీ. శ. 1298-1825); వాగ్భటుని కావ్యానుశాసనము (క్రీ. శ. 14 వ శతాబ్ది); విశ్వనా థుని సాహిత్య దర్పణము, (క్రీ. శ. 14 వ శతాబ్ది); భానుదత్తుని రసమంజరి, రసతరంగిణి (క్రీ.శ. 18 వ శతాబ్ది - అంతమున, 14 వ. శ. ఆదియందు); రూప గోస్వామి భక్తిరసామృత సింధువు, ఉజ్జ్వల నీలమణి (క్రీ. శ. 1470-1664) ; కేశవమిత్రుని అలంకార శేఖరము (క్రీ. శ. 18 వ శతాబ్ది ఉత్తరార్ధము); అప్పయ దీక్షితుని వృత్తివార్తికము, కువలయానందము, చిత్ర