పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/407

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అలంకరణ కళ ప్రసాధక రూపము (Decorative Form) : ఏ రూప మైనను ప్రధమదర్శనములో సంక్షిప్తముగ గోచరించును. అనగా గుండ్రముగానో, త్రిభుజముగానో, చతుష్కోణము గానో ఫలకములుగానో కనబడును. ఇదియే సంక్షిప్త రూపము, కాని దీని నే తదేకదీక్షతో తిలకించినదో అపుడు అనేకవివరములు గోచరించును. దానితోబాటు అనేక వంకలును, వికృతులును కనబడును. ఒక కమలమును చూడుడు. చూచినచో దాని సంక్షిప్త రూపము 'గుండ్ర ముగా కాన్పించును. కాని ప్రకృతిలోని విరోధళ క్తుల వలన దాని దళములు మాడియో, ఊడియో, క్రమరహి తముగా కనబడును. చిత్రకారుడు ఒకానొక వస్తువు యొక్క ఆకృతి యందలి వికారమును తొలగించుటకై, ఒక సులభపద్ధతి నాశ్రయించును. దానికై మూల రేఖలను, రూపములను బోలు ఆకృతులను మలచును. దీనిచే సంగ్రహరూపములు ఓ యగును. కమలమును చిత్రించుటకు దానిరూపములు బోలిన వలయమును చిత్రకారుడు వ్రాసియందు రేకులు క్రమబంధమును చిత్రించును. దీనిచే శ్రమలేకయే దాని రూపము సులభగ్రాహ్యమగును. ఇదియే ప్రసాధక రూప మనబడును. భూమికా బంధము : చిత్రించవలసిన భూమిని నిర్దేశించిన తర్వాత దానిలో చిన్నవియు పెద్దవియునైన అనేక అలంకార ఖండికలను కూర్చుటకు అవలంబింపవలసిన పద్ధతి బంధ మనబడును. 1. అన్నిటికంటె ప్రధానరూపము మొదట సాధారణ ముగా మధ్య భాగములోనైనను దానికి సమీపమునందై నను చిత్రింపబడును. పిమ్మట అంతకంటే తక్కువ ప్రాధా న్యముగల రూపము చిత్రించబడును. తుదియందు చుక్కలు మొదలగు అల్పాకృతులు అవసరమైనచో ఖాళీ స్థలము లలో నింపబడును. 2. అలంకరణ చిత్రములో ప్రమాణములు (Propor- tions) పరిగణనీయములు కావు. 8. చిత్రితమైన భాగము ఎక్కువ స్థలము ను ఆక్రమించి యుండవలయును. (కొన్ని చోట్ల చిత్రిత భాగము ఖాళీ భాగముతో సమానముగా వచ్చును.) నుండ 346 G పటము 25. 4. రంగులు, రేఖలు, ఛాయలవ్యత్యాసములు, పర స్పరముగా సుసంగతిలో నుండవలయును. 5. చిత్రములో స్థాయి ఉండవలయును. పరి ప్రేక్ష ణము (perspective) సాధారణముగా అలం కార చిత్రములలో తక్కువ, అలంకారఖండములు ఒక దాని పై నొకటి చేరి కలిసిపోకుండుటకై ఖండిక లమధ్య భాగమున కొంత ఎడముంచవలయును. ఒప్పు పటము 26, 'తప్పు 6. అలంకరణ చిత్రములో చేయబడు వస్తువులను యథాతథముగ చిత్రించక అతిశయ రూపములు (Exaggerated forms) గా మార్చవలయును. 7. చిత్రకారుడు చిత్రకళాసూత్రములను పాటించు టతోబాటు స్వప్రతిభను ప్రయోజనానుసారముగా ఉప యోగించవలయును. అలంకరణములో సం దేశ ముకన్న సౌందర్యమే ప్రధానమైనది. కావున వస్తు ప్రమాణముల నెట్లు మార్చి నను చిక్కులేదు. అవి క్రమగతములైన చాలును. వస్తు ప్రమాణములందును, రంగులయందును, భావమందును కారణ మీమాంస తగదు. ఇది చిత్రకారుడు కన్న 'కల',