పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/405

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అలంకరణ కళ చిత్రింపబడుటచే ఆశ్చర్య మొనగూర్చును. ఇటులే భువనే శ్వర శిల్పములో నలుగురు వీరుల బంధములో రెండే తల లున్నవి. ఎటు త్రిప్పి చూచినను దేనికదే వేరుగా కనిపిం చును. దేవాలయములపై కోణములలో అనగా రెండు గోడలు కలియుచోట రెండుకోతులు లేక సింహములుండి దేవా ఒ కేతల మధ్యభాగములో చెక్కబడును. రామప్ప లయ మంటప స్తంభముపై చెక్కబడిన భజనమండలిలో మధ్యభాగమున నాట్యము చేయుచున్న వ్యక్తి యొక్క పాదములు కుడి ఎడమల నున్న వారిలో నొక్కొక్కరి పాదముతో కలిసి రెండేపాదములుగా మలచబడినవి (ప. 16). కవి ఒకే పదమునకు సందర్భానుసారముగ రెండు మూడర్థములను గల్పించునట్లు చిత్రమునందును, శిల్పమునందును ఒకే రూపములో అనేక రూపములు కల్పనచేయుట రూప శ్లేష అనబడును. పటము 18. రామప్ప దేవాలయ శిల్పము బంధములు (compositions) : మూల రేఖలచే తయా రైనా అలంకృతు లన్నియు రెండు తరగతులలో విభజింప బడును. వాటిలో మొదటి తరగతివి దృష్టికి విశ్రాంతి నిచ్చుచు, నిశ్చలమై స్థాయి గలిగియుండును. ఇవి 'స్థావర ములు' (static arrangement) అనబడును. రెండవ తరగ తివి కదలిక గలిగి విస్తరించి పెరుగుచుండునవి. ఇవి జంగమము అనబడును. (Dynamic arrangement)). రెండవతరగతి జంగమ బంధములు, అంచులు, తోరణ ములు మొదలగువానికి ఉపయోగించునవి. రేఖలన్నియు ఒకచోటనుండి మరొక చోటికి పారుటచే మన దృష్టిని తమతో లాగుకొనిపోవును. వీటిలో చలనము ప్రధా నాంళము. సామాన్యముగా కదలిక అనునది ఎడమనుండి కుడి దిక్కునకు చూపబడును. ఆవిధముగానే భావింపబడును . ఉపరేఖలు ముఖ్య రేఖను ప్రవాహపు దిక్కునుండియే కూడును. కలియునపుడు పటము 19. స్థావర బంధములు స్థావరములన్నియు విశ్రాంతి భావమును సూచిం చును. రేఖలన్నియు ఒకదానికొకటి తులదూగుచుండి స్థలమును సమానముగా నాక్రమించును. 844 పటము 20. సుసంగతి (Harmony) : ఆకులు, పూవులు, కొమ్మలు ఒక క్రమములో అభివృద్ధిని, క్షయమును కలిగియుండుట గమనింపదగినది. ఒక పత్రమునకును ప్రక్కనున్న మరొక పత్రమునకును రూప ము లో అత్యంత స్వల్పభేద