పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/404

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇట్టి అలంకరణము గచ్చు, లోహము, చర్మము, కడవలు, కప్పులు, కఱ్ఱలు మున్నగువాటిపై కాన వచ్చును. పటము 17 పై చిత్రములలో అలంకరణము అడ్డదిడ్డముగా నుండక ఒకేచాలు ననుసరించి కచ్చితమై క్రమముగానున్నది. కొన్ని అలంకరణములలో రేఖాగణితముననుసరించిన బంధములు కాననగును. కాని యందలి పునరావర్తన తంత్రము సుళువుగా నుండక చిత్రఖండిక ఒకటిగా నుండక, అనేకాకృతులుగల గుచ్ఛములను సమప్రమాణ మును ఛాయను మాత్రము గలిగియుండును. గుచ్ఛ సమూహములు వంకరటింకరగా (zig-zag) పునరాగ మించుచు పోటీగా (Reverse) ప్రత్యక్షమగును. ప్రయోజనాలంకరణము, (Functional Design.) : నభోభాగాన పారెడు పదుల తోరణమును గమనించినచో ఒకదృశ్య కవిత్వము గోచరించును. అది బాణాగ్రాకృతిని పోలు చాలు గలిగియుండును. ఇట్టి ఆకృతిలో సౌందర్య మును, ప్రయోజనమును రెండును రెండును కలిసియున్నవి. బలిష్ఠమైన నీటిజాతొకటి ముందుగా గాలిని చీల్చుకొని పోవుచుండ, దాని వెన్నంటిపోవు బాతులు మొదటిదానంత 343 అలంకరణ కళ శ్రమకు గురికావలసిన అవసరము ఉండదు. వీటి వ్యూహ బంధములోనున్న అలంకారము 'ప్రయోజనాలంకరణ' మనబడును. అనగా అలంకారము, ప్రయోజనము ఏక వస్తువునందు మిళితమైనపుడు అది ప్రయోజనాలంకరణ మగును. వ్యూహము సరియైనచో దాని పరిణామము గూడ సరియగును. ప్రయోజనాలంకరణము ఒకవస్తువు యొక్క ప్రమాణముతోను, బరువుతోను, గట్టితనము తోను, దాని రంగుతోను సంబంధము కలిగియుండును. కెమెరాను చేతులలో" తేలికగా నుండునట్లు నిర్మించుట ప్రయోజనదాయకము. దీనియొక్క ఆకృతిని కుంచిం చుట, అవసరమునుబట్టి పెంచుట, బరువుతక్కు వగా నుండుట, మలచి చంకలో తగిలించినను సుందరముగా నుండుట, అనునవి దీని ప్రయోజనములు. అట్టి ప్రయో జనములలో దాని నల్లనిరంగు. దాని బిరుసుదనము (Rough texture) కూడ పేర్కొనదగినవి. పులులు, పక్షులు, లేళ్ళు, సీతాకోక చిలుకలు మున్నగు వాటి యందున్న మచ్చలు, వాటిని పరిసరములనుండి కప్పి పుచ్చుటకు ఉపయోగించుచున్నవి. యుద్ధ విమాన ములపై, ఆయుధములపై, సైనికుల దుస్తులపై మేఘ చ్ఛాయలను, చెట్లరంగులను, చిత్రించుటవలన శత్రువుల బారినుండి ఆత్మ రక్షణము చేకూరుచున్నది. ఇటులే, పెన్సలు, పలకలువలకలుగా నున్నచో నది పొరల కుండును. ముంగిటిలో వేసిన పిండి ముగ్గులు అందమును కూర్చుటయేగాక, చీమలకు ఆహారముగా నుపకరించును. నావకు ముందు వెనుకల సన్నముగా చెక్కుటచే నది నీటిని కోయగలుగును. వివిధ మతస్థులు ధరించు ఊర్ధ్వ పుండ్రములు, విభూతి, బెండకాయబొట్లు, మొదలగునవి వారివారి మతచిహ్నము లగుటయేగాక ములుగ కూడ ఎన్నతగియున్నవి. ప్రయోజనము ననుస రించి మలచిన పనిముట్లన్నియు వాటియం దిమిడియున్న లయగతిరేఖల చేతను, రంగులచేతను స్వతఃసిద్ధముగా అలంకృతములై యుండి కన్నులకు విందొన గూర్చును. శ్లేషాలంకరణము : భారతీయ శిల్పములలోను, చిత్ర ములలోను అచ్చటచ్చట ఈ వింత చిత్రములు కానవచ్చును. అజంతాలో నాలుగు జింకల కొకేతల చిత్రింపబడినది. ఇది చిత్రకారుని అధికశ్రమను తగ్గించి, సందర్భపూర్వకముగా ల