పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/402

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈ వలయావస్థ యొక్క కూర్పులచేత అనేకరకాలై న పుష్పాకృతులు సృష్టియగును. వీటిలోని రేఖలు గానుగ గతిచే ప్రవహించి కట్టుబడి, సంపూర్ణ దృశ్యములను నిర్దేశించును. అనురూపత : అలంకరణ చిత్రములలో లేక ప్రకృతి లోని దృశ్య పదార్థముల యందును రెండు భాగములు సమమై, ఒకదానికి నొకటి పోటీగా స్ధాయి (Balance) గలిగి ప్రతిబింబించినచో అనురూప (symmetrical) చిత్ర ములు, లేక దృశ్యములు అనబడును. ఇట్టి చిత్రములోని ప్రతి సూక్ష్మ వివరము గూడ ఎదుటి భాగములో ప్రతిబిం బించునట్లుండును. ఈ రెండు ప్రత్యర్థిభాగముల యొక్క కలయిక చే ఒ కే చిత్రమగును. అది చూచుటకు అందము గూర్చును. పిటు 14. చక్కగా పరిశీలించినచో ప్రకృతిలోని అనేకపదార్థ ములయందు అనురూపత వ్యక్తము కాగలదు. పోకలు, పండ్లు, ఉల్లిగడ్డలు, కఱ్ఱ మొదలగు వాటిని కోసి రెండు భాగముల నట్లే యుంచి చూచినచో, రెండు భాగముల లోని వివరములు కూడ ఒకదాని కొకటి ప్రతిరూపముగా నుండును. సమాన ప్రతిభ గలిగిన ఇద్దరు గాయకుల పోటీ గానమును, సమః క్తి గలిగిన ఇద్దరు మల్లుల కు స్త్రీని వీక్షించు వారికి అవి చెవులకు కన్నులకు విందొనగూర్చునట్లు అను రూపచిత్రములును సౌందర్యమును ఈచిత్రములలో సంపూర్ణమైన'స్థాయి' (Balance) ప్రకటిత మగును. వీటిలోని రేఖలన్నియు దృష్టిని తమతో బాటు అటు నిటు త్రిప్పి చివరకు మధ్యభాగమువరకు దెచ్చి వదలివేయును. దీనిచే దృష్టికి 'స్థైర్యము' ఏర్పడును. هب అందించును. స్థాయి (Balance): అనురూప చిత్రములలోని రెండు భాగములలో సంపూర్ణ స్థాయి యుండును. కాని సరి సమానము కాని భాగములలో స్థాయి యుండినచో అది ఆశ్చర్యమును కల్గించును. బాట్లు చిన్న వే గాని భారము 341 అలంకరణ కళ సమానముగా నుండుటలేదా? సమాన స్థాయిని నిర్ణయిం చుటకు కొంత ప్రయత్నము అవసరము. చిత్రములలోసు, అలంకరణ చిత్రములలోను కొలది స్థలమును ఆక్రమించిన ఆకృతి, అధిక ప్రమాణము గలిగిన ఆకృతికి, లేక స్థలము నకు, సమతూనికగా నుండును. కాని చిన్న ఆకృతికి అధిక ప్రాముఖ్య ముండుట అవసరమైయుండును. ఒక స్తంభపు నీడ దాని కన్న పెద్దగా నున్నను, దాని నీడతో కలిసి దృష్టికి స్థాయిని ఒనగూర్చును. చూచు వాని దృష్టి స్తంభము పై వే లగ్నమగుచుండును. దీనికి కారణము స్తంభముపై నున్న వెలుతురు ఛాయలు చుట్టుప్రక్కల ప్రదేశములలో కంటే ప్రగాఢమైయుండును. ఇటులనే తామర పుష్పము దాని చుట్టు వ్యాపించిన విశాల పత్ర ముల పరిసరములలో ప్రధానమై ఆకర్షణీయముగా వెలుగొందును. దీనికి కారణము ఛాయల వ్యత్యాసమే కాక వర్ణ వ్యత్యాసము కూడ నై యుండుట. సాలెపురుగు నేతలోని నడిమిభాగములోని తంతు రేఖలు అధికముగా నుండుటచే వివరములు అధికమగును. దీనిచే ఆకర్షణ అధికమై ఇతర విశాల భాగములతో విశేషించి తులతూగుచుండును. రేఖలు ఒకచోటు నుండి మరొక చోటికి ప్రవహించునపుడు ఒక ప్రత్యేక దిశను సూచించును. అనేక రేఖలు ఒకేబిందువు వైపు నుండి పారుచున్నను, అనేక దిశలనుండి బిందువు వైపు ప్రసరిం చినను, ఆ దిశకు ప్రత్యేక ఆకర్షణము ప్రాప్తించును. ఇట్టి రేఖల ప్రయోజనము అలంకార చిత్రములలోనే గాక, సమస్త చిత్రములలో గూడ పెక్కు లుండును. రెండు అసమానభాగములు సమానమగుటకు కారణము ఆ రెండు కూడ సమానాధిక్యమును కలిగియుండుటయే. - పరివ్యాప్త అలంకరణము (All over Design): అడ వులలోను, ఊరి బయళ్ళలోను, చేలలోను, తోటలలోను పూలు విరగబడి పూయును. ఇవన్నియు స్థలము నాక్ర మించుచు వ్యాపించుచుండును. వీటి కూర్పునందు క్రమ బద్దత కనబడుట దుస్తరము. కాని ఇవ్వన్నియు వ్యాపించి, కిలకిల నగి, గిలిగింతలు పెట్టును. ఇది పరివ్యాప్త - అలం కృతిలోని క్రమపద్ధతి. ఇటులే ఆకాశముపై తారలు, నేలపై రాలిన ఆకులు, పూలు, జముడుమీది ముండ్లు, కోమటి రాళ్ళు భిన్న వర్ణము అయిన భిన్న ఛాయా (tones)