పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/400

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అలంకరణ కళ వీటిని కలుపుటలో రెండుపద్ధతులు గమనింపదగి మున్నవి. 1. ఒక రేఖ మరొకదానిని కోయకూడదు. లేక ఒక రేఖ మరొక రేఖకు అసంగతముగా నుండక సుసంగత ముగా నుండవలయును. 2. ఒకే జాతిరేఖను అనేకసార్లు అంచులో నుపయో గించునపుడు సమానాంతరముగా (parallel) ను సమ దూరముగాను వేయవలెను. ఇవి సామాన్యసూత్రములు. $ ఉగ్గుపాలతోనే నేర్పిన విద్య. ఈ కళ సర్వసాధారణమై నేటికిని జీవించియున్నది. ఒక్క తరంగ రేఖను ఎన్ని విధాలుగా మలచవచ్చునో ఈ దిగువ నిరూపింపబడినది. పటము 2.

తోరణములు - Running Designs. ఈ మూల శేఖ లలో ఒక దానిని మరొకదానిచే జోడించినచో భిన్న భిన్న రూపము లేర్పడును. మూల రేఖలను కుదింపవచ్చును, సాగదీయవచ్చును. కుదింపబడిన రేఖలు mmmmmmmm 580088 wwwww సాగదీసిన రేఖలు 1 పటము 3. దిగువ నుదాహరింపబడిన బంధయు ననుసరించి గీచి నచో అనంతములయిన అలంకార ఖండములను సృష్టింప వీలగును. పటము 5. 'లయ' (Rhythm) : అలంకరణ కళను దృశ్యసంగీత 'మనవచ్చును. సంగీతమునకువలె స్వరము, రాగము, తాళము అలంకరణ చిత్రమునకుకూడ ఆవశ్యకములు. రేఖ యొక్కయు, స్థలము (Space) యొక్కయు, క్రమ విభాగమువలన లయ ఏర్పడును. రేఖ యొక్క సమ గతియు, క్రమగతియు లయ యనబడును. ఇది సంగీత ములో తాళమువంటిది. స్థల విభాగము, (1) మంద, మధ్య, త్వరితగతి రేఖ లచే ఇరుకుగాను, విశాలముగాను క్రిందివిధముగా చేయ వచ్చును. మొదట చుక్కలు సమదూరములో పెట్టి ఏదైన ఒక మూల రేఖచే కలిపినచో నీ క్రింది విధముగా నుండును. WA M టము 6. KANNAANNA పటము ఓ. ఆల్పన (ముగ్గులు): ఈ కళ నేరుగని ఆడుబిడ్డలు ఆంధ్రదేశములో లేరనవచ్చును. అక్షరము వ్రాయలేని ఆడువారికి అలంకరణము వెన్నతో బెట్టిన విద్య. మన దేశములో మూగ మగువలకుగూడ మ్రుగ్గులు వేయుట 339 பாப் పై తావున బిందువులు క్రకచరేఖలచే కలుపబడినవి. పై వానికి ఇతర మూల రేఖలచే క్రమపద్ధతిలో జోడిం చినచో అంచులోని అలంకరణము అధికతరమగును, రేఖా గతియందు మార్పుండియు సరిపోటీ క్రమముగానున్నది.