పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/399

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అలంకరణ కళ - గీలు, పట్టు తివాచీలు, నాటి దర్బారు వైభవాలు, రాజు దండములు, రాజ చిహ్నములు - ఇవన్నియు అలంకరణ ఫలితములే. వీటినిబట్టియే ప్రపంచమున గౌరవమేర్పడు చున్నది. వేయేల ? 30යි రూపాయిగా మారుట, కాగితము నోటుగా మారుట అలంకరణ కళాప్రభావమే. సభ్యత యనునది ఈ కళకు బుట్టిన బిడ్డయే. పై కళాః విషయ మంతయు మానవుని సృష్టియై యున్నది. కాని ఆకాశము, మబ్బులు, పర్వతాలు, పృథ్వి, అగ్ని, జలము, చెట్లు చేమలు మొదలగునవన్నియు బహ్మ సృష్టికి చెందినవి. ప్రకృతి యొక్క అనుకరణము మాన వుని సృష్టిలో గాంచెదము. సర్వస్వతంత్ర సృష్టి సర్వేశ్వ రునిదే. సర్వ స్వతంత్రమై, పరిపూర్ణమైన సర్వేశ్వరుని సృష్టిలోని నిరుపమాన సౌందర్యమును కళాకారుడు ఖండఖండములుగా చిత్రించుకొనుచున్నాడు. 'సత్యం' 'శివం' 'సుందరం' అనునట్టి ఆ పరతత్త్వ పరిణత దశను సౌందర్య స్వరూపముననే ఆరాధించుట గాంచగా, సౌందర్యము ఇహ పరములు రెంటికిని సాధన మని తెలియగలదు, సౌందర్యము ప్రతి వస్తువులోను అంతర్గత ముగ వెలుగుచున్న యొక తీపి. దానిని రేఖలచే వ్యక్త పరచి రంగులతో ఉజ్జ్వలపరచుటకు చేయు ప్రక్రియయే చిత్రకళ అనబడును. బ్రహ్మ సృష్టిలోని దృశ్యములను పరిశీలించినచో వాటి నిర్మాణములో నొక క్రమము, విన్యాసము, కని పించును. సృస్టియనునది పునరావృత్తికలిగి దేశ కాలమాన ములచే నొప్పుచున్నది. చిత్రకళలో అలంకరణము ఒక భాగము మాత్రమే అయియున్నది. కేవలాలంక రణము సౌందర్యమును మాత్రమే సృష్టించును. సందేశమునిచ్చు చిత్రములు వేరుగా నుండును. బుద్ధుడు బోధివృక్షము క్రింద జ్ఞానము నార్జించిన దృశ్యము సందేశ చిత్రము. ముగ్గులు, లతలు, ద్వారబంధములపైని నగిషీలన్నియు అలంకరణ చిత్రములు. ప్రకృతిలోని కూర్పు, క్రమము, మనకు ఆశ్చర్యమును, ఆహ్లాదమును కలిగించును. వీటిని మనము మన అవసర పూర్తీకై ఉపయోగించుకొనుటయేగాక ఇచ్ఛానుగుణ ముగ వాటిలో మార్పులు చేసినచో నవి ప్రయోజనా లంకారము లగును. సృష్టిలోని వస్తుజాల మంతయు నాలుగు మూలాకృతులలోని పరస్పర సమ్మేళనములలో కాంచవచ్చును. 1. వృత్తము, 2. చతుష్కోణాకృతి, 3. త్రిభుజా కృతి, 4. బపిలకోణాకృతి. ఎట్టి ఆకృతినయినను రేఖయే నిర్దేశము చేయును. కావున చిత్రకళ కంతటికిని మూలము రేఖయే. ఈ రేఖ ఏడువిధములుగ పరిణమించును. వీటిని 'మూల రేఖ' లందుము. ఇవి అలంకరణమునకు ప్రాయములు. బిజ ప్రథమ రేఖ స్తుడి (Spiral). ఇది సీటిలోను, నే పైనను, నత్తగుల్లల పైనను కానవచ్చును. రెండవది సున్న లేక వర్తులము. దీనిని సూర్యుని ఆకృతియందు లేక పలయములందు గనవచ్చును. మూడవది చంద్రవంక లేక అగసున్న. దీనిని విజయ నాటి చంద్రునియందును, ఇంద్ర ధనుస్సునందును జూచెదము. నాలుగవది ' కాటాకండి'. ఇది ఘంటలలోను, పొగ లోను, గాలమందును కానవచ్చును. ఐదవది 'తరంగ రేఖ' దీనిని అలలయందు లేక అరాధ కుంతలములయందు గాంచెదము. ఆరవది 'క్రకచరేఖ'. దీనిని రంసేపుపిండ్లు, కొండ కొనలు, పిడ్యుత్ రేఖలు మున్నగు వాటియందు గాంచె దము. 338 పడవది సాధారణమైన 'సూటిగీత'. (straight line) దీనిని బట్ట అంచులలోను, బల్లలందును, త్రాటియందును, దిక్చక్రము (Horizon) నందును చూడవచ్చును. @O ns~ పటము 1 ఈ మూలరేఖలు మనము నిత్యము దర్శించు వస్తువు లలో గోచరించును. ఈ రేఖలు అలంకరణకళకు ప్రధాన మయినవి. వీటియొక్క వివిధ సమ్మేళనముల చేతను, బంధములచేతను అనేక ఆకృతులు ఉత్పన్నమగును.