పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/398

ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంయోగమువలన జరుగును. ఈ సంయోగము అణువుల మధ్య సంఘర్షము ద్వారమున ఫలించును. కాని అణు వులమధ్య జరుగు ప్రతిసంఘర్షము సంయోగమునకు దారి తీయలేదని అర్హీనియస్ వాదము. మామూలు అణువులకన్న హెచ్చు శక్తిగల అణువుల మధ్య జరుగు సంఘర్షములే ప్రక్రియకు తోడ్పడును. అనగా సంఘర్ష మునకు పూర్వము కొంతళక్తి సంపాదించవలెను. ఇట్టి శక్తిని సంపాదించిన అణువులను ఉత్తేజిత అణువు లనియు ఈ శ క్తిని ఉత్తేజనళక్తి అనియు నందురు. సాధా రణ - ఉష్ణస్థితిలో ఈ ఉత్తేజితాణువుల సంఖ్య బహు స్వల్పము. కాని ఉష్ణోగ్రత పెరిగినచో వీటి సంఖ్య చాల త్వరగా పెరుగును. అనగా రసాయన ప్రక్రియ వేగము హెచ్చును. ఈ విధముగా ఉష్ణోగ్రతకు ప్రక్రియా వేగము నకుగల సంబంధము విశదీకరించుటేగాక, ఉత్తేజనశక్తిని కొలుచుటకు ఒక సమీకరణమును కనిపెట్టెను. ఈ సమీ కరణము రసాయనమార్పులు విధానమును అర్ధము చేసి కొనుటక రసాయనమార్పును పొందించుటకు కావలసిన ఉష్ణశక్తి కొలుచుటకుగూడ ఉపయోగపడు చున్నది. శక్తిశాస్త్రము (Thermodynamics) ద్వారా కూడ ఈ సమీకరణము రుజువు చేయబడినది. ఇదిగాక ఎన్నియో విషయములపై అర్హీనియసు జరిపిన పరిశోధనముల యొక్క ఫలితములు ఓస్వాల్డ్ సంపాదకత్వముక్రింద వెలువడిన పత్రిక "సైట్ ప్రిఫ్ట్" (Zeitschrift) లో ప్రచురింపబడెను. ఈ పరిశోధనముల ద్వారమున భౌతికరసాయన శాస్త్రజ్ఞుడుగా గొప్ప పేరు పొందుటేగాక, వందలకొలది విద్యార్థులకు భౌతిక రసాయనములో పరిశోధనలు జరుపుటకు ఇతడు ఉత్సా హము కలుగజేసెను. 1891 లో స్వీడనుకు తిరిగివచ్చెను కాని, అర్హీని యస్కు గౌరవముగల ఉద్యోగ మేదియు దొరకలేదు. అయినను స్వదేశాభిమానముగల అర్హీనియస్ పరదేశము లలో దొరకుచున్న ఉద్యోగములను కాలదన్ని స్టాక్ హోమ్ విశ్వవిద్యాలయ కళాశాలలో అతికష్టముమీద ఉపన్యాసకుని ఉద్యోగము సంపాదించుకొనెను. 1895 లో ప్రొఫెసర్ పదవి పొందెను. అప్పటినుండి అర్హీనియస్ జీవితము ఒడుదొడుకులు లేకుండ సాగినదని చెప్పవచ్చును. 43 337 అలంకరణ కళ 1903 లో నోబెల్ బహుమానము పొందెను. ఎన్నియో దేశములనుండి గౌరవము పడసెను. బ్రిటను నుంచి డేవీపతకము (శాస్త్రజ్ఞునకు దొరుకు గొప్ప గౌరవ చిహ్నము) లభించెను. అర్హీనియస్ను స్వీడనులోనే ఉంచుటకు ఆ దేశపు రాజు ఇతనిని నోబెల్ సంస్థలో భౌతిక రసాయనశాఖకు డైరక్టరుగా నియమించెను. ఈ లేబరేటరీలో తనకు నచ్చిన విషయములపై పరిశోధనములు సాగించుటకు అర్హీనియస్కు స్వాతంత్ర్య మియ్యబడెను. రసాయన మే గాక, వాతావరణ విషయములలోను (Meteorological), రోగ నివారక రసాయన (immuno chemistry) శాఖ లోను కూడ ముఖ్యమైన పరిశోధనములు ఇతడు జరి పెను. ఈ పదవిలో 1927వ సంవత్సరము వరకు పనిచేసి, అనారోగ్య కారణముచే పదవినుండి విరమించుకొ నెను, ఒక వారమురోజులు జబ్బుచేసిన తరువాత 1927 అక్టోబరు 2 వ తారీఖున ఇతడు మృతినొందెను. అర్హీనియస్ తన చివరిరోజులను శాస్త్రీయ విజ్ఞాన మును జనసామాన్యమునకు అందచేయు నుద్యమములో గడిను వివిధ దేశములలో జరుగు విజ్ఞాన వేత్తల సమావేములకు హాజరై అక్కడి శాస్త్రజ్ఞులతో ముచ్చ టించుటయన్న ఇతడు ఎక్కువ ప్రీతి చూపించుచుండెడి వాడు. స్వీడను శాస్త్రజ్ఞులలో బెర్జీలియస్ తరువాతి స్థానము అర్హీనియస్ అని చెప్పవచ్చును. దే ' a. s'. ఆలంకరణ కళ (Decorative Art) :- 'అలంకార ప్రియో విష్ణుః' అని హిందువులు విశ్వసింతురు. అలం కరణము మానవుని స్వభావము కూడ. తాను ఉపయో గించు వస్తువులను బుద్ధికింపగురీతిని కూర్చుట లేక చిత్రిం చుట మానవునికి సహజమైనపని. ఇదియే అలంకరణము, కాగితాలతో పూవులుచేయుట, ముగ్గులు వేయుట, జిలుగు కుట్టుట మొదలగు పనులు అలంకారములు అనబడును. అలంకరణము మానవుని హృదయమును రంజింపజేసి ఆహ్లాదమును కూర్చును. మనకు నిక్కమైన ధనము అలం కరణమే. మనము డబ్బుచేత డాబును కొనుచున్నాము. గౌరవమును, భోగమును, కీర్తి ప్రతిష్ఠలను కలిగించునది ఈ కళయే. నేటి ఏడంతస్థుల మేడ, సోఫా సెట్లు, అల్మా