పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/397

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆర్హీనియస్ మాన మీయబడినది. స్టాక్ హోములో ప్రొఫెసరుగా నుండి తదుపరి నోబెల్ ఇన్స్టిట్యూటులో భౌతిక రసా యన శాఖకు డై రెక్టరుగా చనిపోవువరకు పనిచేసెను. అర్హీనియస్ స్వీడన్ లోని రైతు కుటుంబమునకు చెందినవాడు. ఇతడు 1859 సంవత్సరము, ఫిబ్రవరి నెల 19 వ తేదీనాడు ఉప్సాలా పరిసరములో జన్మించెను. స్కూలు చదువు పూర్తి అయిన తరువాత 17 వ ఏట ఉప్సాలా విశ్వ విద్యాలయములో ఉన్నతవిద్య నభ్య సించెను. అచట క్లీవ్ వద్ద రసాయన శాస్త్ర పరిశోధనమునందు శిక్షణ పొంది, స్వతంత్రముగా పరిశోధన ములు జరుపుటకు స్టాక్ హోమ్ లో ఎరిక్ ఎడ్లుండ్ అను భౌతిక శాస్త్రజ్ఞుని వద్ద చేరెను, ఆ రోజులలో శాస్త్రజ్ఞులకు ద్రావణముల ధర్మములపై మోజు ఎక్కువగా నుండెను. వాంటుహాఫ్ కోల్రాష్ ఓస్ట్వాల్డ్ మున్నగు శాస్త్ర జ్ఞులు ద్రావణముల వివిధధర్మములపై పరిశోధనలు జరుపు చుండిరి. అందుచే అర్హీనియస్ తన డాక్టరేట్ కొరకు ద్రావణములు విద్యుద్వాహకత్వము (Conductivity of Solution) గురించి ప్రయోగములు ప్రారంభించేను. 1884 లో స్వీడిష్ అకాడమీకి విద్యుత్కణముపై శన పరిశోధన ఫలితములు సమర్పించెను. డాక్ట రేటు లభించినను అర్హీనియస్ పరిశోధనములకు తగిన గౌరవము దొరకలేదు. అయినను ఇతర దేశములలో ఆలివర్ లాజ్, ఒస్వాల్డ్ మున్నగు శాస్త్రజ్ఞులు ఇతని పరిశోధనములను మెచ్చుకొనిరి. అదే సంవత్సరములో ఉప్పాలాకు ఓస్వాల్డు రాకవలస అర్హీనియసు కొంత గౌరవము లభించెను. 1855 లో ఎడ్లుండ్ ప్రయత్నముపై ఇతనికి అయిదేళ్ళవరకు యూరప్ లోని వివిధ దేశముల ప్రయోగశాలలలో పనిచేయుటకు స్వీడిష్ అకాడమీనుంచి వేతనము లభించెను. ఈ అవకాశమును పురస్కరించుకొని ఓస్వాల్డు, కోబ్రాష్, వాంట్ హఫ్. బోల్టుస్మన్ వంటి ప్రముఖ శాస్త్రజ్ఞులవద్ద పెక్కు పరిశోధనములు జరి వెను. తరువాత లెప్సిగ్లో ఓప్ ట్వాల్డ్ కు అసిస్టెంటుగా చేరెను. 336 ఈ రోజులలోనే తనకు ఖ్యాతినిచ్చిన అయానీక రణ (Electrolytic dissociation) సిద్ధాంతమును విశదీక రించెను, ద్రావణముల విద్యుద్వాహకత్వముపై తాను సాగించిన ప్రయోగముల ఫలితముగా అర్హీనియస్ కొన్ని నిర్ణయములకు రాగలిగెను. ఇతని సిద్ధాంతమును క్రింది విధముగా తెలుపవచ్చును. లవణములు, ఆమ్లములు, లవణాధారములు ద్రావణ రూపములో అయాన్ల (Ions) క్రింద విచ్ఛేదింపబడును. ఈ అయనవిచ్ఛేదనము సజలతతో అధిక మగును. అనంత సజలీకృత ద్రావణ ములో అయానీకరణము సంపూర్తి యగునని అర్హీనియస్ సిద్ధాంతము. విద్యుత్ప్రసరణము అయాన్ల ద్వారా జరుగును. గనుక, సజలతతో విద్యు ద్వాహకత్వము కూడ హెచ్చును. అర్హీనియస్ సిద్ధాంతము ప్రకారము గరిష్ఠ విద్యుద్వాహకత్వము సంపూర్ణ- అయన విచ్ఛేదనము సూచించును. ఏదైన గాఢత (సాంద్రత గల ద్రావ ణములోని విచ్ఛేదనాంశమును కను గొనుటకై ఈ క్రింది నిష్పత్తిని అర్హీనియస్ తన ప్రయోగములద్వారా సాధించకలిగెను, AI-L .. Aar ఇందు L విచ్ఛేద నాంశమునకు గుర్తు. AP ద్రావణము యొక్క విద్యుద్వాహకత్వముపైన, Aoc అనంత సజలీ కృత స్థితిలో ద్రావణము యెక్క విద్యుద్వాహకత్వము పైన ఆధారపడి ఉండును, ఈ విధముగా విద్యుద్వాహకత్వము విద్యుద్వాహకత్వము ద్వారమున కొలువబడిన విచ్ఛేదనాంశములు ఇతర ప్రయోగముల ద్వారమున కొలవబడిన విలువలతో సరిపోయెను. అంతేగాక ఇతనీపరిశోధనములు ద్రావణములు ఇతరధర్మ ములను అర్థము చేసికొనుటకు ఎంతో తోడ్పడినవి. ఇతడు ప్రతిపాదించిన, ఉపయోగకరమైన మరి యొక సిద్ధాంతము రసాయన ప్రక్రియా వేగమునకు ఉష్ణోగ్రతకు సంబంధించినది. రసాయనప్రక్రియలు భిన్న అణువులు