పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/396

ఈ పుటను అచ్చుదిద్దలేదు

త్రోసి రాజనినప్పటికిని అతడు దానిని జవాన్సు యొక్క మార్జినల్ యుటిలిటి సిద్ధాంతముతో జోడించి ప్రయో గించి, దాని మూలమున తన వేలను నిర్ణయించు ప్రాతి పదిక సిద్ధాంతమును నిర్మించెను. అది అర్థశాస్త్రశాఖలకు అన్నిటికిని వర్తించునని చూపెను. విలువ, ప్రత్యేక ముగా అపేక్ష, సరఫరా అనువాటిలో ఏ ఒక్క దాని పైనను ఆధారపడదు. అది ఆ రెంటి పైననుగూడ ఆధారపడునని తన శాస్త్రీయ విభజన, సమ్మేళనములద్వారా మార్షలు నిరూపించెను. పంపక మునుగూడ అదేరీతిని విభజించి, అదేవిలువ సిద్ధాంతమును అన్ని ఉత్పత్తిసాధనములకును వర్తింపజేయవచ్చునని మార్షలు నిరూపించెను. తన్మూల మున అతడు ఆర్థిక విలువకు సంబంధించిన మన భావము లకు పరస్పరానుగుణ్యమును, ఐక్యమును కల్గించెను. ప్రతిఉత్ప త్తిసాధనమునకును లభించు ప్రతి ఫలము, అ పేడకు సంబంధించినంతవరకు మార్జినల్ ప్రొడక్టివిటీ మీదను, సరఫరాకు సంబంధించినంతవరకు ప్రతిసాధనము యొక్క ఉత్పత్తి వ్యయముపైనను, ఆధారపడునని నిరూపించుటకు, 'మార్టికా' అను అతి ముఖ్యమైన సూత్రమును అతడు ప్ర వేశ పెట్టెను. మార్షలు యొక్క సిద్ధాంతములు, “పరిశ్రమకు సంబం ధించిన ఆర్థికవిషయములు” “అర్థశాస్త్ర సూత్రములు" “అర్థశాస్త్రసూత్రములు" "పరిశ్రమ - వ్యాపారము,” “ధనము - అప్పు- వాణి జ్యము" అను విశ్వవిఖ్యాతములైన ఉద్గ్రంథములందు పొందుపరుపబడియున్నవి. జే. యం. కీన్సు : ఆడము స్మిత్, జే. యస్. మిల్, ఆల్ ఫ్రెడ్ మార్షలు అనువారియొక్క కోవకు చెందిన ఆర్థికశాస్త్రవేత్తలలో కీన్సు ఒకడు. ఒక తరమునుండియు ఆర్థికసిద్ధాంతములకు సంబంధించిన ప్రధాన పరిణామ ముతో ఇతని పేరు జోడింపబడియే కన్పడుచున్నది. అర్థ శాస్త్రమునకు సంబంధించిన సిద్ధాంత చర్చలయందే కాక శాస్త్రమునకు సంబంధించిన అంతర్జాతీయ చర్చల యందును ఇతని ప్రాబల్యము చూపట్టుచున్నది. కీన్సు 1981 లో "ధనము" ను గూర్చి వ్రాసిన గ్రంథము (Treatise on money) అర్థశాస్త్రమునకు ఆయన అర్పించిన అమూల్యమైన కానుక, ఐతే కీల్షియం- బైబిలు అని పరిగణింపబడు "ఉద్యోగము - వడ్డీ, ధనము 335 ఆర్హీనియస్ వీటికి సంబంధించిన సాధారణతత్వము" అను గ్రంథము బోధనా కార్య నిమగ్ను లగు ఆర్థిక శాస్త్రవేత్త లందు కలిగించినంతటి సంచలనమును ఆడము స్మిత్తు యొక్క 'ప్రపంచజాతుల సంపద" అను గ్రంథము తర్వాత ఏ ఇతర గ్రంథము కల్గించలేదు. 86 కీన్సు వెల్లడించిన భావములు ప్రపంచమందంతటను అంగీకృతములైనవి. నిరుద్యోగమును గూర్చి ఇతడు చేసిన కృషి ఆ తర్వాత వెలువడిన అనేక గ్రంథములకు మూలా ధార మైనది. ఆర్థికశాస్త్రము చాలవరకు రాబడి వ్యయ ముల ప్రవాహముల యొక్క పరస్పర సంబంధమును పరిశీలించుటయే అనియు, పరస్పర సంబంధములో గల్గిన మార్పులే ఆర్థిక స్థిరత్వముపై తమ ప్రాబల్యమును కనపరచుననియు ఇతడు నిరూపించెను. నిరుర్యోగము అనునది పొదుపుచేయబడిన మొత్తము పెట్టుబడుల యొక్క సంబంధమునకు సంబంధించిన సమస్యయనియుకూడ అతడు చూపెను. వీటియొక్క సమన్వయము కొరవడి నచో నిరుద్యోగము పెరుగును. పై రెంటిని సమపాళ ములో నుంచగల చర్యలను తీసికొను బాధ్యత ప్రభు త్వమే కలిగింపవలెను. ఉపసంహారము : ఆర్థిక శాస్త్రవేత్తలు తమ వ్యాసంగ మందలి ప్రాతిపదికల విషయములో ఏకభావము కలిగి యున్నను, కొన్ని విషయములపై వారియందు పూర్వ మున్నంత ఏక గ్రీవాభిప్రాయము లేదు. ఆర్థిక విషయ ముపై నేడు వెల్లడింపబడిన భావములు సనాతన వర్గము వారి రోజులలో వలె నిష్కర్షగా చెప్పబడుటలేదు. ఆర్థిక శాస్త్ర సిద్ధాంతములలో అంతిమ నిర్ణయమనునది ఉండ దని ఈనాడు గుర్తింపబడుచున్నది. ఆర్థిక విధానము బహుసమస్యలతో నిండినది. ప్రతి రంగములోను ఆర్థిక శక్తుల ఫలితములు బహుక్లిష్టములై ఏ ఆర్థిక సూత్రము నకు లోబడకున్నవి. జి. రా.రె. ఆర్హీనియస్:- స్వాంతె అగస్టస్ అర్హీనియస్ (1859-1927) పేరుపొందిన స్వీడన్ దేశపు రసాయన శాస్త్రజ్ఞుడు. ద్రావణములలో విద్యుత్ప్రసరణమును గురించిన ఇతని సిద్ధాంతములు ఎన్నియో సమస్యలకు ఉపకరించినవి. వీటికై 1908 లో ఇతనికి నోబెల్ బహు