పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/395

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అర్థశాస్త్ర సిద్ధాంతముల చరిత్ర ఆర్థిక శాఖలకు ఇతనిని స్థాపకునిగా పరిగణింపవచ్చును. అతని దృష్టిలో సాంఘిక శాస్త్రమనునది ఒకే శాస్త్రము. ఇతర విధానములను పూర్తిగా వర్ణింపక చారిత్రకమయిన పోలికలను గమనించుట ఇందు అవలంబించవలసిన ప్రధాన విధానము. విపులార్ధములో యావత్తు చరిత్రయు, నేటి పరిస్థితులకు సంబంధించిన విషయ సామగ్రియు, ఆర్థిక పరిశోధనకు ముడిసరుకు నియ్యగల సుక్షేత్రములు. ఈ నూతన విధానము, వి స్తృత అంగీకారమునొంది ఫ్రాన్సు నుండి యూరపు ఖండమునందలి ఇతర దేశములకు వ్యాపింప జొచ్చెను. జర్మనీలో ముఖ్యముగా ఈ చారి త్రక పద్ధతులు సామ్యవాద సిద్ధాంతములు బలపరచుటకు ఉపయోగింపబడెను. ఈ సందర్భమున కారల్ మార్క్సు ఈగిల్సు, రాడ్ బెర్స్, లాసల్లేల నామములను ముఖ్య ముగా పేర్కొనవలసి యున్నది. అదనపు విలువ సిద్ధాం తము (Theory of Surplus Value) ను, పెట్టుబడి దారీ పారిశ్రామిక విధానమును నశింపచేయగల విషక్రిములు దాని గర్భమునందే కలవను సిద్ధాంతమును పట్టువిడువక సమర్థించుటలో మార్క్సు ప్రసిద్ధుడు. పంపకములో పెట్టుబడిదారుసకును, కార్మికునకును వైరుధ్యము నాతడు నొక్కి వక్కాణించెను. పెట్టుబడిదారి కృషి నశించుట అనివార్య మనియు అంతటితో కార్మికులు అధినేత లై, ఉత్పత్తి, జాతీయమగుటయు, పరిశ్రమపై కమ్యూనిస్టు అధికారము సాధ్యమగుటయు జరుగు నని అతడు అభి ప్రాయపడెను. శాస్త్రాధార సామ్యవాదమునకు మిక్కిలి దోహదమిచ్చినవా డితడే. అప్పటినుండియు ఇతని భావ ములే సామ్యవాద ప్రపంచమునందెల్లెడలను ప్రధాన స్థానమును ఆక్రమించెను. లాసెల్లే పేరు వేతనమునకు సంబంధించిన జీవనభృతి సిద్ధాంతము (Iron law) తో అనుబంధింపబడియున్నది. నవీన రూపములో ఆర్థికశాస్త్ర తత్వము పరిణతి నొందుటకు శాస్త్రదృక్పథము విశేషముగా గల డల్లియు. యస్. డేవన్సు (1885-82) ముఖ్య కారకుడు. ఆయన ఆ విధానమునే అవలంబించి అమూల్య ఫలితములను సాధింపజాలెను. "ప్రభుత్వము కార్మికులు" (The state in relation to labour) అను ఇతని గ్రంథము వ్యక్తి స్వాతంత్ర్య సూత్రము (Laissez-faire) నందలి నిర్దాక్షి - 334 ణ్యమును స్పష్టపరిచేను. “ధనము మారకపు (Exchange) సాధన యంత్రము" (money and the mechanism of exchange) అను ఇతని గ్రంథమొక ఆదర్శగ్రంథము. అతడు ఫైనల్ యుటిలిటీ అని పేర్కొనిన "మార్జినల్ యుటిలిటి" అను సూత్రమునకును, మరియు “వ్యాపార చక్రములు (Trade cycles), మూల్య చలన గతులు అనువాని చరిత్రకు సంబంధించిన సిద్ధాంతములకును ఆర్థికశాస్త్ర వేత్త లెంతయు ఋణపడియున్నారు. ఆస్ట్రియన్ వర్గము : "మార్జిన్ (margin) అను భావ మును శాఖోపశాఖలుగా ఆర్థిక పరికరముగా నుపయో గించుటతో ఆస్ట్రియన్ వర్గము వారి పేరు అనుసంధింప బడినది. అతిస్పష్ట భావావళి ఈ శాఖవారిలో పరాకాష్ఠ చెందినది, వారి సిద్ధాంతమునందలి ప్రధాన విషయములు మూడు. 3- (1) ఉత్పత్తి - వ్యయములు వెలను నిర్ణయించునను సిద్ధాంతములను అంగీకరింపక ప్రయోజనమును బట్టియే వెల నిర్ణయమగునని వారు భావించిరి. అది, ఆవశ్యకమని భావించిన వ్యక్తి యొక్క ఉద్దేశమందు ప్రతిబింబించు నని వారి ఉద్దేశము. (2) ఈ విలువ 'మార్జిను' వద్ద నిర్ణీతమగును, అనగా తదుపరి భాగముల ప్రయోజనము తగ్గుదలలో నుండును. నిరుపయోగకర మగుచున్న వస్తుజాతము యొక్క విలువను దాని లభ్యతను బట్టి నిర్ణయించునది, దానిని ఉపయోగమును పొందుచున్న అంత్యము అముఖ్యమైన ప్రయోజన మే. (3) ఖర్చు అయిన వస్తువుల విలువనుబట్టి వాటియొక్క ఉత్పత్తి సాధనములకు విలువ ఏర్పడును. అనగా విలువను బట్టి ఖర్చులు నిర్ణయమగునుగాని ఖర్చులనుబట్టి విలువ నిర్ణయింపబడదు. ఈ వర్గమునందలి ప్రముఖులు కార్లు మెంజరు, వెయిజరు, బొహం బియార్కు అనువారు. ఆల్ ఫ్రెడ్ మార్షల్ : ఆర్థిక వేత్తలలో నవీన మైన ఆర్థిక శాస్త్రమునకు గొప్ప ప్రయోజనము కలిగించిన వాడు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయమునకు చెందిన ఫ్రెడ్ మార్షలు. ఇతడు ఆధునిక శాస్త్రమునకు జనకు డని పేర్కొనదగిన మహావ్యక్తి. రికార్డో యొక్క ఉత్పత్తి వ్యయసంబంధమైన విలువ సిద్ధాంతమును మార్షల్ ఆల్