పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/394

ఈ పుటను అచ్చుదిద్దలేదు

" ఆడమస్మిత్తు యొక్క "ప్రపంచజూతుల సంపద" (Wealth of Nations) అను గ్రంథమున ఆర్థిక స్వేచ్ఛ అను నూతన సిద్ధాంతము మరింత సమగ్రముగ వెల్లడింప బడి సవిస్తరముగ వర్తింపజేయబడినది. ఆయనకుగల ప్రాముఖ్యము అసామాన్యము. దాదాపు ఏ యుగము లోను ఏ రచయితయు తన తోడిమానవుల భావముల పై ఇంతకన్న నెక్కువ ప్రాబల్యము కలిగియుండ లేదు. అశడాకాలమునాటి పరిస్థితులకు అతీతమైన ముందు చూపును కనపరిచినవాడు. ఈనాడు ఆర్థిక శాస్త్రములో సత్యములుగ పరిగణింపబడు విషయములలో కొంచెము గనో గొప్పగనో ఆయన దృష్టికి గోచరించనిది లేదు. వీటి నన్నిటికిని మించి అతడు ఆర్థికశాస్త్రములో మానవ సంబంధమైన లేక వ్యక్తిగతమైన విషయము యొక్క ప్రాముఖ్యమును గమనించెను. ఆర్థిక సిద్ధాంతములందు ఆయన కృషివలన నూతన శకము ప్రారంభమైనది. ఆర్థిక సూత్రములను విస్తరింపచేసి, మున్ముందు ఆర్థిక వేత్తలు కట్టడము నిర్మింప వీలయిన శాస్త్రీయమగు పునాదిని ఏర్పరచుటకు జరిగిన ప్రథమయత్నము ఆతనిదే. అతని పిమ్మట వచ్చినట్టి ఆర్. మాల్ ధస్ (1788. 1854) సాధారణ ఆర్థిక శాస్త్రముపై ఒక గ్రంథమును రచించెను. జనసంఖ్యను గూర్చిన అతని సిద్ధాంతమునకు ప్రబల వ్యతిరేకత ఉద్భవించి అర్థశాస్త్రము "భయంకర శాస్త్ర"మని పేరు వచ్చుటకు చాలవరకు కారణ మయ్యెను. ఆ పిమ్మట వచ్చినవాడు డేవిడ్ రికార్డో అను నాతడు (1772-1828). అద్దెను గూర్చిన సిద్ధాంతము ఇతడు ప్రవచించిన ముఖ్య విషయము. ఇది ఇప్పటికిని అతని పేరున నే పిలువబడుచున్నది. అర్థశాస్త్రమందలి అము క్తతర్కమునకు ఇతని పేరు ప్రధాన ఉదాహరణముగ పేర్కొనుట ఇప్పటికిని అలవాటు. ఆపిమ్మట వచ్చిన రచయితలలో ప్రధానముగ పేర్కొన వలసినవాడు జాన్ స్టూఅర్టుమిల్ (1808-78). సనాతన ఆర్థికశాస్త్రవేత్తలందలి జెట్టీలలో కడసారివా డీతడే, అర్థశాస్త్ర సూత్రములు (ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ ఇకానమీ) అను ఇతని గ్రంథము ఆర్థికశాస్త్ర చరిత్రలో నూతనశక మారంభ మగుటకు కారణమైనది.. అందు, ఎల్లరును ఆర్థిక శాస్త్రము పరిపక్వమై సంపూర్ణస్థితికి వచ్చి 333 అర్థశాస్త్ర సిద్ధాంతముల చరిత్ర నట్లు పరిగణింపసాగిరి. సాంఘిక తత్వవేత్తకూడ నై యుండి ఆర్థికశాస్త్రము యొక్క దృష్టిని విస్తృతము గావించు టకు ఇతడు ఎంతో కృషిచేసెను. "ప్రపంచ జాతుల సంపద (Wealth of nations) అను గ్రంథమునకును “అర్థశాస్త్ర సూత్రములు" అను గ్రంధమునకును నడుమ యూరపుఖండమునందలి అనేక మంది ఆర్థిక శాస్త్రవేత్తలు ఆశాస్త్రాభివృద్ధికి తోడ్పాటు చేయుచుండిరి. వారిలో ఫ్రాన్సు నందలి సే, కౌల్ నట్, సిస్ మోండీ బెస్టేటు అను వారలును జర్మనీయందలి హెర్ మన్, ధూనెన్, రే అనువారలును ముఖ్యులు. వీరిలో పెక్కుమంది సనాతన సిద్ధాంతములు వెలువడిన పిమ్మట వచ్చినవారై, వాటినిమరింత అభివృద్ధిలోనికి తెచ్చిన వారే. అముక్తతర్కము, అనుమేయవిధానము (Deduction) వారు అనుసరించిన పద్ధతులు. వ్యక్తి స్వాతంత్ర్య అంగీ కారము (Laissez Faire) ను సమర్థించుటకుగాను సనా `తన ఆర్థిక వేత్తల యొక్క సిద్ధాంతములను ఉపయోగించు కొనిన మాంఛస్టరు ఆర్థికశాస్త్ర వర్గమునకు చెందిన పండితులుకూడ ఈ విధానములనే అనుసరించిరి. అతని యనుచరులును చారిత్రకవర్గము : సంప్రదాయ వర్గము వారి ఆర్థిక పరి శోధనా విధాన పద్ధతుల కన్న అన్యములను అనుసరించు ఉద్యమము రానున్నదని జాన్ స్టూఆర్టు మిల్ యొక్క రచనలు సూచించినవి. కేవలము సిద్ధాంతానుసార భావ ములపై ఒక విధమగు వ్యతిరేక భావమును ఈ శాస్త్ర మును వాస్తవిక, చారిత్రక పునాదులపై నిర్మింపవలె నను ఆకాంక్షయు క్రమక్రమముగా పెంపొందదొడగెను. డేవిడ్ రికార్డో అనునాతడును యథార్థరహితములు లేక రుజువు కాని విషయములను ఆధారములుగ చేసికొని, ఆర్థికశాస్త్రమును కేవలము ఒక ఊహాధారమైన శాస్త్రముగ పరిగణించి రనియు, అట్టి వాటిలో సాధ్యమైనంత యెక్కువ సంపదను బడయుట, సాధ్యమైనంత తక్కువ శ్రమను పొందుట, అను రెండు ఆశయములు గల "ఆర్థిక వ్యక్తిత్వము” అను భావన ముఖ్యమైన దనియు, మిల్ నొక్కి చెప్పేను. ఈ లోపములను సవరించుటకు తీవ్ర ప్రయత్నము సలిపిన వారిలో ప్రథముడు ఆగస్టేశాంటీ (1798-1857) అను ఫ్రెంచి దేశస్థుడు. యూరపు ఖండమందలి చారిత్రక