పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/393

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అర్థశాస్త్ర సిద్ధాంతముల చరిత్ర పరిశ్రమలు ప్రాము ఖ్యము గలవి. వాణిజ్యము మిక్కిలి గొప్పది. అందు అందలి విదేశ నాణెముల ముద్రించు విధానము విస్తృతమైనది. కాని పరిశ్రమ లింకను బానిసల పనిగనే యుండెను. తన్మూలమున రోమను ఆర్థికశాస్త్రము కూడ నవీన పరిస్థితులనుండి భేదించియే యుండెనని చెప్పవచ్చును. విజ్ఞాన పునరుజ్జీవనము - మర్కంటైల్ సిద్ధాంతము : విజ్ఞాన పునరుజ్జీవన కాలమువరకు దీనిని క్రమబద్ధ ముగ విభజించుట కెట్టి తీవ్రప్రయత్నమును జరగలేదు. ఆర్థిక విచారముపై మత రాజకీయ విచారణల నీడలు ప్రస రించు చుండెను. పదునైదవ శతాబ్దియందలి విజ్ఞాన పునరుజ్జీవనము, నూతన పపంచము కండ్లటుట, విజ్ఞాన పునరుద్భవము, ప్రొటస్టెంట్ మత సంస్కరణము, ముద్రణయంత్రము కనుగొనబడుట మొదలగు కారణ ముల వలన ప్రపంచము తీవ్రగతిని పురోగమించుచున్నట్లు కనబడెను. క్రొత్త ప్రపంచము కనుగొనబడుటవలన పాత ప్రపంచము వారి అందుబాటులోనికి వచ్చిన అపార సంపదకై జరిగిన సంఘర్షణలో స్పెయిన్, పోర్చుగల్ దేశములకు అత్యధిక భాగము లభించెను. కాని వారి ఐశ్వర్యమే వారి వినాళ హేతువయ్యెను. త్వరలోనే వారి కంటే బలవంతములైన హాలెండు, ఫ్రాన్సు, ఇంగ్లండు దేశములు వారిస్థానము నాక్రమించినవి. తుదకు ఫ్రెంచి వారిపై, యూరపునందును, భారతదేశమందును ఏక కాల ములో విజయము సాధించి ఇంగ్లండుదేశము నావికా బలమున అసమాన ప్రాబల్యమును సంపాదించెను. ఈ కాలమందే వాణిజ్యము బహు విస్తృతమయ్యెను. ప్రభువు భూమిని తన ప్రత్యేకోపయోగమునకు ఉపయో గించుకొను విధానము స్థానే జాతీయార్థిక వ్యవస్థ అవత రించినది. ఆంగ్ల వర్తకులు సామ్రాజ్యస్థాపనకు పునాదులు నిర్మింపదొడగిరి. ఈనాటి ఆర్థికశాస్త్ర గ్రంథము లన్నిటి యందును ఆంగ్లదేశపు విదేశ వ్యాపారము, నావికా విధానములకు సంబంధించిన ప్రసక్తి మెండుగా గాన వచ్చును. మర్కంటైల్ సిద్ధాంత మీ విధముగా ఉద్భ వించి ఆంగ్లేయ వ్యాపారకృషియందు రెండు శశాబ్దుల కాలము ప్రముఖస్థానము నాక్రమించినది. దేశములోనికి బంగారము తీసికొని రాగల ఎగుమతులను ప్రోత్సహిం 332 చుట, దేశము తన బంగారము వెచ్చింపవలసిన దిగు మతుల నిరుత్సాహపరచుట, విదేశ వ్యావారము యొక్క ఆశయమై యుండవలెనని వ్యాపారశీలురు (Mercan- tilists) భావించిరి. వాణిజ్య విధానము పలు వైపులుగ వ్యాపించి, ఆర్థిక అభ్యుదయములో జాతీయశక్తిగ పరిగ ణింపబడ నారంభించినది. ఎగుమతులు ప్రోత్సహింపబడి, దిగుమతులు కొన్ని నిషేధింపబడుట మరికొన్ని ఎక్కువ సుంకములకు గురిచేయబదుట జరిగెను. ప్రతి మారకము లోను ఒక పక్షమువారికి లాభము కల్గిన, మరియొక పక్షమువారికి నష్టము కలుగునను భావనపై ఈ సిద్ధాం తము ఆధారపడి యున్నది. ఈ విధమైన స్వజాతీయ ఆర్థికాభిమానము ఆంగ్లదేశమునకే పరిమిత ముగాదు. పదునేడవ శతాబ్దపు ఐరోపాఖండపు జాతులన్నిటికినీ, ముఖ్యముగా ఫ్రాన్సు ప్రష్యాలకును ఇది విశిష్టలక్షణము. నవీన ఆర్థికశాస్త్రము - సనాతన వర్గము:- ప్రముఖుడును స్కాట్లండు దేశస్థుడును అగు ఆడముస్మిత్తు ఆర్థిక శాస్త్రము నకు తండ్రిగాను స్థాపకుడుగాను సరిగణింపబడుచున్నాడు. కాని ఇది పూర్తిగా యథార్థము కాదు. ఈ శాస్త్రమునకు నిర్దిష్టమగు సంపూర్ణరూపమిచ్చిన వారిలో ప్రథముడిత డే యనుమాట వాస్తవమేయైనను, ఆర్థికాభివృద్ధికి మూలము స్వాతంత్య్రమే అను భావమును మొదట కలిగించిన వారు బహుశః ఫిజియో కాట్సు అను ఫ్రెంచి ఆర్థిక శాస్త్ర వేత్తలని అంగీకరింపవలసి యుండును. ప్రకృతి నిర్దేశ సూత్రము (rule of nature) అనుసరింపవలయు నని వారు బోధించుటయే అట్లు పరిగణించుటకుగల కారణము. ఈ వర్గము వారి నాయకులు క్వాస్నే, టర్ గెట్ అను వారలు. ప్రకృతి నిర్దేశమునకు మానవుల చర్యలన్నియు లోబడి యుండుననియు, అనిర్దేశము అందరికిని సుకర ముగ నుండురీతిని వారిని నడుపు ననియు వీరి అభి ప్రాయము. స్వచ్ఛందపు పోటీ సూత్రము ప్రధానాతి ప్రధానము. ప్రభుత్వపు జోక్యమునకై చేయబడు ప్రయత్నముల నిరసించవలసి యుండును. లెసేఫేర్ " (Laissez Faire) అను వ్యక్తి స్వాతంత్ర్య వాదమునందు వారి సిద్ధాంతము ఇమిడియున్నది. వ్యక్తికి ఏది అత్యంత ప్రయోజనకారియో అదియే సంఘమునకును ప్రయో జన కారియని వారు భావించిరి. కై