పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/392

ఈ పుటను అచ్చుదిద్దలేదు

మన జాతీయోద్య మారంభములో రేనడీ మహాశయుని గ్రంథములు, దాదాభాయి నౌరోజీ భారతీయ దారిద్ర్య మునుగూర్చి వ్రాసిన గ్రంథము - ఇవి మన కనులను విప్పిన అమూల్య గ్రంథములు. కేవలము భారీ పరిశ్రమలే త్రవ్వి తలకెత్తునను వ్యామోహములో చిక్కుకొనియున్న మనకు డా. కుమారప్పవంటి గాంధేయ ఆర్థిక శాస్త్ర వేత్తలు, మహాత్ముని యొక్క వికేంద్రీకరణ సూత్రమును వివరించి మేలు చేసిరి. అంతేగాక "స్వచ్ఛమగు ఆర్థిక శాస్త్రము" మేధకు ఆసవము వంటిది. సంక్షేమ ఆర్థిక శాస్త్రము పరిపాలకులకును, శాసనసభ్యులకును చక్కని సూచనలు నియజాలును. ఆర్థిక సమస్యలకు ఈనాటి ప్రపంచములోగల ప్రాధాన్యమును గుర్తించినవారికి ఈశాస్త్రపఠన మెంత ప్రయోజనకరమో సుస్పష్టమగును. ప్రపంచశాంతిని కాపాడుటయే ఆశయముగాగల ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యమున ఆర్థిక విషయములలో పని చేయుటకు ప్రత్యేక శాఖలు నెలకొల్పబడినవి. ఈ యంశము లన్నియు ఆర్థిక శాస్త్రమునకు నేటి జీవితములోగల ప్రాధాన్యమును స్పష్టపరచుచున్నవి. చిన్న పంచాయితీ సంస్థ, రాబడి సమస్య మొదలుకొని పార్లమెంటు చర్చించు ఆదాయ వ్యయ పట్టిక వరకును ప్రతిచిన్న సమస్యను, పెద్ద సమస్యను గ్రహించుటకు ఆర్థిక విజ్ఞానము అవసరము. ముఖ్యముగా ప్రభుత్వము నకు ఆర్థికరంగమున గల స్థానము వికేంద్రీకరణము - మొదలగు సమస్యలపై తర్జన భర్జనలు జరుగు నీనాడు భార యువకులు కీ శాస్త్రములో సమగ్ర విజ్ఞాన మావశ్యకము, డా. ఆర్. వి. రా. అర్థశాస్త్ర సిద్ధాంతముల చరిత్ర :- ఆర్థికసిద్ధాంత వికాసము : అతి ప్రాచీన కాలమందలి ఆర్థిక సిద్ధాంతములు మత, నైతిక, రాజకీయ, న్యాయశాస్త్ర సిద్ధాంతము లతో మిశ్రితములై యుండుటచే ఏదేని యథార్థ వ్యత్యా సమును ఎత్తి చూపుటయే పెక్కు సందర్భములందు కష్టసాధ్యము. ప్రాచీన ప్రపంచపు భావనయే అన్యవిధ ముగ నుండెను. ఆచారములు, అధికారములు చెలా యింపు కలిగియున్న యుగ మది. పరిశ్రమము బానిసలు చెయ్యవలసిన పనియనియు, యజమాని దాని ఫలితము 331 ఆర్థశాస్త్ర సిద్ధాంతముల చరిత్ర లకు హక్కు దారుడనియు ఆనాటివారు భావించెడువారు. అట్టి పరిస్థితిలో నేడు ఆర్థికశాస్త్రము అని పిలువబడు రీతిని ఆర్థికశాస్త్రము అభివృద్ధి చెందుటకే అవకాశము అతిప్రాచీన నాగరకతలు: ప్రకృతిమాత యొక్క అను గ్రహమునకు లోనై, మానవుని అత్యల్ప కృషి వలన కూడ అతని అవసరములను మించిన ఫలసాయముల నొసగు దేశములందే అతి ప్రాచీనములగు మానవ నాగరకతలు ఉద్భవించినవి. అట్టి అదనపు ఫలసాయమున్నపుడే అభి వృద్ధి సాధ్యమగును. మనకు తెలిసిన వాటిలో, మిక్కిలి ప్రాచీనము లగు ఈజిప్టు, బాబిలోనియా నాగరికతలు, మహానదీ లోయలలో, సారవంతమగు భూములలో, వెచ్చని శీతోష్ణస్థితిలో, స్వల్పకృషితోనే మానవులు, జీవ నము చేయగల ప్రదేశములందే ఉత్పన్నమైనవి. గ్రీసు, రోము : గ్రీకులు ఈజిప్టుదేశస్థులతో తమకు కల్గిన సంపర్కమువలన, పెక్కు విషయములు తెలిసి కొన్న వారే యైనప్పటికిని, నవీన కాలపర్థితులకు మార్గ దర్శకులు అయి యున్నారు. ఆర్థిక విషయములను సిద్ధాంతీకరించుట, గ్రీకుపండితుల రచనలయందే మొదట ప్రారంభమైనది. ఫినీషియన్సును మినహాయించినచో అప్పటివరకు ప్రపంచమందు మిక్కిలి ఎక్కువగా వర్తక వాణిజ్యములు నడిపినదియు గ్రీకువారే. కాని వారి యొక్క పరిశ్రమలు విశేష ప్రాముఖ్యముగలవి కావు. అవి ఉన్నతశ్రేణి పౌరులు ఆచరించుటకు అర్హములుగ పరిగణింపబడలేదు. గ్రీకు సాంఘిక ఆర్థిక తత్వవేత్తలందు మిక్కిలి ప్రముఖుడగు ప్లాటో, “రిపబ్లిక్" అను పేరు గల గ్రంథమును రచించెను. ఆదర్శసంఘమునందు ఆర్థిక విజ్ఞానమునకు సంబంధించిన కొన్ని విషయములు అందు గలవు. ధనమును ఫలరహితముగను (Barren), తత్కా రణమున ' వడ్డీని అసమంజసముగను పరిగణించిన అరిస్టాటిలు ఈ శాస్త్రము ఆ పిమ్మట వృద్ధిపొందుటకు కారకుడయ్యెను. గ్రీకుల కాలమునుండి రోమనుల కాలమునాటికి ఈశాస్త్రము మరొక అడుగు ముందుకు సాగినది. రోమను సామ్రాజ్యమునకును అంతకుముందున్న సామ్రాజ్యము లకును అనేక విషయములలో సామ్యమేలేదు. అందలి