పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/391

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అర్థశాస్త్ర ప్రమేయము లపై నాధారపడి ఆర్థికశాస్త్రరంగమును సువిశాలము చేసినది. ఆర్థిక శాస్త్రమును ఇంకను పెక్కుమంది పెక్కు విధ ముల నిర్వచించిరి. ఉదాహరణకు బెవరిడ్జి దీనిని " భౌతి కావసరములు తీర్చుకొనుటకు మానవు లొకరితో నొకరు సహకరించు సామాన్యపద్ధతుల యొక్క పఠనము" అని నిర్వచించెను. ఆర్థిక శాస్త్ర స్వభావము : ఆర్థికశాస్త్ర నిర్వచనము తర్వాత ప్రధానమైన ప్రశ్న, ఆర్థికశాస్త్రము ఒక శాస్త్ర మగునా, కాదా యనునది. శాస్త్రము (Science) అను అర్థములో తీసికొనినచో పారిశ్రామిక విప్లవమునకు పూర్వము గల ఆర్థిక శాస్త్రమునకు అర్థశాస్త్ర మనిపించు కొనుటకు పూర్తిగ అర్హత లేదు. ఈ విప్లవారంభములో నే ఆడమస్మిత్ మహాశయుని కృషివలన ఈ శాస్త్రమునకు పునాదులు వేయబడినవి. ఆర్థికశాస్త్ర మొక సాంఘిక శాస్త్రము; సంఘములోని మానవు డిందలి విషయము; గమనించిన విషయసామగ్రి ఆధారముగ సంఘమందలి సామాన్య లక్షణములను కనుగొనుటయే యిందు జరుగు ప్రయత్నము. ఐతే దీనిని ఒక కళ (art) అను వారును లేకపోలేదు. పెగూ యను ఆర్థికవేత్త దీనిని నీతిశాస్త్ర మునకు సహకారిణి (A hand maid of ethics) అని వర్ణించినాడు. ఇతని దృష్టిలో ఆర్థికశాస్త్రమనగా మెద డుతో వ్యాయామము చేయుట కారాదు. అయితే ఈ రెండు అభిప్రాయములును రెండు అతి వాదములై యున్నవి. స్వచ్ఛ రూపములో ఆర్థికశాస్త్ర మొక శాస్త్రమే. అది పెగూ చెప్పినట్లు ఆచరణలో పనికి వచ్చు సూచనలిచ్చు బాధ్యతకల్గి యుండుటయు నిజమే. కావున "కళకు ఆధారము కాజాలు శాస్త్రము" అను 'వర్ణనము సమంజసముగా నుండును. ఇది శాస్త్రమే ” యగు నెడల ఈ శాస్త్రములందలి నియమముల స్వరూపమెట్టిడి యమ ప్రశ్నము ఉదయింప గలు; అవి భౌతిక శాస్త్రము రసాయనశాస్త్రము మొద లగు శాస్త్రము/లిఉదలి : నియమము: అంత నిర్దిష్టములు వు. ఉన్ మార్షల్ డెప్పినట్లు, ఇతర సాంఘిక శాస్త్రము అందలి నియమములకన్న ఇవి మిగుల విర్దుష్టుడు యిశరని "అడగదిపతులసి (యఁడు)ను ఈనాడు గణితము మొద్దలకు $80 శాస్త్రముల సహకారముతో ఆర్థికశాస్త్రము మరింత శాస్త్రయుక్త మగుచున్నది.

-

ఆర్థిక శాస్త్రము = ఇతర సాంఘికశాస్త్రములు : (1) ఆర్థిక శాస్త్రము - సంఘశాస్త్రము (Sociology) : కామ్టే అను నతడు ఆర్థికశాస్త్ర మొక ప్రత్యేక శాస్త్రము గాననియు అది సాంఘికశాస్త్రమందు అంతర్భాగమనియు చెప్పెను. ఇది కొన్ని విషయములం దట్లు కనబడినను, దీని ఉద్దేశ ములు వేరు. ఈ రెండు శాస్త్రముల యొక్క అవకాశ, ప్రమేయములలో నే భేదము కలదు. (2) ఆర్ధిక శాస్త్రము - రాజకీయ శాస్త్రము : పై రెండును సన్నిహితములుగా గోచరించినప్పటికినీ భేదము లున్నట్లే. ఈ రెంటియంను భేదము లెంత ప్రిస్ఫుట ములుగా నున్నప్పటికిని వీటి పరస్పర సంబంధము బహు సన్నిహితము. 'పొలిటికల్ ఎకానమీ' అను పేరు ఈ శాస్త్రమునకు ఇటీవలివరకు ప్రయోగింప బసటయే యింగులకు ప్రబలసామ్యము, నవీనార్థిక శాస్త్ర జనకు డగు ఆడమస్మిత్ దీనిని ప్రభుత్వమునకు రాబడి తెచ్చు సాధనముగ పరిగణించెను. ఆర్థిక కార్యములు రాజకీయ చట్రము లోలోపల నే జరుగును. మరియు అనేక రాజకీయ సమస్యల పునాదులు ఆర్థిక ములగుటయు గద్దు. అంతేగాక ఈ రెండు శాస్త్రములకు సంబంధించిన విషయములు పెక్కు గలవు. ఈనాడు ఎల్లెడల వినబడు సామ్యవాద వ్యవస్థను అందుకు ఉదాహరణముగా పేర్కొనవచ్చును. - (3) ఆర్థిక శాస్త్రము, నీతిశాస్త్రము - పదితప్పు, ఏది ఒప్పు అని నిర్ణయించునది నీతిశాస్త్రము. ఆర్థిక శాస్త్రము ఆ విషయములో మూకీభావము వహించును. కాని అర్థ శాస్త్ర విషయములనుండి నీనిశాస్త్ర ఆదర్శములకును, నీతిశాస్త్ర - ఆదర్శములనుండి సంక్షేమ - ఆర్ధికశాస్త్రము నకును పుష్టి కలుగుచున్నది. ఐతే మద్యపాన నిషేధము వంటి కొన్ని సమస్యల పై ఆర్థికశాస్త్రవేత్త చూపు పేరు, నీతిశాస్త్రవేత్త దృక్పథము పేరు. ఇంతవరకును ఆర్థికశాస్త్ర స్వరూప, స్వభావముల గూర్చి, స్థూలముగ చర్చించితిమి. ఇట్టి చర్చవలన మనము వివాదములకు వ్యామోహితుల మగు ప్రమాదము తప్పగలదు. మనకు ఈ శాస్త్రమువలన వాస్తవిక దృష్టి అల్లవుడు ననుటకు ఎన్నేని ఉదాహరణము లియవచ్చును. 14