పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/390

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అందుకుగల కారణములు వీనికి సంబంధించిన విచారణగ దీనిని పరిగణించెను. దాని నాధారముగ జేసికొని 19 వ శతాబ్దములోని రస్కిన్, కార్లయిల్ మొద ల గు సాహితీపరులు దీనిని "భయంకరశాస్త్ర" మని వర్ణిం చిరి. కాని అర్థశాస్త్రరీత్యా సంపద యన కేవలము ధనమని మాత్రమే అర్థము కాదు. ప్రజల అవసరములను తీర్చు పరిమితము లగు వస్తువులు, పనులు అని అర్ధము. ఆల్ ఫ్రడ్ మార్షల్ "సంక్షేమమునకు వలయు భౌతిక వస్తుసంచయమును సంపాదించి, ఉపయోగించుటకు సన్ని హితముగ సంబంధించినటువంటి వ్యక్తిగత సాంఘిక చర్యలోని భాగము" ఇందలి విషయమని వర్ణించినాడు. ఇతని దృష్టిలో అది కేవలము సంపదకు సంబంధించిన దే కాక అంతకంటెనుముఖ్యముగా మానవునకు సంబంధించి యున్నది. ఈ నిర్వచనము యొక్క ముఖ్య గుణము ఏమన అది సంపదకు, సం క్షేమమునకు పరస్పరసంబంధము కల్గించుచుండుటయే, పెరూ మొదలగు ఆర్థిక శాస్త్రవేత్త శ్రీ యంశమునే విస్తరింపచేసిరి. ప్రసిద్ధ భారతీయ ఆర్థిక శాస్త్రవేత్త యగు డా. వి. కె. ఆర్. వి. రావుగారు "ఆర్థిక కార్యముల స్వభావము - ఉద్దేశము" అను ఉప న్యాసములో ఆర్థిక శాస్త్రము ఉత్పత్తి, మార్పిడి మొద లగువాసిని పరిశీలించుట, కేవలము పరిశీలన కొరకే కాక, మానవ వ్యక్తి త్వ వికాసము అను ఆదర్శసాధనకుమాత్రమే యని వక్కాణించియుండిరి. ప్రొఫెసర్ కానన్ "భౌతిక సంక్షేమ కారణముల పరిశీలన" యని ఆర్థిక శాస్త్రమును నిర్వచించెను. ఈ నిర్వచనమును లయెనల్ రాబిన్సు అను ఆర్థిక శాస్త్రవేత్త విమర్శించుచు ఆర్థిక శాస్త్ర దృష్ట్యా ఏవి భౌతిక వస్తువులో, ఏవి కావో వాటిని చెప్పుట కష్టము అని వాకొనినాడు. ఉదాహరణకు గాయకుని గానము వంటివి భౌతిక వస్తువులు కాకపోయినను అవిగూడ ఆర్థిక శాస్త్రరంగములోనివే. మరియు సాంఘిక సంక్షేమము నకు దోహదకరములుగాని (ఉ: సారాయము తయారు చేయుట) అనేక విషయములు గూడ అర్థశాస్త్రరంగము లోనివే అని రాబిన్సు వాదించెను. సంక్షేమము అను పద ప్రయోగములో నైతిక విషయము ఆమిడియున్నది. అట్టి తీర్పు చెప్పు అధికారము ఆర్థికశాస్త్రమునకు లేదు అనునది రాబిన్సు చేసిన మరియొక విమర్శ. ఈ నిర్వచ 42 329 అర్థశాస్త్ర ప్రమేయము నము ఆదర్శవాదముపై ఆధారపడినదనియు, ఏ శాస్త్ర మును అట్టి పునాదులపై ఆధారపడరాదనియు కూడ ఆ జేపింపబడినది. హిక్సు మొదలగు ఆర్థికవేత్తలకు ఈ విమర్శనము అంకుశమువలె నాటుటచేత సంక్షేమ ఆర్థిక శాస్త్రమునకు శాస్త్రయుక్తమైన పునాది నిర్మించుటకు వారు కంకణధారులైరి. కానన్ నిర్వచనమును ఇట్లు చీల్చి చెండాడిన రాబిన్సు, ఆర్థిక శాస్త్రమును. "కోర్కెలకును, బహువిధోపయోగ ములుగల పరిమితవస్తు సంచయమునకునుగల పరస్పర సంబంధముగా మానవ ప్రవర్తనమును పరిశీలించుట" అని నిర్వచించెను. కేవలము ఆశయములుగాని, సాంఘిక పరి స్థితులుగానిగాక వాటిపరస్పర సంబంధ మే ఆర్థికశాస్త్రము యొక్క పరిశీలనాంశమని కాబిన్సు అభిప్రాయము. అతనిదృష్టిలో ఆర్థిక వేత్త. ఒక మార్గమునకు సంబంధించిన వివిధాంశములను చర్చింపగలడేకాని ఆ మార్గము ఉచిత మైనదా యను విషయముపై తీర్పు చెప్పజాలడు. ఈ నిర్వచనమునగూడ లోపములు లేకపోలేదు. పైనిర్వచనము ఒక ప్రత్యేకరకపు మానవ కార్యములకు పరిమితమైయుండ, ఇది ఒక ప్రత్యేక ప్రవర్తనమునకు పరిమితమైయున్నది. అంతేగాక రాబిన్సు పేర్కొనినట్లు “పరిమితత్వము” ఆర్థిక విధాన మంతటి యొక్క యు సామాన్య లక్షణమని చెప్పుట సాహసము. అంతేగాక ఆర్థిక వేత్త ఆదర్శములపై తీర్పు చెప్ప నని మడిగట్టుకొని కూర్చుండుట అసాధ్యము, కూర్చుండుట అసాధ్యము, అవాంఛనీయమునుగూడ. పెగూ చెప్పినట్లు ఆర్థికవేకు ఇందలి కుతూహలము తత్త్వవేత్తకువలె విజ్ఞానము విజ్ఞానము కొరకేయను జిజ్ఞాసవలన కలిగినది కాదు. రోగిని నయము చేయవలయు నను ఆసక్తిగల శరీర శాస్త్రవేత్త యొక్క కుతూహలము వంటి దది. అట్టిపని అవాంఛనీయ మనుటకు కారణము ఆర్థిక వేత్త తీర్పుచెప్పుటయగునేమో అని భయపడినంత కాలము అది కేవలము ఒక సాంకేతిక శాస్త్రముగ నే మిగిలియుండి అందుండి మానవ సమస్యల పరిష్కార మార్గములు లభించుట దుర్లభ మగుటయే. అంతమాత్రముచేత రావిన్సు యొక్క నిర్వచనములో సుగుణము లేదని చెప్పరాదు. ఆ నిర్వచనము పరిమి తత్వము (Scarcity), ఎన్నిక (Choice) అను ప్రాతిపదిక