పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/389

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అర్థశావు ప్రమేయము ఖండము నుండి వచ్చినవారే. వారిలో ఇటలీ, స్పెయిను దేశాలవారు ఎక్కువమంది ఉన్నారు. ఇండియనులు అను స్థానిక వాసుల సంఖ్య 30,000 లకు మించిలేదు. ప్రజలలో పెక్కురు క్రైస్తవులు కలరు. వీరు రోమను కాథలిక్ శాఖకు చెందినవారు. 6 మొదలు 12 సంవత్స రాల వరకు పిల్లలకు ఇచట ఉచితవిద్య ఒసగబడును. 1950 లో 80,201 మంది విద్యార్థులు విశ్వవిద్యాల యాలలో చదువుచుండిరి. ఇచటి ఫెడరలు న్యాయ స్థానము, రాష్ట్ర న్యాయస్థానాలు వివాదాలను తీర్చు చున్నవి. బ్యూనాస్ ఐర్స్ అను పట్టణము అర్జెంటైనాకు రాజధాని. అక్కడ సర్వోన్నత న్యాయస్థానము (Federal Court) ఉన్నది. సైన్యములో నౌకాబలము ఎక్కువ. దానిలో 500 ఆఫీసర్లు, 11,000 నావికులు ఉన్నారు. 50 నౌకలు పనిచేయుచున్నవి. అమెరికా నుండి యుద్ధ నౌకలు కొనబడినవి. ఆర్థిక పరిస్థితులు : అర్జెంటైనాలో ముఖ్య పరిశ్రమ

పశువులను పెంచుట. ఇచ్చటి పశుసంఖ్య 8 కోట్ల 75లక్షల పరిమితి గలిగి, ప్రపంచములో చతుర్థస్థానమును ఆక్ర మించుకొనుచున్నది. అర్జెంటైన్ పశువులసంస్థద్వారమున ఈ పశు పరిశ్రమ జాతీయము చేయబడినది. ఇచటి నుండి జరుగు మాంసము యొక్క ఎగుమతి ప్రపంచములో ప్రథమ స్థానమును ఆక్రమించినది. బ్యూనాస్ ఐర్సిలో ప్రపంచములో నెల్ల మాంసము నిలువచేయు గొప్ప యంత్రాగార మొకటి ఉన్నది. అందులో ప్రతిదినము 5000 పశువులు, 10,000 గొజ్జెలు వధింపబడి, వాటి మాంసము నిలువచేయబడుచున్నది. ఇచట గోధుమపంట ఇటీవల వృద్ధిఅయినది, నూనెగింజల ఉత్పత్తిలో, వ్యాపా రములో అర్జంటై నాకు అగ్రస్థానము ఉండెడిది. ఇప్పుడు నూనెను ఈ దేశములోనే తీయుచున్నారు. గోధుమ రవ్వను తయారుచేయుట ఈ దేశములో రెండవ పెద్ద పరిశ్రమ. ఆధునిక పరిశ్రమలు స్వల్పముగా స్థాపింపబడినవి. ఇచటి విదేశ వర్తకమంతయు ప్రభుత్వమే చేయు చున్నది. · అర్జెంటైనా, పారిశ్రామిక వస్తువులను చాల భాగము దిగుమతి చేసికొనుచున్నది. ఇది ఇంచుమించు పూర్తిగా బ్రిటను దేశముతోనే విదేశ వ్యాపారమును చేయుచుం డును. కాని, వ్యాపారము అంతయు ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రములతోనే జరుగుచున్నది. పెక్కు రైలు మార్గాలు కలవు. 46,000 కిలోమీటర్ల రైలు మార్గము ప్రభుత్వము అధీనములో ఉన్నది. వ్యాపారము ఎక్కువగా నున్నది. 328 నౌకా డి. వి. కృ. అర్థశాస్త్ర ప్రమేయము :- మానవునకు గల శ క్తి, సాధనములు బహు పరిమితములు. కాని అతనికి పెక్కు కోర్కెలు గలవు. కావున ఆ అవసరములలో ఏదిముందు, ఏది వెనుక తీర్చికొనవలయునని యోచించుట అవసర మగుచున్నది. అట్లు పరిమిత శక్తి సాధనములను వివిధ అవసరములకు వినియోగించుటలో మిక్కిలి తక్కువ ప్రయత్నముతో అత్యధికమగు సంతృప్తి నొందుటకు ప్రయత్నము జరుగుట సహజము. కావున కోర్కెలు, వాని సంతృప్తి. అందులకు జరుగు ప్రయత్నము - అనునవి ఆర్థిక సమస్యలయందు ప్రధానభాగములు. నాలుగవది యైన 'మార్పిడి' (exchange) ఈనాటి ఆర్థిక సమస్య లందు ప్రాబల్యము వహించుచున్నది. ఆర్థికశాస్త్రము సంఘజీవియగు మానవునియొక్క ధన సంబంధమగు సమస్యలకు సంబంధించి యున్నది. ఇది ఒక సాంఘికశాస్త్రము. గైరొమియా అను గ్రీకు పదమునుండి పుట్టినది. గృహనిర్వహణ శాస్త్రమని ఈ పదమునకు అర్థము, మార్క్సు అను రచయిత యావత్ చరిత్రను ఆర్థిక దృష్ట్యా వ్యాఖ్యానించుటను బట్టియే ఈనాడు ఆర్థిక సమస్యలెంత ప్రాముఖ్యమైనవో తెలియ గలదు. రాజకీయ స్వాతంత్ర్యమును పొంది, ఆర్థిక స్వాతంత్ర్యము కొరకు ప్రణాళికలద్వార మనము తీవ్ర ప్రయత్నములు చేయు మనదేశమున ఈ విషయ ప్రాము ఖ్యమును గూర్చి నొక్కి చెప్పవలసిన పనిలేదు. ఒక శాస్త్రప్రమేయమును స్థూలముగా గుర్తించుట వేరు; సూక్ష్మముగా నిర్వచించుట వేరు. మరి ఆర్థిక శాస్త్రము నిర్వచించుటెట్లు? అరిస్టాటిల్ ఏనాడో దీనిని గృహనిర్వహణ శాస్త్రముగ పరిగణించెను. అతనిదృష్టిలో కోర్కెలను తృప్తిపరచుకొనుటకు సంబంధించిన అందలి భాగము సహజము; డబ్బు మార్పిడి మొదలగునవి అసహజములు. నవీనార్థిక సిద్ధాంతములకు జనకుడని చెప్పబడెడు అడమ్స్మిత్ జాతుల సంపదల స్వభావము,