పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/386

ఈ పుటను అచ్చుదిద్దలేదు

సదుపాయముల గావించియు, అరబ్బు ప్రజల క్షేమము నకై పాటుపడెను. ఇబ్న్ సౌద్ తన రాజ్యములోని వివిధ భాగములకు స్వపరిపాలనాధికారము నొసంగి, ప్రజాస్వా మిక సిద్ధాంతముల నంగీకరించెను. రెండవ ప్రపంచయుద్ధ ములో ఇబ్న్ సౌద్ రాజు తటస్థభావమును వహించి, యుద్ధపు దుష్ఫలితములనుండి తన రాజ్యమును కాపాడెను. అరేబియా యొక్క ఆధునిక చరిత్రలో ఇబ్న్ సౌద్ రాజు పరిపాలన మొక ముఖ్యఘట్టము. అరబ్బులు కేవలము వీరులుమాత్రమే కారు. వారి యందు విజ్ఞానపిపాస కూడ మిక్కుటముగ కలదు. అరబ్బీ భాష ప్రపంచములోని ఉత్తమ ప్రామాణిక భాషలలో నొకటిగ పరిగణింపబడుచున్నది. ఈ భాషయందు ప్రవక్త మహమ్మదునకుపూర్వమే ఉన్నతస్థాయికి చెందిన కవిత్వము ఆవిర్భవించెను. ఇస్లాము మతము దేశ దేశాంతరములలో వ్యాపించిన కాలమున అరబ్బీ భాషకూడ మికిలి అభివృద్ధి గాంచెను. అబ్బాసీ వంశపు ఖలీఫాల కాలమున అరబ్బీ భాష యందు అనేక శాస్త్ర గ్రంథములు రచింపబడెను. అల్ మన్సూర్, హారూన్ అల్ రషీద్ అను ఖలీఫాలు గొప్ప విద్యాపోషకులుగ ఖ్యాతివహించిరి. వారి ప్రోత్సా హము వలన గ్రీకు, పారసీక, సిరియన్ భాషలలోని అనేక ఉత్తమ గ్రంథములు అరబ్బీ భాషలోని కనువదింపబడెను. ఈ ఖలీఫాలు బాగ్దాదు, బాస్రా, క్యూఫా, బొఖారా, అలె గ్జాండ్రియా నగరములందు ఉత్తమ విద్యా కేంద్రములను గ్రంథాలయములను నెలకొల్పిరి. అరబ్బులు చారిత్రిక రచనము, భూగోళశాస్త్రము, గణితశాస్త్రము, తత్త్వ శాస్త్రము, ఖగోళశాస్త్రము, వైద్యశాస్త్రము మున్నగు విద్యలందు గొప్ప ప్రజ్ఞను సాధించి, చక్కని గ్రంథము లను రచించిరి. అరబ్బులు శిల్పకళను కూడ మిక్కిలి అభివృద్ధి కావించిరి. స్పెయిను దేశమున అరబ్బులచే నిర్మింపబడిన ప్రాచీనపు కట్టడము లిందులకు నిదర్శనము. ఇ. భా. 32° 30'; అరేబియా (భూగోళము) :- స్థాన నిరూపణము : అరేబియా ఆసియా యొక్క నైరృతి దిక్కునందు 34° 30' &; 12°45' ఉ. యొక్కయు, మరియు 60° తూ. ల యొక్కయు నడుమ వ్యాపించి యున్నది. అది పశ్చిమమున ఎఱ్ఱ సముద్రముచేతను ; అరేబియా (భూగోళము) దక్షిణమున హిందూ మహాసముద్రము చేతను, ఏడెన్ సింధు శాఖ చేతను; తూర్పునందు ఓ మెన్, సిందుశాఖల చేతను చుట్టుకొనబడియున్నది. ఉత్తరమున ఇరాక్, ఇస్రాయిల్ దేశములు అను భూ భాగములు ఎల్లలుగా నున్నవి. 325 - వాయవ్య దిశనుండి ఆగ్నేయ దిశ వరకు ఈ ద్వీప కల్పము యొక్క గరిష్ఠ దైర్ఘ్యము కాననగును. - మొత్తము విస్తీర్ణము దాదాపు 12,00,000 చదరపు మైళ్ళు. సామాన్య లక్షణములు: అరేబియా ఒక పీఠభూమి. అది నైరృతి దిశనుండి ఈశాన్య దిశ వై పునకు ఏట వాలుగా నున్నది. దాని నైరృతి దిగగ్రము మిక్కిలి ఉన్నత మైనది. నిట్రముగానున్న పడమటి అంచు ఎఱ్ఱసముద్రమట్టము నుండి 4000 అడుగులు మొదలుకొని 8000 అడుగుల ఎత్తును కలిగియున్నది. 30 మైళ్ళకు మించని వెడల్పు గలిగిన మండల మొకటి సముద్రతీరమునకును, పర్వతపాద ములకును నడుమ నేర్పడుచున్నది. ఈ పీఠభూమి యొక్క పూర్వోత్తరభాగము క్రమముగా, యూఫ్రటీసు నదివైపు నకును, పర్షియన్ సింధుశాఖ వైపునకును వాలియున్నది. పూర్వ దిశాంతమునందు జె బెల్ ల్-అఖ్తర్ పర్వత పంక్తి ఈ వాలును అడ్డగించుచున్నది. నీటివసతి లేకపోవుటవలనను, అనిశ్చిత మైన వర్షపాతము వలనను ఎడారిమొత్తములో శ్రీ భాగము మాత్రమే స్థిర నివాసమునకు యోగ్యమైయున్నది. నైరృతి ఋతుపవన ముల మార్గమునకు ఎడముగా నుండుటవలనను, ఎత్తైన కొండలు లేకపోవుటవలనను, ఇచట చాలినంత వర్షము పడదు. కాబట్టి అది వట్టి శుష్కమైన పీఠభూమి. నదులు అప్పుడప్పుడు వరదలై పొరును కాని సాధారణముగ అవి ఎండియే యుండును. అరేబియాను మూడు నై సర్గిక భాగములుగా విభజించవచ్చును. (i) ఉత్తరభాగము, (ii) మధ్యభాగము, (iii) దక్షిణ భాగము, (i) ఉత్తరభాగము :- ఇంచుమించు ఉత్తరభాగ మంతయు ఇసుకతోను రాళ్లతోను నిండియుండును. కాని కొన్ని ఋతువులలో ఉత్తమమైన పచ్చిక బయళ్ళు అక్కడ కనిపించును. జనులందరును దాదాపు స్థిరనివాసములు