పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/385

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అరేబియా (చరిత్ర) మహాపురుషులు అరబ్బులలో జన్మించిరి. కాని ఈ యుగ మున అరబ్బులలో అనేక దురాచారములుకూడ వ్యాపిం చెను. సురాపానము, ద్యూతము, పసివాలికలను సజీవ ముగ పాతి వేయుట, స్త్రీలకు సమాజములో అర్హ స్థానము లేకుండుట మున్నగు గొప్ప లోపములు వీరియందుం డెను. ఈ కాలమున యెమెన్, జీమన్, హెజాజ్, నెజ్ ప్రాంత ములలో కొన్ని చిన్న చిన్న స్వతంత్ర రాజ్యములు నెలకొని యుండెను. అందు కొన్ని కేవల నగర రాజ్యములు. వానిలో హెజాజ్ నందలి మక్కా పట్టణము ముఖ్యమైనది. ఇది పవిత్రమగు యాత్రాస్థలముగను, వ్యాపార కేంద్ర ముగనుకూడ ఖ్యాతివహించెను. ఇట్టి మక్కా నగరమున ప్రవక్తయగు మహమ్మదు జన్మించెను. ప్రవక్తయగు మహమ్మదు నూతనమగు నొక్ మత మును స్థాపించుటయేకాక, అరేబియాయం దొక బలమగు ప్రభుత్వమును నెలకొల్పి, అరబ్బు ప్రజలను సంఘటిత పరచుటకై యత్నించెను. ఆయన మరణించుసరికి పశ్చిమ అరేబియా అంతయును, మక్కా మదీనా పట్టణములును ఆయన వశమయ్యెను. మహమ్మదు తరువాత రాజ్యము నకు వచ్చిన మొదటి ఖలీఫాయగు అబూబకర్ అరేబియా రాజ్యమునంతను జయించి, ప్రభుత్వమును బలపరచెను. క్రమక్రమముగా అరబ్బులు పశ్చిమమునకు వ్యాపించి, ఆఫ్రికా, ఐరోపాఖండములలో తమ సామ్రాజ్యమును విస్తృత పరచిరి. అనేక కారణములవలన అరబ్బు రాజ్యములో అంతఃకలహము లుప్పతిల్లెను. క్రీ.శ.680 వ సంవత్సరమున, డెమాస్కస్ నగరము అరబ్బు రాజ్యము నకు ముఖ్యస్థాన మయ్యెను. ఇచ్చటినుండి పరిపాలనము కావించిన ఒమయ్యదు ఖలీఫాలు అరేబియా సామ్రాజ్య సర్వస్వమునకును ఏలికలుగ నుండిరి. వారి యనంతర మధికారముపూనిన అబ్బాసీ ఖలీఫాలు తమ కేంద్రమును బగ్దాదు నగరమునకు మార్చిరి. అందువలన క్రమముగా అరేబియా ప్రజలకును, ఖలీఫాల రాజ్యమునకును సంబంధ ములు తెగిపోయెను. ఆ రేఖియాయందు కేంద్ర ప్రభుత్వము లేదయ్యెను. అంతఃకలహములు చెలరేగి, దేశమున చిన్న రాజ్యములు 'నెలకొనెను. మహమ్మదు ప్రవక్త వారసు లగు షరీపు వంశీయులు, ఈ అంధకార యుగములో కొంత ప్రాముఖ్యమును సంపాదించిరి. కాని వారుకూడ ఈజిప్టు రాజులకును, ఆపైన కాస్ స్టాంటినోపిలునుండి గొప్ప సామ్రాజ్యమును పాలించిన తురుష్క చక్రవర్తు లకును వశులైరి. ఇది మధ్యయుగవు చరిత్ర. అరేబియా దేశము యొక్క ఆధునిక చరిత్రలో వహాబీ ఉద్యమము పేర్కొనదగినది. ఈ ఉద్యమమును ప్రారం భించిన యాతడు మహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహాబ్. ప్రవక్త మహమ్మదుచే బోధింపబడిన ఇస్లాము మతము నందు కాలక్రనుమున ప్రవేశించిన లోపములను సంస్క రించి, సత్యమగు ఇస్లాము మతమును మరల నెలకొల్ప వలెననియు, ఆనాడు అరేబియాలో వ్యాపించియున్న అంతఃక లహములను తుదముట్టించి, బలమైన యొక అరబ్బు రాజ్యమును స్థాపింపవల ముననియు, ఈ సంస్కర్త ఆశయములు. వహాబీ ఉద్యమము 18 వ శతాబ్దియందు ప్రారంభమై క్రమముగ బలపడెను. మొదటినుండియు సౌదీ వంశమువారు వహాబీ ఉద్యమమును బలపరచి, అరబ్బు జాతీయ రాష్ట్ర స్థాపనకై యత్నింపసాగిరి. ఈ ప్రయత్నములో తురుష్కులు పిరిని ప్రతిఘ 324 ఈ ఈ కథా కాలమునాటికి అరేబియా, తురుష్క సామ్రాజ్యములో నొక భాగముగ నుండుట గమ నింపదగినది. అయినను వెనుదీయక వహాబీలు రియాస్ అనుచోట తమ ముఖ్యస్థానమును నెలకొల్పి, నూతన రాజ్య స్థాపనమునకై ప్రయత్నములు సాగించిరి. 1902 సంవత్స రము నాటికి అబ్దుల్ అజీజ్ అన్నాసాద్ అనునాయకుడు వహాబీ ఉద్యమమునకు 'నేతయై దానిని బలపరచను. ఇతడు క్రమముగ తన రాజ్యమును పెంపొందించుకొని, మొదటి ప్రపంచ యుద్ధమున ఆంగ్లేయుల పదము వహించి, తురు ష్కులతో పోరాడి వారి నోడించెను. ఈ విధముగ ఇబ్న్ సౌద్ బలపడెను. ఈ రాజు మిక్కిలి రాజనీతి కుశలత గల వాడు. ఈతడు తన దేశములోని తిరుగుబాటు దారుల నణచివై చీము, బలవంతులగు నాంగ్లేయులతో స్నేహ భావము పాటించియు, నేటిబలవత్తరమగు సౌదీఆ రేబియా రాజ్యమును నెలకొల్పగల్గెను. ఈతడు ఎఱ్ఱ సముద్ర తీర మునను, పారసీక గుడ ప్రాంతమునందును గల నూనె గనులను అమెరికా కంపెనీలకు కౌలుకిచ్చి విశేషధనమును సేకరించెను. ఆ ధనమును వ్యయపరచి, అతడు తన రాజ్యమునందు గనులను త్రవ్వించియు, నీటి పారుదల