పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/384

ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ్యక్తిని ని పెరుగనిచ్చుటయే ప్రభుత్వము యొక్క ప్రధాన క ర్త వ్యమైయున్నది. సంఘము యొక్క సుఖస్థితి లక్ష్య ముగా నున్నంతవరకు ప్రతి రాజ్యాంగ ప్రణాళికయు సరియైనదే ; ప్రభుత్వము పరమోత్తమమైన ఈ లక్ష్యము నుండి విడివడినచో సరియైనది కాజాలదు. వ్యక్తి పరిపా లన రాజ పరిపాలనవలె మంచిది కావచ్చును, నిరంకుశ పాలనవలె చెడ్డది కావచ్చును; కొలదిమందిచే చేయబడు పరిపాలన ప్రభువర్గ పరిపాలన (Aristocracy) వంటిదై మంచిదగును. కొలదిమంది పెద్దల కూటమి (Oligarchy) వంటిదై చెడ్డదియగును; అందరిచే చేయబడు పరిపాలన ప్రజాప్రభుత్వము వంటిదై మంచిదిగా నుండును; జన సమూహము యొక్క అరాజకమువంటిదై చెడ్డదిగా నుండును. ప్లేటో వలెనే అరిస్టాటిల్ కూడ మానవుని, ఆదిను ప్రాకృతిక స్థితినుండి నైతికమును, వైజ్ఞానికమును అగు సంస్కృతికి తీసికొని రాగల విద్యను ఇచ్చుట ప్రభు త్వపు బాధ్యతయే యని నిర్దేశించుచున్నాడు. బానిసత్వ మును సమర్థించినందులకు అరిస్టాటిల్ అతి తీవ్రముగా విమర్శింపబడియున్నాడు. కాని ఇందులకు కారణము అతని కాలమునందలి చారిత్రక పరిస్థితులే యని సమర్థింప వచ్చును. డా. వ అరేబియా (చరిత్ర) :- అరేబియా చరిత్ర యనగా అరబ్బుల చరిత్ర, అరేబియా దేశపు ప్రజలు అర బ్బులు అనబడుదురు. కాని "అరబ్బులు" అను పదమును విశాలదృష్టితో నుపలక్షించిన యెడల. ఇందు అరేబియా దేశ వాసులు సూత్రమేకాక, ఇతర దేశములలో నివాస ముగనున్న మరికొందరు ప్రజలు కూడ చేరుదురు. ఆయా కాలములందు అరేబియా దేశవాసులు పరరాష్ట్రములను జయించి, అచ్చట పరిపాలకులుగు శాశ్వత నివాసము లేర్పరచుకొనిరి. మరికొందరు అరబ్బులు, వ్యాపారము కొరకును, ఇతర కారణములవలనను ఇతర రాజ్యము లకు వలసపోయి, అచ్చటనే శాశ్వతముగ నిలచిపోయిరి. వీరు కాలక్రమమున స్థానికులగు ప్రజలతో కలసిపోయి . నందున, ఒక సమష్టి ప్రజ యేర్పడినది. ఆ మిశ్రజాతులు కూడ నేడు అరబ్బు ప్రజలుగ పరిగణింపబడుచున్నారు. ఈ నూతన అరబ్బులు ఆకార లక్షణములందు అరేబియా 323 ఆరేబియా (చరిత్ర) నివాసులకంటే భిన్నులుగ నున్నను వారిని అరబ్బీ భాష, అరబ్బీ సభ్యత, ఇస్లాంమతము అను మూడు స్వర్ణ సూత్ర ములు ఏకస్థుల గావించి బంధించుచున్నవి. కేవలము అరేబియా దేశవాసులు 80 లక్షలకు పైబడియున్నారు. వీరు కాక ఇరాకు, సిరియా, లెబనాన్, పాలస్తీనా, ట్రాన్స్ జోర్డాన్, ఈజిప్టు, ఉత్తర సూడాన్ ప్రాంతము లలో అరబ్బీ భాష మాట్లాడువారు 33 కోట్ల ప్రజలుకలరు. లిబియా, ట్యునీసియా, అల్జీరియా, మొరాకో ప్రాంతము లందుకూడ అనేకులు అరబ్బులు నివసించుచున్నారు. కాని ప్రస్తుతము మన మీ విశాలమగు అరబ్బుజాతి చరి త్రను 'కాక, పరిమితమగు అరేబియా నివాసులు కథను సంగ్రహముగ తెలిసికొనగలము. అరేబియా నివాసుల చరిత్రను మూడు భాగము లుగ విభజింపనగును. అతి ప్రాచీన కాలమునుండి క్రీ. శ. 622 వరకు మొదటియుగము. క్రీ.శ. 622 నుండి 1750 వరకు మధ్యమ యుగము. 1750 తరువాతయుగము ఆధునిక యుగము. ఆదికాలమున అరేబియా యొక్క దక్షిణ భాగమున నాగరకులగు ప్రజలు నివసించుచుండిరి. వారికి ప్రత్యేక మగు రాజ్యమును, మతమును, భాషయు, విజ్ఞానమును ఉండెడివి. వీరు స్వచ్ఛమగు అరబ్బీజాతి వారనియు, ఉత్తర అరేబియాయందు నివసించుచు, సంచార శీలురుగానున్న బదాయూన్ అరబ్బులు మిశ్రమజాతివారనియు, ఆ దేశ ములో వాడుక గలదు. చాలకాలము వరకును ఔత రాహులగు అరబ్బులు, దాక్షిణాత్యులు యాధిక్యమును, వారి విజ్ఞానమును అంగీకరించి మెలగుచుండెడివారు. కాని క్రీస్తుశకము ప్రారంభమైన వెనుక, అరేబియాకు ఉత్తరముననున్న, సిరియా, మెసపొటోమియా రాజ్య ముల వారి ప్రభావము, ఉత్తర అరబ్బు ప్రజలపై ప్రస రింపసాగెను. ఉత్తర అరేబియాలో క్రొత్త రాజ్యములు బయలుదేరెను. ఇవి లభ్మిడ్, మసానీడ్ అను పేర్లు గలవి. ఇవి క్రైస్తవులచే పాలింపబడెను. క్రీస్తుశకము అయిదు ఆరు శతాబ్దులు అరబ్బుల చరిత్రయందొక స్వర్ణయుగము. ఆకాలమునాటి అరబ్బులు వీరులును, దేశభక్తులును, ఉదారులు నై యుండిరి. అతిథి పూజనము వారి ముఖ్య సద్గుణములలో నొకటి, ఆ కాలమున హాతించాయివంటి