పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/383

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆరిస్టాటిల్ జీవముగా నున్నది. అది భగవంతుడు. అది స్వచ్ఛక్రియ ; భావనకు భావన. అది ఆత్మ పరిజ్ఞానము (Self-conscious- ness). అది స్వయం సమగ్రమై, స్వచ్ఛమైన ఆనందమై యున్నది. అది ప్రపంచమునందు తన స్వకీయమైన క్రియా శక్తి వలన పనిచేయుటలేదు; భగవంతుని కొరకు పదా ర్థము యొక్క ఆవేదనయే ప్రపంచమును కదలునట్లుగా చేయునదై యున్నది. భగవంతునికిని పదార్థమునకును మధ్యను, స్వచ్ఛరూపమునకును స్వచ్ఛ పదార్థమునకును మధ్యను వస్తువులతో నిండిన ప్రపంచమంతయును గలదు; దీనికే ప్రకృతియని అరిస్టాటిల్ నామకరణము చేసెను. ఈ అంతర్భాగమున నున్న వస్తు ప్రపంచము చలనముల ననుభవించును. మరియు అతని తత్త్వశాస్త్ర వికాసములో చలనమును ప్రేరేపించును. అరిస్టాటిల్ ప్రాచీన మైన పైథాగరస్ భావనావిధానమునుండి కొన్ని విచిత్రము లైన అభిప్రాయములను స్వీకరించియున్నాడు. ప్రపం చము యొక్క ఆకృతి -వర్తులము గాన, వర్తులాకార చల నమే మిక్కిలి పరిపూర్ణమైనది. గ్రహములు మానవాతీత మైన తెలివిని కలిగియున్న వనియు, అవి దైవత్వమును పోలిన వనియు, వాని ప్రభావములే క్రిందనున్న భూమిపై పడుచుండు ననియు నీతడు చెప్పెను. కాని గుణసంబంధమైన భేదములన్నింటిని (Qualita- tive differences) పరిమాణ సంబంధమైన భేదములనుగా (Quantitative) మార్చుటకు చేసిన డెమాక్రిటస్ యొక్క సనాతన ప్రయత్నమును (classical attempt) అరిస్టాటిల్ ప్రతిఘటించుట ఎక్కువ ముఖ్యమైనది. గుణవిశేషణము నూతనమైనది, పరిమాణముగా మార్చుటకు శక్యము కానిది. అరిస్టాటిల్ తన మానసిక శాస్త్రమునందు, మానసిక జీవనము వివిధములైన అంతరువుల (layers) చే నిర్మింప బడినదని చెప్పుచున్నాడు; క్రింద అంతరువు లేదా పొర అంతకంటే పైనున్న దానికి పదార్థముగా నేర్పడుచున్నది. వృక్ష సంబంధమును, పశు సంబంధమును అగు ఆత్మను (Vegetive and animal soul) ఆధారముగా జేసికొని హేతువాదము లేక 'శాస్' (Reason or rous) మాన పునిలో వృద్ధిపొందుచున్నది. హేతువాదము తిరిగి క్రియా వంతము, క్రియావిరహితము (active and passive 322 aspects) అను భేదముల చేత ద్వివిధముగానున్నది. క్రియా విరహితమైన బుద్ధి వ్యక్తిగతమును, వ్యక్తి సంబంధమైన అనుభవముచే ఏర్పడునదియునై యున్నది. క్రియావంత మగు బుద్ధి వ్యక్తులందరకును సాధారణమై యున్నది ; అందుచే నది అమరమైనది. క్రియావిరహితమైన బుద్ధి వ్యక్తి గతజీవితముతో దృశ్యమానమై, దానితోనే అదృశ్య మగుచున్నది. మానవజీవితము యొక్క లక్ష్యము సుఖ స్థితిగా నుండుట (well-being). అందుచేత అరిస్టాటిల్ 'ఆనంద వాది' (hedonist) అను పదముచే సాధారణ ముగా సూచింపబడువర్గమునకు చెందినవాడని చెప్పుటకు వీలులేదు. సుఖస్థితిగానుండుట అనగా ప్రకృతితో సమ్మే శనముపొందు క్రియాకలాపము అని అతదు భావించు చున్నాడు. జ్ఞానము సౌశీల్యమునకు (Virtue) కేవలము మార్గదర్శకమగుటకు చాలియున్నదని సోక్రటీస్ తలచి నంతగా అరిస్టాటిల్ తలచియుండలేదు. వాంఛలు, భావా తి రేకములు (Passions) వీని ముట్టడి నెకరించుటకు మన వివేకముతో గూడిన అంతర్దర్శనము నిజముగా శక్తి మంతముగానుండవలెను. ఆత్మనిగ్రహము (Self-control) ఇట్టి శక్తి నొసంగగలదు; దానిని సంపాదించుటకు అల వాటుల వలనను, సాధనల వలసను మానవుడు తనకుతాను

విద్యాశిక్షితుడు కావలసి యున్నాడు. సౌశీల్యము (Virtue) రెండు పరమావధులకు ఒకసాధన మైయున్నది. ధైర్యము, తొందరపాటునకును పిరికితనమునకును ఒక మధ్యస్థాన ములోనున్నది. కనుక, అరిస్టాటిల్ యొక్క నీతిశాస్త్రము (Ethics) సమభావమునకును, ప్రశాంత స్థితికి ని (Balance and equillibrium) చెందిన నీతిశాస్త్రమై యున్నది. అరిస్టాటిల్ యొక్క "నిచ్ మాచ్ లన్” (నీతిశాస్త్రము) శీలవంతమైన జీవనమును గూర్చిన చక్క నియుదాహరణములతో నిండియున్నది; అంతియే కాక మైత్రి యొక్క విలువ కది యిచ్చెడి ప్రాముఖ్య మును బట్టి అది గ్రీకు సంప్రదాయమునకొక నిదర్శనమై యున్నది. మానవుడు సుశీలవంతమును, నీతిమంతమును అగు జీవనమును ప్రభుత్వపాలనములో మాత్రమే సంపూ ర్ణముగా నడుపగలడని అరిస్టాటిల్ ప్లేటో వలెనే పూర్తిగా నమ్మియున్నాడు. నీతిశాస్త్రము రాజకీయములలో ఒక భాగమని నిర్ధారణ చేయబడినది. నైతిక మైన మార్గములో