పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/382

ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్రమ ప్రణాళికాబద్ధమైన ప్రాధాన్యమును కలిగియున్నది. ప్లేటోవలెనే, అరిస్టాటిల్ కూడ సామాన్య ధర్మమే (the universal) వాస్తవమైన సత్యమనియు, దాని జ్ఞానము 'భావరూప దర్శనము' (concept) లో మాత్రమే లభింపగలదనియు, భావించుచున్నాడు. కాని యీతడు సర్వసామాన్య ధర్మము (the universal) ను, ప్రత్యేక ధర్మము _ (the particular) ను ఎట్టి సంబంధమును లేక యున్నవని ప్లేటోవలె భావింపక, అతనితో భేదాభిప్రాయ మును కలిగియున్నాడు. సామాన్యధర్మమునుండి అవశ్య ముగా ' ప్రత్యేకధర్మము ' ను గ్రహింపగలుగుట ఎట్లో చూపుటయే తర్కమియొక్క పనియై యున్నది. ప్రతిపాదనాత్రయ హేతువాదము (Syllogism) అరి స్టాటిల్ యొక్క తర్క సిద్ధాంతమునకు కేంద్రస్థానమై యున్నది. ఒక మధ్యపదముద్వారా మరి రెండింటినుండి ఒక న్యాయమును పరిగ్రహించుటయే అంత్యమున సాధింపబడు ఫలితము (Conclusion) గానున్నది. కావున సామాన్య ధర్మముక్రింద ప్రత్యేక ధర్మమును ప్రతి పించుట (Substitution) అను సంభావ్యత మీద అరిస్టా టిల్ యొక్క తర్కము తన దృష్టిని కేంద్రీకరించు చున్నది. “విరుద్ధ తాధర్మము" (The law of contradic- tion అనున దొక్కటిమాత్రమే ఇతడు ప్రతిపాదించిన సాధారణ సూత్రము (General Principle). ఒకే 'భావ రూప దర్శనమునకు చెందిన సంబంధము' (Conceptual Relation) యొక్క అస్తిత్వ, నా స్తిత్వములు మరియొక సంబంధమునకు అవకాశ మీయ వనియు, ఒక వస్తువు 'ఉండగలదు, లేకుండగలదు' అనిచెప్పుట సాధ్యము కాద నియు ఈ సూత్రము చెప్పుచున్నది. విభిన్నమైన సత్య ప్రపంచము మరియొకటి దృశ్య మానమగు ప్రపంచమునకు కారణమని ఆరిస్టాటిల్ భావింప లేదు. 'పరిణామ' (Evolution) సిద్ధాంతమును ప్రవేశ పెట్టి, "సారము"నకును, “కనబడుదానికి"ని (Essence and appearance) గల సంబంధము నాతడు తెలియ జెప్పుచున్నాడు. పదార్థములలో (Matter) “సారము” (Essence) తన “సంభవత" (Possibility “Potentia')తో గూడినదై మనకు దగ్గరగా నున్నది. రూపముయొక్క ప్రాప్తిచేత, అది 'నిజమైనది' ('Actu') అగుచున్నది. 'సర్వ 41 321 అరిస్టాటిల్ సామాన్యమైనది' (the universal) ప్రత్యేక మైన (the particular) దానిచేత మాత్రమే నిజమైనది అగుచున్నది. 'ప్రత్యేకమైనది' 'సర్వసామాన్యమైనదాని' యొక్క సత్య సంసిద్ధి యగుచున్నది. 'దృశ్యమానము' (Appear- ance) లో 'సారము' (Essence) యొక్క ఆత్మీయ సత్య సంసిద్ధినే అరిస్టాటిల్' 'వాస్తవికత' (Entetechy) అని పిలుచుచున్నాడు. ప్లేటో అభిప్రాయమునకు విరుద్ధ ముగా అరిస్టాటిల్ 'ప్రత్యేక వస్తువు' మాత్రమే సంపూర్ణ సత్యముగలది యని వాదించుచున్నాడు. 'వస్తువే' (Sub stance) మొట్టమొదటిదియు, పరమ ప్రధాన మైనదియు నని అతని అభిప్రాయము. వస్తువు దృశ్యమానమయ్యెడి భిన్న రీతులనుబట్టియు అందుండి సంభవమగు 'అభిధానము’ లను బట్టియు (predications) "జాతి భేదము" (categories) లేర్పడుచున్నవి. అరిస్టాటిల్ యొక్క పరిణామ తత్త్వశాస్త్రము (Metaphysics of Evolution) ననుసరించి, రూపము (Form) నకును, పదార్థము (Matter) నకును పరస్పర సంబంధము కలదు. తక్కువ స్థాయిలోని జీవికి (being) ఏది రూపమగుచున్నదో, అది అంతకంటెను పైస్థాయిలోని జీవికి ‘పదార్థము' అగుచున్నది ('Form' and 'Matter”). వస్తువులు వాని జాతులు ఇట్లు ఒక 'కొలబద్ద' (Scale) గా ఏర్పడుచున్నవి. ఇటునటు రెండువైపులను గూడ వానికి పరిమితులు గలవు. రూపముగా ఏర్పడని పదార్థము, లేదా స్వచ్ఛ సంభవత్వము (Pure possibility), మరియు స్వచ్ఛ రూపము లేదా స్వచ్ఛక్రియ (Pure form or pure act). ఇవి రెండును జీవి యొక్క క్రమములోని రెండు చివరల యందును గల హద్దులుగా నున్నవి. స్వచ్ఛ రూప మునకు పదార్థ మేమియును అవసరములేదు. అత్యుత్తమ మైన సత్యము (Highest reality) తో నది సమానము. స్వచ్ఛ సంభవత్వముగా నున్న పదార్థము చలన సూత్ర మును (Principle of movement) గాని, తనంతట తాను సత్యసిద్ధిని గాని కలిగియుండదు. స్వచ్ఛ పదార్థము (The pure matter) స్వయముగా చలనములేనిదిగా నుండును. ప్లేటో త త్త్వశాస్త్రమునందలి భగవంతుని భావనవలె అది శాశ్వత మై మార్పులేనిదియు, చలనము లేనిదియుగా నున్నది. అది పదార్థ రహితమును, పరిపూర్ణమును అగు