పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/381

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అరిస్టాటిల్ (1) పొయెటిక్స్ : ఇది సంపూర్ణ గ్రంథము కాదనియు తన ఉపన్యాసముల కొర కాతడు సిద్ధము చేసికొన్న చిత్తు ప్రణాళిక మాత్రమే యనియు కొందరి అభిప్రాయము. ఏది యెట్లున్నను దీని విలువ మాత్రము వాచ్యాతీత మైనది. అర్వాచీన సాహిత్య చర్చకంతయు నిదియే పునాది యని చెప్పవలెను. అరిస్టాటిల్ కు తెలిసిన సాహిత్యము హోమర్ మొదలగువారి కావ్యములు, గ్రీకుల ప్రాచీన దుఃఖాంత నాటకములు మాత్రమే. ఉత్తమమైన వచన వాఙ్మయమును కాని, షేక్స్పియరు వంటి మహానాటక రచయితల నాటకములను కాని ఆత డెరుగడు. అయినను ఉన్న వానినే ఆధారముగా జేసికొని ఇంచు మించుగా సార్వకాలిక మనదగిన ఉత్తమలక్షణ గ్రంథము నాతడు రచింపగలిగినాడు. ఇది క్రీ. పూ. 880 ప్రాంతముల రచింపబడినది. ఇం దైదు భాగములున్నవి. ఒక్కొక్క భాగమునందు మరల విభాగములు కలవు. కళాస్వరూ పము, మానవుని యనుకరణాభిలాష, సుఖ దుఃఖాంత నాటకముల యుత్పత్తి, దుఃఖాంతనాటక నిర్వచనము, అందలి షడ్భాగములు, వానిని గూర్చిన విపులమగు చర్చ, ఇతివృత్త విచారము, దుఃఖాంత నాటకముల ప్రయోజ నము, శైలి, ఐక్యత్రయము, విషాదాంత నాటక నాయ కుడు, మహా కావ్య లక్షణము, నాటక రచనలో సంభావ్య ములగు దోషములు, వానిని తొలగించుకొను మార్గములు మొదలగునవి చర్చింపబడినవి. ఇట్లొక క్రమపద్ధతిలో తారికముగా సాహిత్యశాస్త్రమును రచించిన ప్రథముడు అరిస్టాటిల్. అరిస్టాటిల్ సిద్ధాంతములు నేటికిని శిరోభాగ్య ములే యనుటలో నతిశయోక్తిలేదు. దుఃఖాంతనాటక ప్రయోజనమును గూర్చి నిర్వచింప కయే ఆత డుపయోగించిన “కథార్సిస్" అను పదమును, ఐక్యత్రయ సిద్ధాంతమును పెక్కు వాదోపవాదములకు, వ్యాఖ్యానములకు గురియైనవి. 'బుచెర్' అను నతోడు 'పొయెటిక్స్' కు ఆంగ్లానువాదముతోబాటు విపులము, ప్రామాణికము, ఉత్తమము నగు వ్యాఖ్యానమును గూడ రచించి ప్రకటించియున్నాడు. (2) రిటారిక్ : ఇందు మూడు భాగము లున్నవి. ఒక్కొక్క భాగమునందు మరల పెక్కు విభాగము లున్నవి. చక్కగా నుపన్యాస మిచ్చుటయే నా డొక 320 కళగా పాటింపబడినది. నాడు రాజకీయ, సాంఘిక వ్యవహారములందు పాల్గొనెడి ప్రతి గ్రీకు పౌరునకును ఉపన్యాస పాటవము ముఖ్యావసరమై యుండెను. ఉపన్యాస ప్రయోజనమేమి? శ్రోతలను వశముచేసి కొనుటయే కదా? దానిని సాధించుటకు ఉపన్యాసకుని శైలి, వాదసౌలభ్యము, క్రమపూర్వక మైన విషయ ప్రకటనము - ముఖ్యమైనవి. పినిని గూర్చిన విపులమగు చర్చయే యిందలి విషయము. పో, శ్రీ. అ. అరిస్టాటిల్ (5. త త్త్వవిషయము); -అరిస్టాటిల్ యుగ యుగముల యందలి మహోత్తమ ప్రతిభాశాలు రలో నొకడు. మనస్సంబంధమైన పాండిత్యములో అతనికి సమానులగువారు మిక్కిలి కొలదిమందిమాత్రమే కలరు. ఫలవంతమైన ఆతని అసాధారణ క్రియాకలాపమునుండి ఉద్భూతమైన రచనము చాల విస్తారమైనదిగా నుండెను. కాని అతని రచనలు చాల కొలదిమాత్రమే నేడు పదిల పరుపబడి యున్నవి. శాస్త్రీయతా లక్షణముచే అవి ప్రత్యేకముగా మిక్కిలి ప్రాధాన్యముగలపై యున్నవి. అతడు చేసిన సంవాదములలో కొన్ని సూత్రమే ఖండ ఖండములుగా నేటికి నిలిచియున్నవి. అరిస్టాటిల్ రచనలు ప్లేటో రచనల యొక్క నాజూకుతనముతో గూడిన అంద మును, ఒక మతప్రవక్త కుండెడి రసానుభూతిని కలిగి యుండవు. అయినను నిజముగా ఒక శాస్త్రీయతా బుద్ధి ప్రకర్షను ఒక విషయమును సావయవముగా పరిశీలించెడి అత్యుత్తమమైన మనస్సును అరిస్టాటిల్ రచనలు ద్యోత కము చేయుచున్నవి. అరిస్టాటిల్ యొక్క తర్కము (Logic) మానవ భావన యొక్క పరాకాష్ఠ యనియు, కొలది మార్పులు చేయుటకు గూడ అవకాళ మీయనంత పరిపూర్ణతను తనలో ఇముడ్చుకొన్నదనియు అనేక శతాబ్దములు భావింపబడియుండెను. అరిస్టాటిల్ తర్కము నెడల కాంట్ (Kant) గూడ ప్రశంసాభావమును కలిగి యుండెను. ఈ ప్రశంసాదృష్టి అతిశయోక్తితో గూడి యున్నదని ఎవరుచెప్పినను అరిస్టాటిల్ రచన యొక్క నిర్వివాదమైన ప్రాముఖ్యమును మాత్రము ఇది సూచించు చున్నది. శాస్త్రీయజ్ఞానమునకు తర్కమును ఒక సాధ నాంగముగ అరిస్టాటిల్ భావించియుండెను. ఆ పద్ధతి